గుంటూరు ఈస్ట్ అక్కుంబక్కుం.. కమేడియన్ ఆలీ ఎంద చేట..

Publish Date:Jan 3, 2024

Advertisement

జగమెరిగిన కమెడియన్ అలీకి జగన్ గత తొమ్మిదేళ్లుగా అరచేతిలో వైకుంఠం చూపించి మరీ త్రిశంకు స్వర్గంలో ఉంచుతున్నారు.  బాలా నటుడిగా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన  అలీ ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదుగుతూ.. వందల్లో కాదు వేల సినిమాల్లో నటించారు. కమెడియన్ గానే కాకుండా  కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించి మెప్పించారు. అంతే కాకుండా అలీ తో సరదాగా  అనే కార్యక్రమంతో టీవీ యాంకర్  గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  మొత్తంగా తెలుగు సినిమా చరిత్రలో అలీ తనకంటూ ఒక స్థానాన్ని గౌరవాన్ని సంపాదించుకున్నారు. అందులో సందేహం లేదు. 

 అయితే   ఎప్పుడైతే ఆలీ బుర్రలోకి రాజకీయం అనే పురుగు దూరిందో.. అప్పటి నుంచీ అలీ తన కీర్తిని, ప్రతిష్టను వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్ కు తాకట్టు పెట్టేసి మరీ ఆశగా చట్ట సభలో ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆయన కళ్లు కాయలు కాస్తున్నాయే తప్ప జగన్ మాత్రం అలీకి ఆ అవకాశం ఇవ్వడం లేదు. కానీ ప్రతి సారీ జగన్ మాత్రం ఎంతో నమ్మకంగా అలీకి మంచి అవకాశం ఇస్తానని చెబుతూ వస్తున్నారు. గతంలో ఒక సారి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆలీని లంచ్ కి ఇన్వైట్ చేసి మరీ త్వరలోనే గుడ్ న్యూస్ చేపుతానంటే, రాజ్యసభ గ్యారంటీ అని గాలిలో మేడలు కట్టేశారు. అయితే  ఎంపీ, ఎమ్మెల్యే కాదంటే చివరకు ఏదో ఒక నామినేటెడ్ పదవి అంటూ కలలు కనేశారు.  అలా జగన్ ఆలీని ఊరించి ఊరించి ఎట్టకేలకు ఒక నామినేటెడ్  కట్టబెట్టి చేతులు దులిపేసుకున్నారు.  ఈ సారి కుదరలేదు.. నెక్స్ట్ టైం గ్యారంటీ అంటూ 2019 ఎన్నికలలో రిక్త హస్తం చూపించిన జగన్.. 2024 ఎన్నికల వరకూ ఆలీని కలల ప్రపంచంలో ఊరేగించారు. 

ఇక్కడ ఒక్క సారి గతంలోకి వెడితే అలీ రాజకీయ ప్రవేశం ట్రయల్స్  తెలుగు దేశం టికెట్ కోసం ప్రయత్నించడంతో మొదలయ్యాయి.  అప్పట్లో తెలుగుదేశం తరఫున రాజమండ్రి నుంచి టికెట్ ఖరారైపోయిందన్న స్థాయిలో ప్రచారం జరిగింది. అయితే  ఆ ప్రచారం అంతా ఉత్తుత్తిదే అని తరువాత తేలిందనుకోండి అది వేరే సంగతి.  ఆ తరువాత అలీ సినిమా పరిశ్రమలో తనకు అత్యంత ఆప్తుడు, మిత్రుడు అని చెప్పుకునే  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలో చేరి రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉవ్విళ్లూరారు. అయితే అప్పట్లో టీడీపీ, జనసేన  పార్టీలకు బాగా దగ్గరగా మెసిలిన  అలీ..  ఆ రెండు పార్టీలలో టికెట్ రాదన్న కన్ఫర్మ్ చేసుకున్న తరువాత  జగన్ పంచన చేరి వైసీపీ కండువా కప్పుకున్నారు.  

2019 ఎన్నికలలో వైసీపీ తరఫున పలు నియోజకవర్గాల్లో ప్రచారం కూడా నిర్వహించారు. అయితే  ఆయనకు ఆశించిన విధంగా ఎమ్మెల్యే టికెట్ మాత్రం రాలేదు.  పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తీరిగ్గా మూడేళ్లు గడిచిపోయిన తరువాత పార్టీకి అలీ చేసిన సేవలను గుర్తించిన జగన్  ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవితో సరి పెట్టారు. అప్పటికే అన్ని ఆశలూ వదిలేసుకున్న అలీ  సలహాదారు పదవితో సంబరపడిపోయి.. తన స్థాయికి మించిన ప్రకటనలు చేశారు.  సినీ పరిశ్రమలో అలీ తనకు అత్యంత ఆప్తుడిగా చెప్పుకునే పవన్ కల్యాణ్ పైనే పోటీకి సై అంటూ కామెడీ డైలాగులతో సవాళ్ళూ చేసేశారు.  

ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే.. సలహాదారు పదవితో సముదాయించిన సందర్భంలోనే జగన్ వచ్చే ఎన్నికలలో అసెంబ్లీకి పోటీ చేసే చాన్స్ ఇస్తానని హామీ ఇచ్చారని అలీ అప్పట్లో చెప్పుకున్నారు.  అంతే కాకుండా 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ గ్యారంటీ అన్న ధీమాతో, అదీ గుంటూరు ఈస్ట్ అయితే తనకు అన్ని విధాలుగా విజయావకాశాలు ఉంటాయనీ భావించి అక్కడ పని చేసుకోవడం ప్రారంభించారు. అయితే జగన్  ప్రకటించిన నియోజకవర్గాల ఇన్ చార్జిల జాబితాలో గుంటూరు ఈస్ట్ నుంచి ఆలీ పేరు లేదు. అక్కడ నుంచి షేక్ నూరి ఫాతిమాను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేశారు. దీంతో ఆలీకి జగన్ మరోసారి రిక్తహస్తమే చూపారని తేటతెల్లమైపోయింది.  మొత్తం మీద అన్నం పెట్టిన సినీ పరిశ్రమలో అయిన వాళ్లని కాదనుకుని మరీ జగన్ పంచన చేరిన అలీ తన ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆశలు మరోసారి ఆవిరైపోయాయనే అంటున్నారు.   

By
en-us Political News

  
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు.
కేవలం మర్యాదపూర్వక భేటీలుగా వీటిని చూడలేమని, దీని వెనుక తెలంగాణలో ఎన్డీయే కూటమిని బలోపేతం చేసే భారీ వ్యూహం దాగి ఉందనీ ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు నివాసంలో గంటకు పైగా గడపడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం వెనుక లోతైన రాజకీయ అర్థాలు ఉన్నాయన్నారు.
తమిళనాడు ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా సుమారు రూ.48వేల‌ కోట్ల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం మూసివేసినవి కేవలం 717 దుకాణాలు మాత్రమే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో ఇది కేవ‌లం 15శాతం మాత్ర‌మే. ఇందువల్ల ఆదాయంలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ, అది భారీ నష్టం కాకపోవచ్చు.
తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన నటుడు దళపతి విజయ్… ప్రత్యేకతను చాటుతున్నారు. తమిళ సంప్రదాయానికి భిన్నంగా పంచెకట్టును పక్కనపెట్టేసిన విజయ్, సూట్ వేసుకుని మరీ ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అది పక్కన పెడితే.. రాజకీయాలలో విలువలకు పెద్ద పీట వేస్తాననడానికి సంకేతంగా సీఎం హోదాలో విజయ్ తాజా మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
పార్టీలోని ఒక కీలక వర్గం దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం వైపు మొగ్గు చూపుతోంది. విలుప్పురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సి.వి. షణ్ముగం, ఆయన వర్గంలోని కీలక నేతలు విజయ్ పార్టీ వైపు చూస్తున్నారన్న చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది.
అభిషేక్ బెనర్జీ గత దశాబ్దంగా అత్యున్నత స్థాయి భద్రతా వలయంలో ఉంటూ వచ్చారు. అయితే సోమవారం సాయంత్రం జారీ చేసిన పరిపాలనా ఉత్తర్వుల ప్రకారం, ఆయనకు కేటాయించిన అదనపు సెక్యూరిటీ సిబ్బందిని, ప్రత్యేక పైలట్ వాహనాలను ఉపసంహరించారు. ఇకపై ఆయనకు ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడికి ఉండే భద్రత మాత్రమే ఉంటుంది.
కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) కీలక నిర్ణయం తీసుకుంది.
మాములుగా మోడీ లోకేష్ తో క్లోజ్ గా ఉండే ఫోటోల‌కే లెక్క‌లేన‌న్ని కామెంట్లు వ‌స్తుంటాయి. అలాంటిది లోకేష్ త‌న‌యుడికి కూడా మోడీ ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగా ముచ్చటించడం ప్రాథాన్యత సంతరించుకుంది. చంద్రబాబు, లోకేష్ తో పాటు నారా వారి ఇంట మూడో తరం పిల్లవాడు దేవాన్ష్ కు కూడా ప్రధాని మోడీ ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణాలేంటంటూ.. నెటిజనులు పలు విధాలుగా స్పందిస్తున్నారు.
డీఎంకే శాసన సభాపక్ష ఉపనేతగా పార్టీ సీనియర్ నాయకుడు కేఎన్ నెహ్రూ, పార్టీ విప్‌గా ఈవీ వేలు నియమితులయ్యారు. అంతకు ముందు డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. కూటమిని వీడిన కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ఈ సమావేశం తీర్మానం చేసింది.
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఇందు కోసం చంద్రబాబు సోమవారం (మే 11) ఉదయం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆయన అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
ప్రధాని మోడీ తమ నివాసానికి వచ్చిన సందర్భంగా ఆయనతో కుటుంబం దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా.. దానికి ఒక భావోద్వేగ వ్యాఖ్యను జోడించారు. మా ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటానని ప్రధానికి ప్రామిస్ చేశానని పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం తనతో చేతులు కలపితే.. పూర్తి స్థాయిలో సాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ప్రధాని రేవంత్ కు ఇచ్చిన ఆఫర్ సంచలనం రేపింది. రేవంత్ ను బీజేపీలో చేరమని ప్రధాని కోరుతున్నారా? అంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.
త‌న ప్ర‌భుత్వ అప్పుల‌పై విజ‌య్ విమ‌ర్శ‌లు గుప్పించి, హామీల అమ‌లు నుంచి త‌ప్పించుకోడానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఈ మేర‌కు విజ‌య్ ఆరోప‌ణ‌ల‌పై స్టాలిన్ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. మోస‌పూరిత ప్ర‌క‌ట‌న‌ల‌తో ప్ర‌జ‌ల్ని త‌ప్పుదారి ప‌ట్టించొద్ద‌ని హిత‌వు చెబుతూనే.. ఉచిత విద్యుత్‌, మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణా అడ్డుకునేందుకు మొద‌టి సంత‌కం చేసిన విజ‌య్‌ని స్టాలిన్ అభినందించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.