తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు.. ఆడపిల్ల భవిష్యత్తును నాశనం చేస్తాయ్..!

Publish Date:Apr 3, 2026

Advertisement


పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆడపిల్లలను  పెంచేటప్పుడు, తల్లిదండ్రులు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. తల్లిదండ్రులు చేసే కొన్ని తప్పులు ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తాయి.  ఆడపిల్లలను పెంచే తల్లిదండ్రులు చేయకూడని తప్పులేంటి? ఆడపిల్లను పెంచేటప్పుడు తల్లిదండ్రులు దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు ఏంటి? ఆచార్య చాణక్యుడు దీని గురించి ఏం చెప్పాడు? తెలుసుకుంటే..

ఆంక్షలు, పరిమితులు..

ఆడపిల్ల అంటే  కుటుంబానికి పరువుగా  భావిస్తారు. అందువల్ల తల్లిదండ్రులు తరచుగా  ఆడపిల్లల  కలలను అల్పమైనవిగా భావించి, వాటిపై ఆంక్షలు విధిస్తుంటారు. చాణక్య నీతి ప్రకారం ఆడపిల్లల  కలలను ఎన్నడూ పరిమితం చేయకూడదు. ఆమె చదువును, వృత్తిని నిర్లక్ష్యం చేయకూడదు. ఆడపిల్ల  అభివృద్ధి చెందడానికి ప్రతి అవకాశమూ కల్పించాలి. ఆడపిల్ల చదువులో,  వృత్తిలో ఎదిగే ఇంటికి అంతులేని గౌరవ మర్యాదలు లభిస్తాయి.

స్వేచ్ఛ..

అతిగా స్వేచ్ఛ ఇవ్వడం ఎవరికీ మంచిది కాదు. అలాగే, ప్రతి విషయంలోనూ అతిగా జోక్యం చేసుకోవడం కూడా మంచిది కాదు. నిరంతరం ఆంక్షలు విధించడం మంచి ఆలోచన కాదు. అలా చేయడం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. కొడుకు అయినా, కూతురు అయినా, వారి సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను ఇవ్వాలి. కొడుకుకు అయితే అన్నీ తెలుసు వారికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు అనుకోవడం,  కూతురుకు ఏమీ తెలియదు అని ఏ విషయాన్ని ఆమె ఆలోచించకుండా,  ఆమె నిర్ణయించుకోకుండా చెయ్యడం మంచిది కాదు.

వివాహం పట్ల అబిప్రాయం..

నేటి సమాజం మారుతున్నప్పటికీ, కొందరు అమ్మాయిలు మాత్రమే  పెళ్లి విషయంలో తమ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొంతమంది తండ్రులు ఇప్పటికీ తమ కూతుళ్ల పెళ్లి విషయమై వారి అభిప్రాయం తెలుసుకోరు. నేటికీ కూతుళ్లకు బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్న తల్లిదండ్రులు ఉంటున్నారు.  సమాజపు ఒత్తిడికి లొంగి కూతురికి పెళ్లి చేయడం లేదా అనారోగ్యకరమైన బంధంలోనే ఉండమని ఒత్తిడి చేయడం మంచిది కాదు.

పెంపకం..

కూతుళ్ల పెంపకం రెండు విధాలుగా ఉంటుంది.  కొందరు ఆడపిల్లను ప్రేమగా పెంచుతారు.  అలాంటి వారు కూతుళ్లతో ప్రేమగా, స్నేహంగా అన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడేలా పెంచుతారు. కానీ కొందరు భయం గుప్పెట్లో పెంచుతారు. ఇలాంటి పెంపకంలో ఆడపిల్లలు తల్లిదండ్రుల దగ్గర, పెద్ద వారి దగ్గర,  సమాజంలోని వ్యక్తుల దగ్గర కూడా నోరు విప్పాలంటే భయపడుతుంది. దీని వల్ల ఆడపిల్ల తనను తాను కోల్పోతుంది.

                                   *రూపశ్రీ.

By
en-us Political News

  
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు...
జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు  తన సాధన,  ఆధ్యాత్మిక మార్గం ద్వారా  మహావీరుడిగా  పరివర్తన చెందాడు.  అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.