ప్రతిష్టాత్మక గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రజత పతకం సాధించిన ఏపీకీ చెందిన వల్లూరి అజయ్ బాబు.. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను ఉండవల్లి నివాసంలో కలిశారు. ఇటీవల గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామానికి చెందిన అజయ్ బాబు వెయిట్ లిఫ్టింగ్ 79 కేజీల విభాగంలో రజత పతకాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు.
కామన్వెల్త్ క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనబరచిన వల్లూరి అజయ్ బాబును ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అభినందించారు. రజత పతకం సాధించి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో తండ్రి కాంస్య పతకం సాధించగా.. కుమారుడు 16 ఏళ్ల తర్వాత రజత పతకం సాధించి రికార్డ్ సృష్టించారని ప్రశంసించారు.
వచ్చే ఒలింపిక్స్ లో పతకం సాధించడమే లక్ష్యంగా అజయ్ బాబు ముందుకు సాగాలని మంత్రి ఆకాంక్షించారు. అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం అజయ్ బాబును మంత్రి శాలువాతో సత్కరించి, ప్రత్యేక జ్ఞాపికను బహూకరించారు. ఈ కార్యక్రమంలో శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, ఎండీ ఎస్.భరణి పాల్గొన్నారు.
Commonwealth medalist Ajay, Minister Lokesh, Glasgow, Weightlifting, Vizianagaram District, CM Chandrababu
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/commonwealth-medalist-ajay-36-228198.html
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ పరిధిలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికర ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
కన్నవారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నబిడ్డలే వారిని బరువుగా భావిస్తున్న చేదు నిజాలకు అద్దం పట్టే ఘటన హరియాణాలో వెలుగుచూసింది.
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యా దపూర్వకంగా కలుసుకు న్నారు.
మల్లన్న సాగర్ జలాశయం నుంచి గోదావరి నీటిని, ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను ఫ్యూచర్ సిటీకి తరలించేలా రూట్ మ్యాప్ సిద్ధమైంది. 10 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధమైంది.
ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియాను.. అరెస్ట్ చేసి ప్రవేశపెట్టాలని సీపీకి ఆదేశాలు..!
క్యూలైన్లలో కిక్కిరిసిపోయే భక్తుల రద్దీని తట్టుకుంటూనే, అందరికీ సమయానికి అన్నప్రసాదం అందించేందుకు కదిలే డైనింగ్ టేబుళ్ల ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌పై కీలక అప్‌డేట్! రూ.11,000 కోట్ల అంచనా వ్యయంతో 38.40 కిలోమీటర్ల మేర 2 కారిడార్లు, 34 స్టేషన్ల నిర్మాణం. గన్నవరం, కేసరపల్లిలో 91 ఎకరాల భూసేకరణ వివరాలు ఇవే!
భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ 2026 టైటిల్ గెలుచుకుని హిస్టారిక్ విక్టరీ సాధించాడు. 23/35 పాయింట్లతో అమెరికాలో గ్రాండ్ చెస్ టూర్ ట్రోఫీని కైవసం చేసుకున్న ప్రజ్ఞానంద సాధించిన ఈ చారిత్రాత్మక విజయం పూర్తి వివరాలు ఇవే!
సోనీ ఇన్‌జోన్ M10S 2 గేమింగ్ మానిటర్ పూర్తి రివ్యూ! 540Hz రిఫ్రెష్ రేట్, 720Hz డ్యూయల్ మోడ్, 1,500 నిట్స్ బ్రైట్‌నెస్ మరియు 0.02ms రెస్పాన్స్ టైమ్‌తో కూడిన ఈ బెస్ట్ ఇ స్పోర్ట్స్ OLED మానిటర్ ధర మరియు ఫీచర్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నెట్‌ఫ్లిక్స్ బ్లాక్‌బస్టర్ టీన్ డ్రామా మై లైఫ్ విత్ ది వాల్టర్ బాయ్స్ సీజన్ 4కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సీజన్ 3 ముగింపు ట్విస్ట్‌లు, షూటింగ్ వివరాలు మరియు రిలీజ్ విండో గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
షియోమీ నుంచి కొత్త స్కైనోమాడ్ N70, N90 ఫుల్-సైజ్ హైబ్రిడ్ ఎస్‌యూవీలు వచ్చేశాయి. ఒక్క చుక్క పెట్రోల్ లేకుండా 314 మైళ్ల ఎలక్ట్రిక్ రేంజ్ మరియు మొత్తం 1,705 కిలోమీటర్ల కంబైన్డ్ మైలేజ్ ఇచ్చే ఈ కార్ల ఫీచర్లు, ఇంజన్ అండ్ ధర వివరాలు ఇక్కడ చూడండి!
యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ (MDR) ఛార్జీల భారాన్ని ఎవరు మోస్తారు? ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందన, కేంద్రం ప్రవేశపెట్టిన నూతన బిల్లు మరియు యూపీఐ ఛార్జీల సమగ్ర విశ్లేషణ.
మూడేళ్ల కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వరకు అత్యధిక వడ్డీని అందిస్తున్న టాప్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల వివరాలు, DICGC రూ. 5 లక్షల ఇన్సూరెన్స్ సెక్యూరిటీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.