ప్రజావేదిక.. వృథా అయిన ప్రజాధనం అధికారుల నుంచి రికవరీ?
Publish Date:Jun 27, 2019
Advertisement
గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన 'ప్రజావేదిక' అక్రమ కట్టడమని ఏపీ సీఎం వైఎస్ జగన్ దాన్ని కూలగొట్టించిన సంగతి తెలిసిందే. అయితే ప్రజావేదిక కూల్చి వేయడం మూలంగా ప్రజాధనం వృధా అయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ప్రజావేదిక విషయంలో అధికారుల తీరును తప్పు పడుతున్నారు. తాజాగా అధికారులను ప్రశ్నిస్తూ ఓ వ్యక్తి రాసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. "ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కట్టమన్నారు. వెంటనే ఆఘమేఘాల మీద కోట్లాది రూపాయల ఖర్చుతో కట్టారు. ఈనాటి ముఖ్యమంత్రి జగన్ గారు అది అక్రమం అని కూలగొట్టమన్నారుఅంతే ఆఘమేఘాల మీద కూలగొట్టారు. ప్రజాప్రతినిధులు కేవలం తమ ఆలోచనలు, సలహాలు,సూచనలు, ఆదేశాలు మాత్రమే ఇస్తారు.కానీ వాటిని చట్టపరిధిలో,న్యాయపరిధిలో ఆలోచించి అమలుపరచవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులుది. #ఆరోజు అధికారులుకి ప్రజావేదిక "సక్రమ కట్టడం" ఎలా అయ్యింది? #ఈరోజు అధికారులకి ప్రజావేదిక "అక్రమ కట్టడం" ఎలా అయ్యింది? ప్రజావేదిక అంశం ప్రభుత్వ అధికారులకి గుణపాఠం కావాలి.దీనిమీద న్యాయస్థానం వారు సుమోటోగా కేసు స్వీకరించాలి. సోషల్ మీడియాలో ఎంతోమంది విద్యావంతులు, మేధావులు, న్యాయవాదులు వున్నారు. దీనిమీద న్యాయ పోరాటం చేద్దాము. ప్రజాస్వామ్య విధానంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా విధానాలు మారితే కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవుతుంది. ఇందులో నూటికి నూరుశాతం అధికారుల తప్పు. వృథా అయిన ప్రజాధనం సంబంధిత అధికారుల నుంచి రికవరీ చేస్తే భవిష్యత్తు లో ఇలాంటి పొరపాట్లు జరగవు.దయవుంచి ఆలోచించండి." పోస్ట్ లో పేర్కొన్నారు.
ఇందులో నష్టం పోయింది ప్రజాధనం. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు.?
ప్రభుత్వ పాలన అంటే రెండు పార్టీల మధ్య వైరి,విద్వేషాలు కావుకదా?.
http://www.teluguone.com/news/content/common-man-slams-govt-officers-over-praja-vedika-39-87627.html





