కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ కన్నుమూత.!
Publish Date:Aug 20, 2026
Advertisement
కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ గురువారం (ఆగస్టు 20) మరణించారు. ఆయన వయస్సు 80 ఏళ్లు. 1984లో దేశరాజధానిని కుదిపేసిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తీహార్ జైళ్లో శిక్ష అనుభవిస్తున్న సజ్జన్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను జైలు అధికారులు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేసరికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. 1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం ఢిల్లీ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఢిల్లీలోని పాలం కాలనీ ప్రాంతంలో నవంబరు 1, 2 తేదీలలో ఐదుగురు సిక్కు పౌరుల దారుణ హత్య కేసులో సజ్జన్ కుమార్ ను ఢిల్లీ హైకోర్టు ఆయనను దోషిగా నిర్ధారిస్తూ 2018 డిసెంబరులో జీవిత ఖైదు విధించింది. కోర్టు తీర్పు వెలువడిన నాటి నుంచి ఆయన తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. దేశరాజకీయాల్లో, ముఖ్యంగా ఔటర్ ఢిల్లీ ప్రాంతంలో ఒకప్పుడు సజ్జన్ కుమార్ కాంగ్రెస్ లో కీలక నేతగా వెలుగొందారు. ఆయన ఔటర్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2018లో హైకోర్టు ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పిన వెంటనే ఆయన కాంగ్రెస్ కి రాజీనామా చేశారు. హైకోర్టు ఇచ్చిన శిక్షాకాలాన్ని సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో విచారణ దశలో ఉంది. Congress former MP Sajjan Kumar nomore, 1984 Sikh Riots, Sajjan Kumar Passed Away, Tihar Jail Convict, Anti Sikh Riots Case
http://www.teluguone.com/news/content/congress-former-mp-sajjan-kumar-nomore-36-229370.html





