కర్నాటక కాంగ్రెస్ లో రచ్చకెక్కిన విభేదాలు!?

Publish Date:Jan 12, 2025

Advertisement

కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయా? ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉన్న ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ల మధ్య పరిస్థితి ఉప్పూ నిప్పులా తయారైందా?  పైకి సయోధ్యగా ఉన్నట్లు కనిపిస్తున్నా అంతర్గతంగా వారి మధ్య విభేదాలు పార్టీ హైకమాండ్ కు తలనొప్పిగా మారాయా? అంటే పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తోంది. ఇరువురి మధ్యా విభేదాల కారణంగా పాలన సజావుగా సాగడం లేదన్న  అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. వాస్తవానికి కర్నాటక కాంగ్రెస్ లో సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య విభేదాలు కొత్తగా వచ్చినమేమీ కావు. 

వాస్తవానికి 2023 మేలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల  ఫలితాల తర్వాత, సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య ముఖ్యమంత్రి పదవి తీవ్ర పోటీ జరిగింది. అధిష్ఠానం జోక్యంతో   శివకుమార్‌ అతి కష్టం మీద ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు అంగీకరించారు. వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీని అన్ని విధాలుగా ఆదుకుని అండగా నిలబడిన డీకే శివకుమార్ నే అధిష్ఠానం ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తుందని అంతా భావించారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో సిద్ధరామయ్యకు ఆ అవకాశం దక్కింది. అప్పట్లోనే  రొటేషన్ పద్ధతిలో సీఎం సీట్ షేరింగ్ అన్న ప్రతిపాదనను అధిష్ఠానం ఇరువురి ముందూ ఉంచిందనీ, అందుకు ఇరువురినీ ఒప్పించిందనీ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం తొలి రెండున్నరేళ్లు సిద్దరామయ్య, ఆ తరువాత రెండున్నరేళ్లు డీకే శివకుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉంటారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఈ ఒప్పందం గురించి బాహాటంగా ప్రకటించలేదు. 

ఇప్పుడు సిద్దరామయ్య గడువు ముగుస్తుండటంతో డీకేకు సీఎం పదవి అన్న అంశం తెరమీదకు ప్రముఖంగా వచ్చింది. అయితే ఈ విషయంలో ఇటు సిద్దరామయ్య కానీ, డీకే శివకుమార్ కానీ పెదవి విప్పడం లేదు. వారి వారి మద్దతు దారులు మాత్రం ఎవరికి తోచిన విధంగా వారు ప్రకటనలు చేస్తూ విభేదాలను రచ్చకీడుస్తున్నారు. ప్రధానంగా ముడా కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య  ఇరుక్కోవడంతో అధిష్టానం ఆయనను తప్పిస్తుందనీ డీకే సీఎం అవుతారనీ ఆయన మద్దతుదారులు గట్టిగా చెబుతున్నారు. హైకమాండ్ ఈ విషయంలో ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. కానీ డీకే మద్దతుదారులు మాత్రం పదేపదే తమ నాయకుడికి సీఎం పదవి అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డీకే.. అటువంటి ప్రకటనలు వద్దంటూ తన మద్దతుదారులను వారించారు. తానైనా, సీఎం సిద్దరామయ్య అయినా అధిష్టానం మాటకే కట్టుబడి ఉంటామన్నారు. ఆయన వ్యాఖ్యలతో డీకే అభిమానుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. అధిష్ఠానం సిద్దరామయ్యను తప్పించి డీకేకు సీఎం పదవి కట్టబెడుతుందనీ, డీకే మాటల వెనుక ఉన్న అర్ధం అదేననీ అంటున్నారు.   

అయితే మంత్రి కేఎన్ రాజన్న మాత్రం తాజాగా శివకుమార్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కర్నాటక కాంగ్రెస్ లో ఆల్ ఈజ్ నాట్ వెల్ అని తేటతెల్లం చేశాయి. కేఎన్ రాజన్న సిద్దరామయ్యకు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు ఈ నేపథ్యంలోనే  ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇంతకీ కేఎన్ రాజన్న ఏమన్నారంటే.. ‘ఉపముఖ్యమంత్రి శివకుమార్ తన దృష్టిని వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని విజయపథంలో నడిపించడంపై దృష్టి సారిస్తే మంచిది, అంతే కానీ రెండున్నరేళ్ల ముఖ్యమంత్రి పదవి కోసం ఆలోచించడం వల్ల ప్రయోజనం ఉండదు’. ఆయన ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలోని డీకే మద్దతుదారులు భగ్గుమంటున్నారు.   దీంతో రాష్ట్ర కాంగ్రెస్ లో విభేదాలు రచ్చకెక్కినట్లైంది. ఈ పరిస్థితిని అధిష్ఠానం ఎలా సరిదిద్దుతుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమౌతోంది.  

By
en-us Political News

  
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.