‘ఆమె’ జోలికొస్తే ఖబడ్దార్.. అసెంబ్లీ వేదికగా తమిళనాడు సీఎం మాస్ వార్నింగ్.!

Publish Date:Sep 7, 2026

Advertisement

తమిళనాడు రాజకీయాల్లో మహిళలపై జరుగుతున్న అసభ్య,  ద్వంద్వార్థ వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ సీరియస్ గా స్పందించారు. అసెంబ్లీ వేదికగా ‘ఆమె’పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.  అసెంబ్లీలో పోలీసు శాఖ బడ్జెట్ డిమాండ్లపై చర్చ సందర్భంగా మాట్లాడిన విజయ్..  మహిళలను కించపరిచేలా మాట్లాడే వారిని  ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

 

రాజకీయ విమర్శలు ఎంత తీవ్రంగానైనా ఉండవచ్చని..  కానీ భావప్రకటన స్వేచ్ఛ పేరుతో మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత దూషణలకు దిగడం క్షమించరాని నేరమన్నారు. ఇటీవల కాలంలో కొందరు రాజకీయ నాయకులు ఉద్దేశపూర్వకంగా  మహిళలను లక్ష్యంగా చేసుకుని డబుల్ మీనింగ్ డైలాగులు, అసభ్య  పదజాలం వాడటం  ప్రజలు అంతా గమనిస్తున్నారన్న విజయ్..  అటువంటి వారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.

కాగా అసెంబ్లీ వేదికగా విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇందుకు కారణం డిఎంకె అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ గత నెలలో జరిగిన  కావేరి నిరసనల సమయంలో   నటి,  త్రిషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే కారణమని పరిశీలకలు అంటున్నారు.  త్రిషపై ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలపై గత  4న చెన్నైలోని ఆయన నివాసంలో ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, తంజావూరుకు తరలించి విచారించిన సంగతి తెలిసిందే.  ఆ తర్వాత ఆయన స్టేషన్ బెైల్‌పై విడుదలయ్యారనుకోండి అది వేరే సంగతి. ఈ నేపథ్యంలోనే  సీఎం విజయ్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలపై నేరుగా అసెంబ్లీలో   ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.  రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేసేటప్పుడు సంయమనం పాటించాలని, రాజకీయ హద్దులు దాటి మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేసేలా మాట్లాడే ధోరణి ఇకపై చెల్లదని ఆయన అసెంబ్లీ సాక్షిగా వార్నింగ్ ఇచ్చారు. 


[CM Vijay Mass Warning On Untoward Comments women, Trisha remarks row, Udhayanidhi Stalin, Tamil Nadu Assembly, Vijay on women safety, double meaning comments]

By
en-us Political News

  
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.