పోక్సో కేసులో బండి భగీరథ్‌కు కండీషన్డ్ బెయిల్.!

Publish Date:Jul 9, 2026

Advertisement

తెలంగాణో  తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో కేసులో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌కు హైకోర్టులో బెయిలు లభించింది. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల  ఆరోపణలతో  పోక్సో కేసులో అరెస్టైన   బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు గురువారం(జులై 9)  షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.   కేసు దర్యాప్తునకు నిందితుడు పూర్తిగా సహకరించాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

గత కొన్ని వారాలుగా చర్లపల్లి జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న భగీరథ్‌కు ఈ నిర్ణయం భారీ ఊరట ఇచ్చిందనేచెప్పాలి.  మే 8న హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై పోక్సో   కేసు నమోదైంది.   మే 16వ తేదీన భగీరథ్‌ను అరెస్ట్ చేశారు. అప్పటి నుండి అంటే దాదాపు 45 రోజులకు పైగా అతడు చర్లపల్లి జైలులోనే జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. 

గురువారం (జులై 9) హైకోర్టులో బండి బగీరథ  బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య సుదీర్ఘమైన వాదనలు జరిగాయి. భగీరథ్ తరఫున హాజరైన  న్యాయవాది  నిందితుడు  విద్యార్థి దశలోనే ఉన్నాడని, సుదీర్ఘ కాలంగా జైలులో ఉండటం వల్ల అతని విలువైన విద్యా సంవత్సరం, చదువు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందని వాదించారు. గతంలో అతని బీబీఏ పరీక్షల నిమిత్తం హైకోర్టు తాత్కాలికంగా మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని  ఈ సందర్భంగా గుర్తు చేశారు.

  ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్  బెయిల్ పిటిషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు   తుది దశకు చేరుకుందని, ఈ సమయంలో నిందితుడిని బెయిలుపై విడుదల చేస్తే..  సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయనీ, అలాగే   ఆధారాలను తారుమారు చేసే ముప్పు ఉందని వాదించారు.  ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు బండి బగీరథకు కండీషన్డ్ బెయిలు మంజూరు చేసింది.   

Bandi Bhagirath Bail, Bandi Sanjay Son, POCSO Case Hyderabad, Telangana High Court, Justice K Sujana, Pet Basheerabad Police

By
en-us Political News

  
తెహతా - జెహానాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య ఉంతా-మదర్‌పూర్ ప్రాంతంలో దొంగలు.. డౌన్ లైన్‌లో ఉన్న ప్రమాదకరమైన ఓవర్ హెడ్ హైవోల్టేజ్ వైర్లను కట్ చేసి కరెంట్ సప్లై నిలిపేశారు. ఆ తరువాత వైర్లను కట్ చేసి ఎత్తుకెళ్లిపోయారు.
ఇజ్రాయెల్ నుంచి తమకు నేరుగా ఎలాంటి సమాచారం రాలేదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమరావతి రాజధాని అంశం మళ్లీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎవరూ ఊహించని ఒక అనూహ్యమైన ఘోర ఘటన చోటుచేసుకుంది.
డీఎస్పీ భీమ్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఆయన నివాసంతో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో పలుచోట్ల సోదాలు నిర్వహించారు.
మహిళా హక్కుల పరిరక్షణ, సమాజంలో లింగ సమానత్వాన్ని పెంపొందించే దిశగా అస్సాం
ఖమ్మం జిల్లా చింతకానిలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని కోరుతూ టీడీపీ నేతలు విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు
తెలంగాణలో ఓటరు జాబితాలో ఉన్న డబుల్, డూప్లికేట్ ఓట్లను తొలగించి ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది.
గగనతలంలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య విమానంలో ఊహించని సాంకేతిక లోపం తలెత్తి తీవ్ర కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా చేపడుతున్న కూల్చివేతల వ్యవహారం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది.
1000 కి.మీ. ప్రయాణించి.. గూగుల్ మ్యాప్స్‌తో వెతికి.. అప్పు తీర్చిన కేరళ స్నేహితుడు..!
పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం మధ్యాహ్నం చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి ఆయన విడుదలయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.