రెండేళ్లుగా ఇంటి పన్ను బాకీ.. జగన్ కు రూల్స్ వర్తించవా! 

Publish Date:Jul 1, 2021

Advertisement

సామాన్యుల్లో ఎవరికైనా వంద లేదా 200 గజాల్లో ఇల్లు ఉండి.. దానికి ఆస్తిపన్ను సరిగ్గా కట్టకపోతే ఏం జరుగుతుంది? పెనాల్టీలు, దానిపై వడ్డీలు, చక్రవడ్డీలు వేసి వసూలు చేస్తారు. నోటీసులు అంటిస్తారు. డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్‌, ఇతర సదుపాయాలు ఆపేస్తారు. పన్ను కట్టాలంటూ ఇంటి దగ్గరకు అధికారులు వెళ్లి నానా హంగామా చేస్తారు.  చెత్తను ఆ ఇంటి ముందు వేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అధికారుల చేసే ఈ జులూం అంతా పేదలు, మధ్య తరగతి ప్రజలపైనే కనిపిస్తుంది... పెద్దల జోలికి మాత్రం వెళ్లే సాహసం చేయరు.. ఏపీలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ప్రభుత్వ పెద్దే ఇంటి పన్ను కట్టని వైనం సంచలనంగా మారింది. అధికారులు ఏం చేస్తున్నారన్నది ప్రశ్నగా మారింది... 

ఇటీవలే జగన్ రెడ్డి సర్కార్ పన్నులు పెంచింది. అసలే కొవిడ్ తో సమస్యలు పడుతున్న జనాలకు ఇది మరింత భారంగా మారింది. పన్నులు పెంచడం సరికాదని విపక్షాలు మొత్తుకుంటున్నా జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. కరెంట్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు కూడా పెంచేసింది. రిజిస్ట్రేషన్ చార్జీలు ఆఖరికి చెత్తపై కూడా పన్ను విధించారు. అయితే జనాలపై ఇష్టమెచ్చినట్లుగా పన్నులు విధించి  ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్న సీఎం జగన్ రెడ్డి మాత్రం..  తన సొంత ఇంటికి పన్ను కట్టడం మరచిపోయారు. ఏదో ఒక నెలో.. రెండు నెలలో కాదు.. ఏకంగా గత రెండేళ్లుగా జగన్ ఇంటికి పన్నులు కట్టడం లేదు .గుంటూరు జిల్లా తాడేపల్లి మునిసిపాలిటీకి జగన్ 16లక్షల రూపాయలపై పైగా బాకీ పడ్డారని లెక్కలు చెబుతున్నాయి. తాడేపల్లి మునిసిపల్‌ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఇది స్పష్టంగా ఉంది. జగన్‌ సీఎం అయినప్పటి నుంచి ఇంటికి కానీ, కార్యాలయానికి కానీ ఆస్తి పన్ను చెల్లించడంలేదు. 

ముఖ్యమంత్రి జగన్‌కు తాడేపల్లిలో భారీ నివాసం ఉంది. అందులో రెండు బ్లాక్‌లున్నాయి. 1750 చదరపు మీటర్ల పరిధిలో ఆఫీసు ఉంది. ఇందులో గ్రౌండ్‌ఫ్లోర్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌ ఉన్నాయి. మునిసిపల్‌ రికార్డు ప్రకారం దీని చిరునామా.. డోర్‌ నంబరు 12-353/2/2 పార్సివిల్లే 47, ఆంధ్రరత్న కట్ట, రెవెన్యూ వార్డు నంబరు 12, తాడేపల్లి - 522501. ఇక... ఇదే ఆవరణలో 219 చదరపు మీటర్లలో నివాసంఉంది. దీని డోర్‌ నంబర్‌ 12-353/2/5. ఇందులో గ్రౌండ్‌ ఫ్లోర్‌తోపాటు ఫస్ట్‌, సెకండ్‌ ఫ్లోర్లు ఉన్నాయి. ఈ రెండూ సీఎం సతీమణి వైఎస్‌ భారతీ రెడ్డి పేరిట ఉన్నాయి. మునిసిపల్‌ రికార్డుల ప్రకారం ఆఫీసు కోసం ఉపయోగిస్తున్న భారీ భవనాన్ని కమర్షియల్‌గా, ఇంటిని నివాస ప్రాంతంగా చూపించారు. వార్షిక రెంటల్‌ విలువను ఆఫీసుకు రూ. 13,64,131గా, ఇంటికి రూ.79,524 చూపించి... ఆ మేరకు ఆస్తి పన్ను నిర్ణయించారు. దీని ప్రకారం.. ఆఫీసుకు ఏటా రూ.4,41,980... ఇంటికి 19,752 చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంది. 

మునిసిపల్‌శాఖ వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారమే కార్యాలయంపై రూ.13,25,940 పన్ను బాకీ పడ్డారు. ఇంటికి సంబంధించి 59,256 పన్ను బకాయి ఉంది. అంటే... మునిసిపల్‌ శాఖకు జగన్‌ రూ.13,85,196 పన్ను బాకీ పడ్డారు. ఏళ్ల తరబడి పన్నులు కట్టకుండా ఉంటే మునిసిపల్‌ శాఖ ఊరుకోదు కదా.. ఆటోమేటిక్‌గా పెనాల్టీలు పడతాయి. ఆ జరిమానా రూ.2,82,103. వెరసి అసలూ, జరిమానాలు కలిపి భారతీ రెడ్డి మునిసిపల్‌ శాఖకు రూ.16,67,299 బాకీ పడ్డారు.

జగన్ ప్రభుత్వ భవనంలో నివసిస్తుంటే… దాని ఆస్తిపన్ను, ఇతర పన్నులు కూడా ప్రభుత్వమే చెల్లించేది. కానీ… జగన్‌ ఇల్లు, సీఎం క్యాంపు ఆఫీసు…ఉన్న భవనాలు ఆయన సతీమణి భారతీ రెడ్డి పేరు మీద ఉన్నాయి. రూల్స్ ప్రకారం ప్రైవేటు నివాసాల్లో సీఎం, డిప్యూటీ సీఎం ఉంటే సంబంధిత భవన యజమానే స్థానిక పన్నులు భరించాలి. ఈ నిబంధన ప్రకారం సీఎం క్యాంపు ఆఫీసు, ఇల్లుకు పన్ను భారతీ రెడ్డి చెల్లించాలి. సామాన్యులు ఇంటి పన్ను కట్టకుంటే నోటీసులు పంపి నానా యాగీ చేసే అధికారులు… ఇప్పటిదాకా భారతీ రెడ్డికి కనీసం నోటీసులు జారీ చేయకపోవడమే  విస్మయం కల్గిస్తోంది. 

జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే తాడేపల్లిలో ఆఫీసు, ఇంటి నిర్మాణం చేపట్టారు. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ఆస్తి పన్ను కట్టడంలేదు. సీఎం అయ్యారు కాబట్టి పన్ను కట్టాల్సిన అవసరం లేదని... ఆయన నివాసం, కార్యాలయానికి ప్రభుత్వమే పన్ను చెల్లించాలని ఎవరైనా అనుకోవచ్చు. కానీ... అది కుదరదు. ముఖ్యమంత్రి హోదాలో జగన్‌కు వేతనం, ఇతర అలవెన్సులు ప్రభుత్వ ఖజానా నుంచి లభిస్తాయి. ఆయన తరఫున ప్రభుత్వమే ఆదాయపు పన్ను చెల్లిస్తుంది. ఒకవేళ ఆయన ప్రభుత్వ భవనంలో నివసిస్తుంటే... దాని ఆస్తిపన్ను, ఇతర పన్నులు కూడా ప్రభుత్వమే చెల్లించేది. కానీ... జగన్‌ ఉంటున్నది ప్రైవేటు భవనాలలో. సర్కార్  నిబంధనల ప్రకారం సీఎం క్యాంపు ఆఫీసు, ఇల్లు కొలువుదీరిన భవనాలకు వైఎస్‌ భారతీ రెడ్డి పన్ను చెల్లించాలి. 

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.