కాంగ్రెస్‌కు మ‌రో పరీక్ష!.. చేతికి గాయాలు...

Publish Date:Apr 29, 2022

Advertisement

అసెంబ్లీ ఎన్నికలకు ముందు, పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన అంతర్గత సంక్షోభం ఫలితంగా, కాంగ్రెస్ పార్టీ ఒక కీలక రాష్ట్రాన్ని చేజార్చుకుంది. అప్పటి ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర సింగ్, పార్టీ సీనియర్ నాయకుకు, మాజీ మంత్రి నవజ్యోతి సింగ్ సిద్దూ మధ్యతలెత్తిన విబేధాలు, చిలికి చిలికి గాలివానగా మారి పార్టీ ప్రతిష్టను పడగొట్టింది. చివరకు సిద్దూ కోరిన విధంగా ముఖ్యమంత్రిని మార్చినా, సిద్దూకే పీసీసీ పగ్గాలు అప్పగించినా, ఎన్నికలో హస్తం పార్టీకి ఓటమి తప్పలేదు. 

ఇప్పుడు రాజస్థాన్’లో మళ్ళీ అదే పరిస్థితి పునరావృతం అవుతోందా? అంటే అవుననే అంటున్నారు, విశ్లేషకులు. నిజానికి, విశ్లేషకులు అనడం కాదు, మూడున్నరేళ్ళుగా అడపా తడ్ఫపా అసమ్మతి రాగం వినిపిస్తున్న, కేంద్ర మాజీ మంత్రి, మాజీ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్’ కూడా అధిష్టానానికి అదే హెచ్చరిక చేస్తున్నారు. తక్షణమే రాజస్థాన్ ముఖ్యమంత్రి పగ్గాలు తనకు అప్పగించాలని లేదంటే రాజస్థాన్’లోనూ పంజాబ్ పరాజయం, పరాభవం తప్పవని నేరుగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకే లేఖ రాసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. నిజానికి, చాలా కాలంగా సచిన్ పైలట్’ అధిష్టానంపై ఆగ్రహంతో రగిలి పోతున్నారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ చీఫ్’గా పగలు రాత్రి కష్టపడి పార్టీని తాను గెలిపిస్తే, ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి పదవి అశోక్ గేహ్లోట్’కు కట్ట బెట్టారని, ఆయన అనేక సందర్భాలో బహిరంగంగానే తమ ఆవేదన, ఆగ్రహం వ్యక్త పరిచారు. ఒక దశలో ఆయన తమ వర్గం ఎమ్మెల్ల్యేలతో ఢిల్లీలో మకాం చేసి తాడో పేడో తేల్చుకుంటానని ప్రకటించారు. అలాగే, ఒక దశలో ఆయన బీజేపీలో చేరుతున్నారనే పుకార్లు వినవచ్చాయి. అయితే పైలెట్’ పార్టీని వదలలేదు కానీ, ముఖ్యమంత్రి పీఠం కోసం పోరాటం మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. 

ఇదే క్రమంలో ఇప్పుడు, అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో, అధిష్టానంపై పైలెట్ వత్తిడి పెంచుతున్నారు. రాజస్థాన్‌లో ఎన్నికలకు పట్టుమని 18 నెలల సమయం మాత్రమే వుంది. ఈ పరిస్థితుల్లో పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే, పంజాబ్’లో చేసిన తప్పు రాజస్థాన్’ లో చేయద్దని, ఎటువంటి జ్యాప్యం లేకుండా తనను  ముఖ్యమంత్రిని చేయాలని, సచిన్ పైలట్ అధిష్ఠానానికి వరసగా వర్తమానం పంపుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి నిత్యం అటు సోనియా, ఇటు రాహుల్, ప్రియాంకలకు సచిన్ పైలెట్ ఏదో ఒక రూపంలో తమ డిమాండ్’ను గుర్తు చేస్తున్నారు. పంజాబ్’లో చివరి రోజుల్లో చరణ్‌జిత్ సింగ్ ఛన్నీని ముఖ్యమంత్రిగా నియమించడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని, రాజస్థాన్‌లో కూడా అదే జరిగే అవకాశం ఉందని సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలకు సచిన్ పైలట్ సూచించినట్టు సమాచారం.

కానీ, కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్ నాయకుడైన అశోక్ గెహ్లాట్ తానేంటో ఇప్పటికే నిరూపించుకున్నారు.పైలెట్ పప్పులు తమ వద్ద ఉడకవని ఇప్పటికే అనేక సందర్భాలలో నిరుపించుకున్నారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఆయనకు ఉందని నిరుపించుకున్న ఆయన పైలెట్’కు ఎక్కడికక్కడ చెక్ పెడుతూ వచ్చారు. అధిష్ఠానం ఆదేశించినా, పైలెట్ వర్గాన్ని మంత్రి వర్గంలో చేర్చుకునే ముహూర్తాన్ని పలుమార్లు వాయిదా వేసి చివరకు ఏదో అయింది అంటే అయింది అన్నట్లుగా కానిచ్చారు. 

మరోవంక పార్టీ అధ్యక్షురాలు  సోనియా గాంధీ నమ్మకాన్ని కూడా ఆయన నిలబెట్టుకున్నారు.రెండు రోజుల కిందట ఆయన మీడియాతో మాట్లాడుతూ..నా రాజీనామా ఎప్పుడూ సోనియా గాంధీ వద్దే ఉంటుందని వ్యాఖ్యానించారు. నిజానికి, గేహ్లోట్ పార్టీలో సీనియర్ నాయకుడు మాత్రమే కాదు, సోనియా గాంధి వీరవిధేయుల్లో ఒకరు. ఒక దశలో జీ 23 నాయకులు పట్టుపడితే పార్టీ పగ్గాలు తాత్కాలికంగానే అయినా గేహ్లోట్’కు అప్పగించాలని సోనియా గాంధీ అలోచన చేసినట్లు వార్తలొచ్చాయి. అంటే, గేహ్లోట్ పవర్ ఏమిటో వేరే చెప్పనక్కర లేదు. మరో వంక సచిన్ పైలట్‌’  తనకు ముఖ్యమంత్రి పదవి తప్ప మరేది వద్దని, అది ఇస్తారో లేదో తేల్చి చెప్పాలని, రాహుల్, ప్రియాంకల వద్ద పట్టుపడుతున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తామన్నా వద్దన్నారు.రాజస్థాన్ పీసీసీ పగ్గాలు ఇస్తామన్నా అది నాకేమన్నా కొత్తనా, ఐదేళ్లు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి, రాజస్థాన్‌లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది నేనని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పుదు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అనేది ఆసక్తికరంగా మారింది.

By
en-us Political News

  
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
తెలంగాణ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ లో 13 వేల 679 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక పోతే మల్లు భట్టి విక్రమార్క మొత్తం 3 లక్షల24 వేల234 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
టి.సి. రాజన్ 1967లో స్వతంత్ర పార్టీ తరపున పలమనేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజకీయాల్లో ఆయన తన సుదీర్ఘ సేవలతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేయెన్నం శ్రీనివాస్ రెడ్డి శాసనసభ విప్‌లుగా నియమితులయ్యారు. అలాగే శాసనమండలిలో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను విప్‌లుగా నియమించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.