Publish Date:Oct 16, 2019
మహారాష్ట్ర ఎన్నికల వేడి దేశాన్ని తాకింది. ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీ లు ఇస్తున్న హామీలు వివాదాస్పదంగా మారుతున్నాయి.వీర్ సావర్కర్ పేరు భారతరత్నకు సిఫారసు చేస్తామన్న బీజేపీ ప్రకటన రాజకీయంగా దుమారం రేపుతోంది. మహారాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కమలనాథులు తాము మరోసారి అధికారంలోకి వస్తే వీరసావర్కర్ కు భారత రత్న వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. దీని పై విపక్షాలు భగ్గుమన్నాయి. ఈ దేశాన్ని దేవుడే ఇక రక్షించాలంటూ కాంగ్రెస్ విరుచుకుపడింది. సావర్కర్ తరవాత గాడ్సే పేరును కూడా ప్రతిపాదిస్తారేమోనని వామపక్షాలు మండిపడ్డాయి. మహారాష్ట్ర లో తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తే హిందుత్వ సిద్ధాంత రూపకర్త వీర్ సావర్కర్ కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న కోసం ప్రయత్నిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని ప్రస్తావించింది. సావర్కర్ తో పాటు మహాత్మ పూలే సావిత్రిబాయి ఫూలే కు భారత రత్న కోసం కేంద్రానికి సిఫారసు చేస్తామని కూడా వెల్లడించింది. సావర్కర్ పేరును భారత రత్నకు ప్రతిపాదించాలనే బిజెపి ఆలోచనపై విపక్షాలు మండిపడుతున్నాయి.
గాంధీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడంటూ విద్యార్థులకు ఎగ్జామ్ లో ప్రశ్నలు ఇచ్చిన దేశంలో సావర్కర్ లాంటి వారికి భారత రత్న కూడా వస్తుందంటూ కాంగ్రెస్ ఎగతాలి చేసింది. మహత్మ గాంధి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి భారత రత్న ఎలా ప్రతిపాదిస్తారని కాంగ్రెస్ ప్రశ్నించింది. మరో వైపు గాంధీ నూట యాభైవ జయంతి వేడుకలు నిర్వహిస్తూ ఆయన్ను పొట్టన పెట్టుకున్న వారిని అత్యున్నత పురస్కారాలతో గౌరవిస్తారా అంటూ ప్రశ్నించింది. వామపక్షాలు కూడా బిజెపి మ్యానిఫెస్టో హామీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వీరసావర్కర్ తరువాత గాంధీని హత్య చేసిన గాడ్సే కూడా భారత రత్న ఇస్తారేమో నని సిపిఐ విమర్శించింది. రెండుదేశాల సిద్ధాంతాన్ని బలపరిచి గాంధీ హత్యలో భాగస్వామిగా ఉన్న వ్యక్తికి భారత రత్న ఎలా ప్రతిపాదిస్తారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని ప్రశ్నించింది. మొత్తాని కి మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా బిజెపి మ్యానిఫెస్టోలో చేసిన ప్రస్తావన అగ్ని రాజేసింది.ఇక మ్యానిఫెస్టోనే ఇంత గోడవలకు తావునిస్తే ఎన్నికలు ఇంకేలా జరగబోతాయన్నది చూడాల్సి ఉంటుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/congress-fires-on-bjp-maharashtra-manifesto-25-90152.html
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.