కాంగ్రెస్ లో అఖిలం చిచ్చు !
Publish Date:Jan 1, 2013
Advertisement
రాష్ట్ర కాంగ్రెస్ విభాగంలో తెలంగాణాఫై ఢిల్లీ లో జరిగిన అఖిల పక్ష సమావేశం చిచ్చు రగిల్చినట్లు కనిపిస్తోంది. ఈ సమావేశం అనంతరం ఆ పార్టీ నేతలు ఎవరికీ ఇష్టం వచ్చినట్లు వారు ప్రకటనలు ఇస్తూ పోతున్నారు. ఈ సమావేశం పనికిమాలిందనీ, నెల రోజుల్లోపు తెలంగాణా వస్తుందని తనకు అసలు నమ్మకం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత కె.కేశవ రావు తేల్చి చెప్పారు. మరోవైపు, రాష్ట్రం ఇప్పటిలాగే ఉంటుందని, అసలు విడిపోదని మాజీ మంత్రి, శాసనసభ్యుడు గాదె వెంకట రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. గాదె ప్రకటనఫై ఆ పార్టీ నేతలు కాస్త తీవ్రంగానే ప్రతిస్పందించారు. ఆయన ఆలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని, అసలు అలా చెప్పే అధికారం ఆయనకు పార్టీ అధిష్టానం ఇచ్చిందా అని ఓ శాసనమండలి సభ్యుడు విమర్శించారు.
మరోవైపు షిండే ప్రకటనఫై విశ్వాసం ఉంచాలని, సమస్య పరిష్కారానికి అనువైన వాతావరణం కల్పించాలని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ తన పార్టీ నేతలకు హితవు పలుకుతున్నారు. గాదె అభిప్రాయం వ్యక్తిగతం అయి ఉండవచ్చని బొత్స అన్నారు. అంతే సురేష్ రెడ్డి చెప్పింది కాంగ్రెస్ పార్టీ నిర్ణయమా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తాను ఆ సమావేశంలో ఎలాంటి వైఖరి అవలంభించాననే విషయాన్ని మాత్రమే గాదె చెపుతున్నారు.
ఇలా కాంగ్రెస్ లో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు భిన్నమైన ప్రకటనలు ఇచ్చుకొంటూ పోతున్నారు.
http://www.teluguone.com/news/content/congress-ap-telangana-24-20131.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





