బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి కోసం వారసుల సిగపట్లు

Publish Date:Dec 8, 2025

Advertisement

కడప జిల్లాలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం బ్రహ్మంగారి మఠం. ఇప్పుడు ఆ ఆలయ మఠ పీఠాధిపతి వ్యవహారం.. వివాదాలు, ఆరోపణలు-ప్రత్యారోపణలతో ఉత్కంఠ రేపుతోంది. పీఠాధిపతి స్థానం నాకంటే-నాకే అంటూ పూర్వ పీఠాధిపతి మొదటి భార్య, రెండవ భార్య కుమా రుల మధ్య నెలకొన్న పోటీ.. నిత్యం వివాదాల చుట్టూ తిరుగుతోంది. ఇప్పడు ఈ పరిణామాలు భక్తుల మనోభావాలపై ప్రభావం చూపుతున్నాయి.

కడప జిల్లా కందిమల్లాయపల్లె గ్రామంలో జీవ సమాధి అయ్యారు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని మఠంగా భావించి, దేవాలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి వీరబ్రహ్మంగారి కుటుంబం నుంచి ఒకరు పీఠాధిపతిగా ఉంటున్నారు. ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ఇప్పటివరకు ఇలా ఏడు తరాల వారు బ్రహ్మంగారి మఠానికి పీఠాధిపతి అయ్యారు. 2021 వరకు బ్రహ్మంగారి పీఠాధిపతిగా వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి ఉండేవారు. అయితే ఆయన మరణించడంతో పీఠాధిపతి పదవి ఖాళీ అయింది. ఇప్పుడా పదవి ఎవరికీ ఇవ్వాలన్నదే పీటముడిగా మారింది. ఇప్పుడు బ్రహ్మంగారి మఠంలో ఆధ్యాత్మికతకంటే కుటుంబ వివాదాలే భక్తులు, ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాయట. నాటి పీఠాథిపతి వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి మొదటి భార్య చంద్రావతి.. తన కుమారుడు వెంకటాద్రినే తదుపరి పీఠాధిపతిగా కొనసాగించాలని కోరుతుంటే..  రెండో భార్య మారుతి మహాలక్ష్మి తన కుమారుడు గోవిందస్వామినే పీఠాధిపతి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నాలుగేళ్లుగా నానిన ఈ వివాదం కాస్తా కోర్టు వరకూ చేరింది. అయినా ఫలితం మాత్రం రాలేదు. సీన్ కట్ చేస్తే ధార్మిక సంఘాలు ఎంట్రీ కావడంతో సమస్య మరింత జటిలంగా మారింది.

నాటి పీఠాధిపతి వెంకటేశ్వరస్వామికి మారుతి మహాలక్ష్మి భార్య కాదని.. మొదటి భార్య కుమారులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. దీంతో ఓ మహిళపై అమానవీయంగా, అసభ్యకరంగా పోస్టులు పెట్టి చిత్రీకరించడం ఏంటని రెండోభార్య మారుతిమహాలక్ష్మి నిలదీస్తున్నారు. ఇదే సమ యంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం కంటే చావే మేలంటున్నారు. అందుకే తనను రాళ్లతో కొట్టి చంపేందుకు అనుమతి ఇవ్వాలని ఏకంగా పోలీసులను కోరడం చర్చనీయాంశంగా మారింది. అటు మఠాన్ని అభివృద్ధి చేయాల్సి న బ్రహ్మంగారి వారసులు పీఠాధిపతి పదవి కోసం ఇలాంటి పనులు చేయడమేంటని భక్తులు ఆశ్చర్యపోతున్నారు.

 ఏదీ ఏమైనా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి కావాలంటే  కొన్ని అర్హతలుండాలి. వేదాంత శాస్త్రంలో ప్రాథమిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. ధార్మిక గ్రంథాలలో, మఠానికి సంబంధించిన సంప్రదాయ పరిజ్ఞానం తెలిసి ఉండాలి. మఠం శిష్యగణానికి జ్ఞానబోధ నేర్పించే సమర్థత ఉండాలంటున్నారు భక్తులు.

By
en-us Political News

  
వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా చంద్రబాబు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
పౌర విమానయాన రంగంలో సంస్కరణల కోసం రామ్మోహన్ నాయుడు విస్తృతంగా కృషి చేస్తున్నారంటూ ప్రశంసల వర్షం కురిపించారు. రామ్మోహన్ నాయుడు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఛత్తీస్ గఢ్ సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు కదలికలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి.
రైతుకు భూమితో ఉన్న అనుబంధాన్ని పోల్చడానికి ఏ బంధమూ సరిపోదు. రైతు బిడ్డ ఏ దేశమేగిగా, ఎందు కాలిడినా సొంత గడ్డ, తాను సాగు చేసిన పొలం మీదే ధ్యాస ఉంటుంది. ఎక్కడా ఇమడ లేడు.
ఇప్పటికే వంశీ మొత్తం 11 కేసులలో నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై తాజాగా మరో కేసు నమోదైంది. విజయవాడ మాచవరం పోలీసు స్టేషన్ లో ఈ కేసు నమోదైంది.
అనాధ బాలల నైపుణ్యాభివృద్దికి సహకారం అందిస్తామని ఎంఈఐఎల్ ఫౌండేషన్ డైరెక్టర్ సుధా రెడ్డి అన్నారు.
ఏఎన్ఆర్ కళాశాల విద్యార్థుల స్కాలర్షిప్ నిమిత్తం రూ.2కోట్ల రూపాయలను హీరో నాగార్జున ప్రకటించారు
జీహెచ్‌ఎంసీ వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఉమెన్ వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన యువ క్రికెటర్ శ్రీ చరణికి కూటమి ప్రభుత్వం రూ. 2.5 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని అందించింది.
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం రోజు రోజుకు పెరుగుతూపోతోంది
స్టేడియంలోని ఇరు దేశాల జెండాలను సగం ఎత్తులోనే ఎగురవేశారు. సిడ్నీలో జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంలో.. మూడో టెస్టు జరిగే ఆడిలైడ్ మైదానం లోపల, వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు.
శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు.
గంట గంటకు మారుతున్న నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం మేయర్ స్రవంతి పై గురువారం (డిసెంబర్ 18) అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైన నేపథ్యంలో కార్పొరేటర్లు పార్టీలు మారుతూ రాజకీయాన్ని రసవత్తరంగా మార్చారు. అధికార పార్టీకి మద్దతుగా ఉన్న కార్పొరేటర్లలో ఐదుగురిని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాజీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేర్చారు. దీంతో అప్రమత్తమైన తెలుగుదేశం వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ.. వైసీపీకి ఉన్న కార్పొరేటర్ లను ఒక్కొక్కరిని పార్టీలోకి చేర్చుకోవడం మొదలుపెట్టింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.