ప్రియాంకకు పార్టీ పగ్గాలు? రాహుల్ వద్దంటున్న లీడర్లు...

Publish Date:Jul 1, 2021

Advertisement

కాంగ్రెస్ పార్టీ అంటే, ఆ ముగ్గురే, కాదు, ఇంకా, కీలక నేతలు చాలా మంది ఉన్నారు. అయినా, పార్టీ  నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు, మీడియా చివరకు రాజకీయ ప్రత్యర్ధులు, పార్టీలోని అసమ్మతులు అందరూ కూడా, సోనియా, రాహుల్, ప్రియాంకా ఈ ముగ్గురే, కాంగ్రెస్ పార్టీ సర్వస్వం అనే భావంతో, ఆ ముగ్గురే పార్టీ అనే అభిప్రాయంతో ఉంటారు. ఆ ముగ్గురు చుట్టూనే పార్టీ వ్యవహరాలు నడుస్తున్నాయి. నిజమే, ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా, కాంగ్రెస్ పార్టీ అంటే నెహ్రూ గాంధీ ఫ్యామిలీ, నెహ్రూ గాంధీ ఫ్యామిలీ అంటే కాంగ్రెస్ అనే అభిప్రాయమే అందరిలో బలంగా నాటుకు పోయింది. 

గత లోక్ సభ ఎన్నికల ఓటమి తర్వాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, కుటుంబం వెలుపలి వ్యక్తిని పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకోమని సీడబ్ల్యుసీ సమావేశంలో సోనియా, ప్రియాంక సమక్షంలో  ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.  అయినా నెలల తరబడి కిందా మీద పడి చివరకు, ఆ బాధ్యతలను పార్టీ వృద్ద నాయకురాలు సోనియాకే అప్పగించారు. ఇప్పటికి కూడా ఆమె ఆ మోయలేని భారాన్ని మోస్తూనే ఉన్నారు. అయితే, ఇప్పుడు మళ్ళీ పార్టీ అధ్యక్ష పదవి విషయంలో మరో కోణంలోంచి చర్చ మొదలైందని అంటున్నారు. పంజాబ్ కాంగ్రెస్’లో గత కొంత కాలంగా సాగుతున్న అంతర్యుద్ధం వ్యవహారం,చిలికి చిలికి  రాహుల్  గాంధీ, ప్రియాంకా వాద్రాల మధ్య కూడా చిచ్చు పెట్టిందని, చివరకు రాహుల్ కంటే ప్రియాంక బెటర్ అన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో బలపడుతోందని అంటున్నారు.

ఇక విషయంలోకి వెళితే, పంజాబ్ కాంగ్రెస్’లో గత కొంత కాలంగా  అంతర్యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడది తారాస్థాయికి చేరింది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ వర్గాలుగా  పార్టీ చీలిపోయింది. సిద్ధూ వర్గం ముఖ్యమంత్రిపై తిరుగుబాటు జెండా ఎగరేసింది. ముఖ్యమంత్రిని అర్జెంటుగా మార్చేయాలని, లేదంటే... అంటూ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసింది. మరో ఎనిమిది నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో పార్టీలో తలెత్తిన ఈ సంకటం, పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నేపధ్యంలోనే ఓ వంక ముఖ్యమంత్రిని మారుస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరో వంక అంతర్గత కలహాలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటిని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇరు వర్గాలను కలిసి మాట్లాడి, ఓ నివేదికను అధిష్టానానికి సమర్పించింది. 

తమ వాదనను వినిపించేందుకు సిద్దూ రాహుల్ గాంధీని కలిసే ప్రయత్నం చేశారు. అయితే, సిద్దూను కలిసేందుకు రాహుల్ గాంధీ నో’ అనేశారు. ఆయనకు అప్పాయింట్మెంట్ ఇవ్వలేదు. అయితే, అప్పటికే, రాహుల్ గాంధీని కలుస్తున్నట్లు ప్రకటించుకున్న సిద్దూ షాకయ్యారు. మరో వంక రాహుల్ గాంధీని మీడియా ప్రశ్నిస్తే, ఆయన  చిటపటలాడారు, చిందు లేశారు. ఏం మీటింగ్.. మీరేం మాట్లాడుతున్నారంటూ మీడియానే ఎదురు ప్రశ్నించారు. ఈ నేపధ్యంలో సిద్ధూ... కొంచెం చాలా అవమానానికి గురయ్యారు. కొద్దిగా నొచ్చుకున్నారు. అయితే, ఆ విషయం ఎలాగో ప్రియాంక చెవిన వేసి, ఆమె అప్పాయింట్మెంట్ కోరారు.. అడిగిందే తడవుగా ఆమె అప్పాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా మూడు గంటల సేపు సిద్దూ గోడు  విన్నారు. రాహుల్ కాదన్నా ప్రియాంక తనకు అప్పాయింట్మెంట్ ఇచ్చారని సిద్దూ ఫుల్ జోష్’లోకి వెళ్లారు. ప్రియాంకతో ఉన్న ఫోటోను ట్వీట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ బకరా అయ్యారు. రాహుల్ కంటే ప్రియాంక బెటర్ అంటూ, ఆమెకు పార్టీ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్  బయలు దేరింది. ఇటు సిద్ధూ కూడా రాహుల్’ను కార్నర్ చేసేందుకే  ఫోటోను ట్వీట్ చేశాడా అనే చర్చ కూడా జరుగుతోంది.

ఇదలా ఉంటే, సిద్దూను రాహుల్ గాంధీ అవమానపరిచిన నేపధ్యంలో, గతంలో అస్సాంకు చెందిన కీలక కాంగ్రెస్ నేత, ప్రస్తుత ఆ రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను రాహుల్ గాంధీ ఇదే విధంగా అవమాన పరిచిన విషయాన్ని కొందరు గుర్తుచేస్తున్నారు. రాహుల గాంధీ కుక్క పిల్లతో ఆడుకుంటూ, తనను పట్టించుకోక పోవడంతో అవమానానికి గురైన శర్మ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరి ఈశాన్య రాష్ట్రలలో పట్టుమని పది సీట్లు లేని పార్టీని తిరుగు లేని శక్తిగా బలోపేతం చేశారు.శర్మ కారణంగానే  వరసగా రెండవసారి అస్సాంలో బీజీపీ అధికారంలోకి  వచ్చింది. అంతే కాదు కమ్యూనిస్టుల కంచుకోట త్రిపుర సహా ఈశాన్య రాష్ట్రాలు మొత్తాని శర్మ బీజేపీ పట్టులోకి తెచ్చారు.  ఈ నేపధ్యంలో రాహుల్ వర్సెస్ ప్రియాంక అనే కోణంలో చర్చ జరుగుతోంది. ఎటూ రాహుల్ గాంధీకి అధ్యక్ష పదవి పై ఆసక్తి లేదు, రాజకీయాలు ఆయన ఫస్ట్ ప్రయారిటీ కాదు. కాబట్టి ప్రియాంకను పార్టీ అధ్యక్షురాలిని చేయాలన్న వాదనను కొందరు తెరపైకి  తెస్తున్నారు. నిజానికి, ఇది కొత్తగా వస్తున్న వాదన కూడా కాదు,అయితే, గతంలో ఆమె పార్టీ పగ్గాలు చేపట్టేందుకు అంతగా ఉత్సాహం చూపలేదు, కానీ, ఇప్పడు, అందుకు ఆమె కూడా సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే, సోనియా గాంధీకి  ఇంకా రాహుల్ మీద ఆశలు ఉన్నాయని, ఆమె ఏమంటారో చూడవలసి ఉందని కొందరు పార్టీ నాయకులు అంటున్నారు. మొత్తానికి, ప్రియాంకకు పార్టీ పగ్గాలు? ప్రస్తుతానికి ఇంకా ప్రశ్న ? గానే ఉన్నా త్వరలోనే ఆశ్చర్యార్ధక !’ మై నిలుస్తుందని, ఆమే కాబోయే కాంగ్రెస్ అద్యక్షురాలని కాంగ్రెస్ వర్గాల్లో గట్టిగావినవస్తోంది.

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.