తెల్ల కార్డుల సంఖ్య ఎంత తగ్గితే ప్రభుత్వం పై అంత భారం తగ్గుతుంది

Publish Date:Feb 8, 2020

Advertisement


 

ఏపీలో తెల్లకార్డుల కోతకు రంగం సిద్ధమైంది. ఏకంగా ఇరవై లక్షల కార్డుల తొలగించాలనీ వైసీపీ ప్రభుత్వం దాదాపు నిర్ణయానికి వచ్చింది. ఈ నెల పదిహేను నుంచి కొత్త బియ్యం కార్డులు పంపిణీ చేసి మార్చి నుంచి వాటి ఆధారంగానే సరుకులు ఇవ్వనున్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల గుర్తింపునకు నిర్దేశించిన నిబంధనలను ప్రామాణికంగా తీసుకుని చేపట్టిన సర్వేలో పధ్ధెనిమిది లక్షల మంది తెల్లకార్డు కలిగివుండేందుకు అర్హులు కాదని ఏపీలో క్షేత్ర స్థాయిలో తేల్చారు. అయితే ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇప్పుడే వివరాలు బహిర్గతం చేస్తే ఒక్కసారిగా వ్యతిరేకత వస్తుందని అందువల్ల పూర్తిగా వడపోత చేసే వరకూ బయటపెట్టకూడదని ఆ శాఖ భావిస్తోంది. ఈ నెల పదిహేను నుంచి కొత్త బియ్యం కార్డులు పంపిణీ చేసి మార్చి నుంచి వీటి ఆధారంగానే సరుకులను అందిస్తారు. వేలి ముద్రల ఆధారంగా సరుకుల పంపిణీ జరుగుతున్నందున కొత్త కార్డులు చేతికి వచ్చినా, రాకపోయినా అర్హుల జాబితాలో పేరు ఉండడమే ప్రధానం కానుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించిన అర్హుల జాబితాలో పేర్లు లేని రెండు లక్షల కుటుంబాలకు పైగా అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వాటి పరిశీలన పూర్తి చేసిన తరవాత బియ్యం కార్డులు పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

 వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కార్డుల వడపోత కార్యక్రమం ప్రారంభమైంది. అందరికీ నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఇంతమందికి కార్డులెలా ఉన్నాయనే దానిపై దృష్టి సారించింది. రేషన్ తోపాటు ఇతర సంక్షేమ పథకాలకు ప్రామాణికంగా భావిస్తున్న తెల్లకార్డుల సంఖ్య ఎంత తగ్గితే ప్రభుత్వంపై అంత భారం తగ్గుతుందని భావించింది. అందుకే కార్డుల ఏరివేతకు శ్రీకారం చుట్టింది, ప్రజా సాధికార సర్వే సమాచారం, వాలంటీర్ల సర్వే నిర్వహించి కార్డులు వడపోసింది. అంతకుముందే ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న 1.38 లక్షల కార్డులను ఒక నెల నిలుపుదల చేసింది. దానిపై విమర్శలు రావడంతో అది సాంకేతిక సమస్య అని చెప్పి తిరిగి పునరుద్ధరించింది. అన్నింటికీ రేషన్ కార్డే ప్రామాణికం అనే విధానం పోతే కార్డుల సంఖ్య తగ్గుతోందని ప్రభుత్వం ఆలోచన చేసింది. ఆరోగ్యశ్రీ కి ప్రత్యేక కార్డులు జారీ చేస్తామని ఇతర పథకాలకు వేర్వేరు కార్డులు ఇస్తామని ప్రకటించింది కానీ, పేదలకు పంపిణీ చేస్తున్న ఇళ్ళ స్ధలాలు అమ్మఒడి పథకాలకు మళ్లీ బియ్యం కార్డులనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. 

గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పది వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు పన్నెండు వేల ఆదాయం కంటే ఎక్కువ ఉంటే బియ్యం కార్డుకు అనర్హులు. అయితే స్వీపర్ లు, శానిటరీ వర్కర్ లు, సఫాయి కర్మచారి వర్కర్ లుగా పని చేస్తూ ఎంత వేతనం పొందుతున్నప్పటికీ వారికి ఆదాయం, నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే పది ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన వారు అర్హులు కారు, అందులో మాగాణి మూడెకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. మొత్తం పది ఎకరాలు మెట్ట కానీ మూడెకరాలు మాగాణి దాటకుండా మిగిలింది మెట్టభూమి గానీ ఉండాలి. నాలుగు చక్రాల వాహనం ఉన్నా అనర్హులే, అయితే ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్ లు కలిగివున్న కుటుంబాలకు మినహాయింపు ఉంది. రెసిడెన్షియల్ కేటగిరీలో విద్యుత్ వినియోగం నెలకు మూడు వందల యూనిట్ లు దాటకూడదు. సొంతిల్లు అయినా అద్దిల్లైనా ఇదే నిబంధన వర్తిస్తుంది, అయితే ప్రభుత్వం విధించిన పది ఎకరాల పొలం నిబంధనపై కార్డుదారుల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాయలసీమలో పది ఎకరాల దాటి పొలం ఉన్న వారు కూడా అత్యంత దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని సాగునీటి వసతులు ఉన్న డెల్టా ప్రాంతం లోనూ అదే నిబంధన పెట్టారనే వాదన వినిపిస్తుంది. వెనకబడిన ప్రాంతాలు, కరువు ప్రాంతాలకు ప్రత్యేక నిబంధనలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే వాహనాల నిబంధనపైనా విమర్శలు వస్తున్నాయి.

By
en-us Political News

  
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.