Publish Date:May 23, 2025
కోకో గింజలు కొనుగోలు ధరపై రాష్ట్ర ప్రభుత్వం ఏలూరు కలెక్టరేట్ లో నిర్వహించిన ద్వైపాక్షిక చర్చలు పూర్తిగా విఫలమైనట్లు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర నాయకులు ప్రకటించారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వకుండా మోసగిస్తున్న మోండలీజ్ కంపెనీ, ఇతర బహుళ జాతి కంపెనీల మోసాలకు నిరసనగా, రాష్ట్ర ప్రభుత్వ పరిష్కారాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఏలూరు కలెక్టరేట్ ముందు కోకో రైతులు ధర్నా నిర్వహించారు.కోకో రైతులకు న్యాయం చేయాలని, అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాలని, కార్పొరేట్ కంపెనీల మోసాలను అరికట్టాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ ధర్నానుద్దేశించి ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, రిటైర్డ్ డిజిపి ఏ.బీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత మూడు నెలలుగా కోకో రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారని, గత వారం రోజులుగా పోరాటాన్ని ఉధృతం చేశారని చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ఉన్నతాధికారులు సమక్షంలో పెద్ద సంఖ్యలో వచ్చిన కోకో రైతులతో జరిపిన చర్చలకు భౌతికంగా రాకుండా మోండలీజ్ కంపెనీ ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది కంపెనీల లెక్కలేనితనమని విమర్శించారు. రైతులకు బిక్షం వేస్తున్నట్లుగా అంతర్జాతీయ మార్కెట్ లో కిలో కోకో గింజలకు రూ.880/- ఉంటే మోండలీజ్ కంపెనీ రూ.450/- కు మించి ధర ఇవ్వలేమని చెప్పడం దుర్మార్గమని, ఇది బహుళ జాతి కంపెనీల కుట్రలో భాగమని విమర్శించారు.
రాష్ట్ర మంత్రులు ఎన్నిసార్లు ప్రశ్నించినా మోండలీజ్ కంపెనీ ప్రతినిధుల మొండితనంతో కూడిన సమాధానం హేతుబద్ధంగా లేదన్నారు. గత సంవత్సరం వరకు ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం ధర ఇచ్చిన కంపెనీలు ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కస్టమ్స్, ఇతర గణాంకాలను పరిశీలిస్తే గత నెల 25న కిలో కోకో గింజలను ఇవే కంపెనీలు రూ.1074/- దిగుమతి చేసుకొన్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చట్టపరమైన నియంత్రణ లేకపోవడంతో కంపెనీల ఇష్టారాజ్యంగా మారిందన్నారు. కంపెనీ కిలో కోకో గింజలను రూ.450/- లకు కొనుగోలు చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.50 కంపెనీకి ఇచ్చి రూ.500లకు కొనుగోలు చేస్తామని రాష్ట్ర మంత్రులు ప్రకటించిన నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఈ పరిష్కారాన్ని తిరస్కరిస్తున్నామన్నారు. బహుళ జాతి కంపెనీల మోసాలను అంతర్జాతీయ మీడియా ద్వారా ఎండగడతామని హెచ్చరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cocoa-seads-25-198580.html
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.