అల్లు అర్జున్ పై జాతీయ మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

Publish Date:Dec 20, 2024

Advertisement

సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించి నటుడు అల్లు అర్జున్ పై జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్ప-2 ప్రీమియర్స్‌కు నటీనటులను ఎవరినీ రావొద్దని చెప్పాలని తాము సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ముందుగానే సమాచారం ఇచ్చామని పోలీసులు తెలిపారు. ఘటన జరిగినప్పటి నుంచి స్పందించని సంధ్య థియేటర్ యాజమాన్యం.. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో.. బందోబస్తు చేయాలంటూ పోలీసులను కోరుతూ రాసిన లేఖను విడుదల చేసింది. దీనిపై పోలీసులు కూడా  ప్రీమియర్స్‌కు హీరో, హీరోయిన్ రావడంతో ఇక్కడ తీవ్ర స్థాయిలో జనాలు గుమిగూడే అవకాశాలు ఉన్నాయని థియేటర్ యాజమాన్యానికి సూచించామని చెప్పిన పోలీసులు. ఈ క్రమంలో ప్రీమియర్స్‌కు నటీనటులు, మూవీ టీమ్ ఎవరినీ అనుమతించవద్దంటూ థియేటర్ యాజమాన్యానికి   చిక్కడిపల్లి పోలీసులు రాతపూర్వకంగా సమాచారం ఇచ్చారు. ఆ లేఖను పోలీసులు విడుదల చేశారు.   పోలీసులు సూచనలను ఖాతరు చేయకుండా హీరో అల్లు అర్జున్ ఆరోజు థియేటర్‌కు చేరుకున్నారు. పోలీసులు ఊహించిన విధంగానే భారీ సంఖ్యలో అభిమానులు ఎగబడటం, వారిని కంట్రోల్ చేయడం కోసం అల్లు అర్జున్ పర్సనల్ సెక్యూరిటీ అభిమానులను తోసేయడంతో తోపులాట చోటు చేసుకుందని పోలీసు వర్గాలు చెప్పాయి.

అంతే కాకుండా పోలీసుల సూచనలను తుంగలోకి తొక్కి ధియేటర్ కు వచ్చిన అల్లు అర్జున్.. సైలెంట్‌గా థియేటర్‌లోకి వెళ్లకుండా నిబంధనలను ఉల్లంఘించి అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తొక్కిసలాటలో రేవతి అనే యువతి మరణించిందనీ, ఆమె కుమారుడు శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉందనీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే.. ఈ నెల 13న  అల్లు అర్జున్‌ను ఉ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి.. నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు14 రోజుల రిమాండ్ విధించింది.  దీంతో పోలీసులు ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు.

అయితే హైకోర్టు.. అల్లు అర్జున్‌కు వ్యక్తిగత పూచీకత్తుతో మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజు ఉదయం అంటే డిసెంబర్ 14న ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నేపథ్యంలోనే  ఓ వ్యక్తి  ప్రచారం మోజులో పడి ఓ యువతి మృతికి కారకులయ్యారంటూ అల్లు అర్జున్ పై జాతీయ మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.  ప్రేక్షకులను నియంత్రించడం కష్టమని పోలీసులు ముందుగానే  చెప్పినా అల్లు అర్జున్ పట్టించుకోలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.  దీనిపై జాతీయ మానవహక్కుల కమిషన్ స్పందన ఏమిటననది తెలియాల్సి ఉంది. 

By
en-us Political News

  
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.