రోజూ చేసే ఈ చిన్న తప్పులే డయాబెటిస్ రావడానికి కారణం అవుతాయి..!

Publish Date:Feb 9, 2026

Advertisement


డయాబెటిస్ చాలామందిని కుదిపేస్తున్న సమస్య.  ఒకప్పుడు 60ఏళ్ళు దాటిన వృద్దులలో డయాబెటిస్ కనిపించేది. కానీ నేటి కాలంలో మాత్రం 30 ఏళ్లు కూడా నిండకనే డయాబెటిస్ బారిన పడుతున్నారు.  మరీ దారుణం ఏమిటంటే.. చిన్న పిల్లలలో కూడా డయాబెటిస్ సమస్య ఉంటోంది. అయితే రోజువారీ జీవితంలో చేసే చిన్న తప్పులే డయాబెటిస్ రావడానికి కారణం అవుతున్నాయని ఆరోగ్య నిపుణులు,  పరిశోధకులు అంటున్నారు.  ఇంతకీ డయాబెటిస్ రావడానికి రోజువారీ జీవితంలో చేస్తున్న తప్పులేంటి? తెలుసుకుంటే..


జన్యు సమస్య కాదు..

డయాబెటిస్ అనేది తల్లిదండ్రుల నుండి వస్తుందని చాలా మంది అనుకుంటారు.   దీన్ని జన్యు పరమైన సమస్యగా చెబుతారు. అయితే డయాబెటిస్  ఎక్కువగా  ఆధునిక జీవనసైలి,  ఆహారం, శరీరానికి కష్టం లేకపోవడం వంటి అలవాట్ల వల్ల వస్తోంది.

ప్రాచీన ఆయుర్వేదం ఏం చెప్పిందంటే..

ప్రాచీన భారతీయ గ్రంథాలు అయిన చరక సంహితలో చరకాచార్యుడు డయాబెటిస్ ను మధుమేహం గా వివరించాడు. మూత్రంలో తీపి రుచి ఉండటం ద్వారా దీన్ని గుర్తించారట.

సుశ్రుత సంహితలో సుశ్రుతుడు 20రకాల మధుమేహాలను చెప్పి వీటి లక్షణాలు,  కారణాలు,  చికిత్సలను కూడా తెలిపాడు.

పై విషయాలను బట్టి చూస్తే.. మధుమేహం అనేది పూర్వ కాలం నుండే ఉన్నా.. అది నేటికాలంలో మనుషుల జీవితాలను చాలా ప్రభావితం చేస్తోంది.  

ఇన్సులిన్ వ్యవస్థ..

శరీరంలో ఇన్సులిన్ వ్యవస్థ ఉంటుంది.  ఈ వ్యవస్థను పాడు చేసే చిన్న చిన్న అలవాట్లు ఉంటాయి.  వీటిని చాలా వరకు ఎంతోమంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇది డయాబెటిస్ రావడానికి కారణం అవుతుంది.

అల్పాహారం..

అల్పాహారాన్ని దాటవేడయం వల్ల శరీరంలో ఇన్సులిన్ ప్రతిస్పందనకు అంతరాయం కలుగుతుంది. బోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి.  ఇది క్రమంగా డయాబెటిస్ కు దారితీస్తుంది.

ఎక్కువ సేపు కూర్చోవడం..

ఒకప్పుడు బాగా పని చేసి.. అలసిపోయినప్పుడు కొద్దిసేపు కూర్చొనేవారు.  కానీ నేటికాలంలో ఆఫీసులలో గంటలు గంటలు కూర్చుని పనిచేయడం.. నాలుగు గంటలకు ఒకసారి బ్రేక్ పేరుతో కొద్దిసేపు లేచి తిరగడం చేస్తున్నారు. దీని వల్ల శరీర కణాలు ఇన్సులిన్ కు సున్నితంగా మారిపోతాయి. శరీరం గ్లూకోజ్ శోషణను ఇది నెమ్మదిస్తుంది.  ఇది శరీరంలో గ్లూకోజ్ పేరుకోవడానికి దారి తీస్తుంది.

 ఆలస్యంగా,  భారీగా తినడం..

రాత్రి భోజనం ఎప్పుడూ 7 లేదా 8 గంటల లోపు తినాలని చెబుతుంటారు. గూట్లో దీపం నోట్లో ముద్ద అన్నారు పెద్దలు.  అంటే సాయంత్రం ఇంట్లో దీపం వేయడం, రాత్రి ఆహారం తీసుకోవడం ఒకేసారి జరగాలని దీని ఉద్దేశ్యం.  అంతలోపు తీసుకోకపోయినా కనీసం 7 నుండి 8 లోపు తీసుకోవాలి.  కానీ  ఆలస్యంగా 10 గంటలకు పైన లేదా 11 గంటలకు పైన తినడం, అది కూడా చాలా భారీగా  తినడం చేస్తుంటారు. ఈ అలవాటు కొన్ని నెలలు,  ఏళ్ల పాటు కొనసాగితే డయాబెటిస్ పక్కాగా వస్తుంది.

                                  *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

By
en-us Political News

  
నేటి వేగవంతమైన ప్రపంచంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ఒక విలాసం కాదు, అది ఒక అవసరం. మీ ఫిట్‌నెస్ ప్రయాణాన్ని సరైన దిశలో నడిపించడానికి ఈ క్రింది సమగ్ర సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
చాలామందికి బాదం పప్పు గురించి తెలిసి ఉంటుంది. కానీ బాదం బంక అనే పేరు బహుశా చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది.  కానీ బాదం బంక ఆరోగ్యానికి చాలామంచిదని చెబుతారు.  బాదం బంకను నీటిలో నానబెట్టుకుని తింటుంటారు.
నేటికాలంలో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం చాలా సాధారణం అయిపోయింది.   ఏ వయసు వారికైనా ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల పిల్లలు,  యువకులలో కిడ్నీలో రాళ్ల సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి...
తలనొప్పి చాలా కామన్ గా అందరికీ వచ్చే సమస్య.  ఆఫీసు ఒత్తిళ్లు, దినచర్య క్రమంగా ఉండకపోవడం,   భోజనం ఆలస్యం కావడం,  సరిపడని ఆహారం తినడం వంటివి  తలనొప్పి కలిగిస్తూ ఉంటాయి. కానీ ప్రతి తలనొప్పి...
మునక్కాడల గురించి అందరికీ తెలిసే ఉంటుంది.  మునక్కాడలను వివిధ వంటకాల తయారీలో వాడుతూ ఉంటారు. అయితే మునగాకు గురించి చాలామందికి తెలియదు...
భారతీయులు ఆహార ప్రియులు.  భారతీయుల భోజనంలో చాలా రకాలు పదార్థాలు ఉంటాయి.  ముఖ్యంగా చాలామంది తమ భోజనంలో కొంచెం అన్నం  చపాతీ,  రెండు లేదా మూడు రకాల కూరలు.. ఇలా ఉండేలా చూసుకుంటారు...
ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. అయితే శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తేనే  ఆరోగ్యం బాగుంటుంది...
వంటింట్లో సుగంధ ద్రవ్యాలు చాలా ఉంటాయి.  ఇవి అటు వంటలను ఘుమఘుమలాడించడమే కాకుండా.. ఇటు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.  చాలామంది రక్తంలో చక్కెర నియంత్రణకు,  ఇన్సులిన్ నిరోధకతకు పిసిఏస్ లేదా జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం...
శీతాకాలంలో మార్కెట్ లో పచ్చి బఠానీలు అందుబాటులోకి వస్తాయి.  భారతీయ కూరలు,  మసాలా రైస్, వెజిటబుల్ రైస్, కూరగాయలు అన్నీ కలిపి వండే కూరలు, గ్రేవీలు, సూపుల  నుండి స్నాక్స్ వరకు బఠానీలు ప్రతి వంటకం..
నేటి వేగవంతమైన జీవితంలో, మనం చిన్న చిన్న అలవాట్ల విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు . కామన్ గా  ఆఫీసులో, ఇంట్లో లేదా బయటకు వెళ్లినప్పుడు నిలబడి నీరు తాగుతుంటారు.   దీని వల్ల ఏం జురుగుతుందనే..
ఆహారం శరీరానికి చాలా ముఖ్యమైనది.  శరీరానికి అన్ని పోషకాలు లభించాలంటే ఆయా పోషకాలు సమృద్దిగా ఉన్న ఆహారాలు తినాలని చెబుతారు పెద్దలు, వైద్యులు.  అయితే కొన్ని రకాల ఆహారాలు ఎంత తిన్నా వాటిలోని పోషకాలు..
ఆహారం ప్రతి జీవికి శక్తివనరు.  ప్రాణం లేని వాహనాలు కూడా వాటికి ఇంధనం  ఉంటేనే పని చేస్తాయి. అలాంటి ప్రాణం ఉన్న జీవులకు ఆహారం చాలా ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ప్రాణం ఉన్న జీవులలో ఈ ప్రపంచంలో మనిషి చాలా ప్రత్యేకం.  అయితే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి...
ఒకప్పుడు సొంపు చాలా మందికి తెలియదు. జీలకర్రను పోలిన సొంపు చాలా మంచి సువాసనతో ఉంటుంది. కొన్నిరకాల వంటల్లో సొంపును వాడతారు. మరికొందరు సొంపును భోజనం తర్వాత జీర్ణశక్తి కోసం తీసుకుంటారు. రెస్టారెంట్లలో భారీ భోజనం తిన్న తరువాత సొంపు ఇవ్వడం వెనుక కారణం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.