ఏపీలో రోడ్లకు మరొకరు బలి.. పుట్టిన కుమార్తెను కళ్లారా చూడకుండానే కానరాని లోకాలకు!

Publish Date:Oct 22, 2023

Advertisement

రాష్ట్రంలో రోడ్లన్నీ అద్దంలా మెరిసిపోవాలని.. అందుకు తగిన మార్గర్శకాలు సిద్ధం చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలిచ్చారు. ఏపీలో రోడ్లకు మహర్దశ రాబోతుందని, రూ.వేల కోట్లతో రాష్ట్రంలో రోడ్లను అభివృద్ధి చేస్తామని మంత్రులు మీడియా ముందుకొచ్చి ప్రజలకు వివరించారు.   పోనీలే ఇకనైనా రహదారి కష్టాలు తొలగిపోతాయని రాష్ట్ర ప్రజలు ఆశపడ్డారు. కానీ, ప్రకటనలకే తప్ప ఆచరణను మాత్రం సీఎం జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోరు. మంత్రులు మళ్ళీ ఆ ఊసే ఎత్తరు.  గత నాలుగేళ్ళరేళ్ళలో ప్రతి ఆరు నెలలకి ఒకసారి ఇలాంటి ప్రకటనలు రావడం.. ప్రజలు ఆశపడడం.. మన బతుకు ఇంతేలే అని రాజీ పడడం, నిరాశపడటం ప్రజలకు అలవాటైపోయింది.

 రాష్ట్రంలో గుంతల రోడ్లతో వాహనదారుల బండ్లు, ఒళ్ళు గుల్లయిపోతున్నాయి. ఏపీలో రోడ్డెక్కితే బండికి ఏది ఎక్కడ ఊడిపోతుందో అర్ధంకాకపోగా.. అసలు రోడ్డు మీదకి వెళ్లిన మనిషి తిరిగి ఇంటికి క్షేమంగానే వస్తాడా అని ఆ కుటుంబ సభ్యులు ఆందోళనతో ఎదురుచూసే పరిస్థితులు దాపురించాయి.  వర్షాకాలంలో రోడ్ల మీద గుంతలలో నీరు నిలిచి అసలు రోడ్డు ఏదో కాలువ ఏదో కూడా అర్ధం కాక ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రైవేట్ వ్యక్తుల వాహనాలే కాదు.. ఆర్టీసీ బస్సులు సైతం రోడ్ల మీద వెళ్తుండగానే చక్రాలు ఊడిపోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. ప్రతిపక్షాలు దీనిపై ఎన్నిసార్లు మొత్తుకున్నా ప్రభుత్వంలో చలనం లేదు. రోడ్లెక్కి నిరసనలు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇంకా మాట్లాడితే.. వాహన మిత్ర పేరుతో డబ్బులు ఇస్తున్నాం కదా రోడ్లు వేసేందుకు డబ్బులు ఎక్కడ ఉన్నాయని ఉల్టా మాట్లాడిన మంత్రులు కూడా ఉన్నారు. దీంతో అసలు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులు అనే మాటకు తావులేదని జనం కూడా నిర్ధారణకు వచ్చేశారు. ప్రభుతాన్ని, సీఎంను రోడ్డెక్కిన ప్రతిసారి తిట్టుకుంటూనే  గతుకుల రోడ్లపై ఒళ్లు హూనమౌతున్నా, బండ్ల రిపేర్లకు జేబులు ఖాళీ అయిపోతున్నా పట్టించుకోకుండా తిరుగుతూనే ఉన్నారు. అందుకు అలవాటు పడిపోయారు.   కానీ, అన్ని రోజులు మనవే కాదు కదా. ఎంత జాగ్రత్తగా ఉన్నా గుంతల రోడ్లు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గుంతల రోడ్ల కారణంగా  ప్రమాదాలలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జరిగిన ఓ ప్రమాదం మాత్రం మనసులు కలచివేసింది. కన్నులు చెమర్చేలా చేసింది. మనసు వికలమయ్యేలా చేసింది. పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన రామాంజని అనే మహిళ   నిండు గర్భిణీ కాగా శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు లేరు. కుటుంబ సభ్యులు ఆమెను గురజాల ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ సదుపాయాలు లేవు. దీంతో చేసేదేమీ లేక కుటుంబ సభ్యులు 70 కిలోమీటర్ల దూరంలోని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

అయితే, గర్భిణీ వెళ్లిన రోడ్లన్నీ గుంతల మయమే కావడంతో ప్రయాణం నరక ప్రాయంగా మారింది. చివరకు అదృష్టం కొద్దీ అక్కడ ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ, వారి ఆనందం ఎంతోసేపు నిలవలేదు. గురజాల ఆసుపత్రి నుండి భార్యను తరలించే సమయంలో నరసారావు పేట ఆసుపత్రిలో కూడా చేర్చుకోకపోతే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలనే ఉద్దేశ్యంతో భర్త ఆనంద్ డబ్బులు తీసుకు రావడానికి వెళ్ళాడు. గురజాల వరకు గర్భిణీకి తోడుగా వచ్చిన ఆయన శనివారం తెల్లవారుజామున ఇంటికి వెళ్లి డబ్బులు తెస్తానని వెళ్ళాడు. 

ఇంటికి వెళ్లి డబ్బులు తీసుకొని వస్తుండగా జోలకళ్ళు సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న బైక్ రోడ్డు గుంతల్లో బోల్తా పడింది. దీంతో ఆనంద్ తీవ్రంగా గాయపడ్డాడు.   స్థానికులు ఆయనను  నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదే ఆసుపత్రిలో ఆయన భార్య, అప్పుడే పుట్టిన బిడ్డ కూడా ఉన్నారు. కానీ వారిని చూసుకునే భాగ్యం ఆనంద్ కు కలుగలేదు. అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆనంద్ కన్నుమూశాడు. పుట్టిన బిడ్డను కూడా చూడకుండానే తండ్రి మృతి చెందడం అందరికీ కన్నీరు తెప్పించింది. దిక్కుమాలిన రోడ్ల కారణంగానే ఇంతటి ఘోరం జరిగిందని ఆనంద్ కుటుంబం విలపిస్తోంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్  అయ్యింది. ఇది ఒక ఆనంద్ పరిస్థితి మాత్రమే కాదని.. రాష్ట్రంలోని రోడ్ల దుస్థితి, ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం కారణంలో ప్తి రోజూ ఏదో ఒక కుటుంబంలో ఇలాంటి విషాదం నెలకొనడం పరిపాటిగా మారిందని నెటిజన్లు అంటున్నారు. 

By
en-us Political News

  
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బ‌లోపేతం, స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం, క‌మిటీల నిర్మాణం లాంటి అంశాల‌పై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్‌ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.