Publish Date:Jul 10, 2025
కర్ణాటకకు తానే పూర్తికాలం ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం సిద్దరామయ్య ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవి నుంచి హైకమాండ్ తొలగిస్తుందనే వార్తలు అవాస్తవని సీఎం అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టబడి ఉంటామని పేర్కొన్నారు. డీకే శివకుమార్‌కు సీఎం అవ్వాలన్న ఆశ ఉండటంలో తప్పు లేదని సిద్దరామయ్య తెలిపారు."ముఖ్యమంత్రి పదవిలో పూర్తి ఐదేళ్లు నేనే ఉంటాను. ఈ విషయాన్ని జులై 2వ తేదీన డీకే శివకుమార్ సమక్షంలోనే స్పష్టం చేశాను. ఆయన కూడా సీఎం పదవికి పోటీదారుడే, అందులో తప్పేమీ లేదు. అయితే 'ప్రస్తుతం కుర్చీ ఖాళీగా లేదు' అని ఆయనే అన్నారు కదా" అని సిద్ధరామయ్య గుర్తు చేశారు.
డీకే శివకుమార్‌కు మద్దతు ఇచ్చే కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన అంగీకరించారు. రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి మార్పు ఉంటుందనే అంశంపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తమకు ఎటువంటి సూచనలు ఇవ్వలేదని ఆయన అన్నారు. అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా ఆయన స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగానే ఉందని, నిధుల కొరత లేదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను, ముఖ్యంగా ఈడీని కాంగ్రెస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm-siddaramaiah-25-201703.html
వివిధ వ్యాపారాల పేరుతో కోట్లాది రూపాయలు మోసాలకు పాల్పడ్డారు. ఇందులో వీరి పై సుమారు 36 కేసులు నమోదు అయినాయి. ఇప్పటికే వీరు పాల్పడ్డ మోసాలపై బాధితులు ఒక్కొక్కరు వచ్చి ఫిర్యాదులు చేస్తుండంతో వీరి మోసాలు బయటపడ్డాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు భారత్ ప్రధాన నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఈ సందర్బంగా రష్యా- ఉక్రెయిన్ యుద్దానికి సంబంధంచిన తాజా పరిమాణాలను పుతిన్ ప్రధానికి వివరించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌రావు బాంబు పేల్చారు. బీఆర్‌ఎస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉనన్నారంటూ బీజేపీ స్టేట్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్‌ఎస్ నేత దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి మండిపడ్డారు.
టెక్నాలజీ లేని రోజుల్లో టీచర్లు పాఠాలు మాత్రమే చెప్పారు. నేడు టెక్నాలజీ పేరుతో విద్యార్థులకు విద్య రాకుండా చేయడానికే అనిపిస్తోంది.
నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు.
మెడిసిటీ మెడికల్ కాలేజ్ గంజాయి కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. మూడు ఏళ్ల నుంచి వైద్య విద్యార్థులు గంజాయి వాడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
హైదరాబాద్ దిల్ కుషా గెస్ట్ వద్ద సిట్ విచారణ అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగు దేశం పార్టీ నేత విశ్వనాథరెడ్డిని ఇటీవల ఫోన్‌లో బెదిరించిన కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డికి కడప జిల్లా పులివెందుల పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు.
వైఎస్‌ఆర్ కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో విజయం సాధించాలని కూటమి నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
ఇటీవలి కాలంలో.. మరీ ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ నుంచి కాంగ్రెస్ కు ఉద్దేశపూర్వకంగా దూరం జరుగుతున్నట్లు కనిపించిన ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ ఆశ్చర్యకరంగా యూటర్న్ తీసుకున్నారు కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ విమర్శలకు వంత పాడారు.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ పై తమకు ఇసుమంతైనా నమ్మకం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇదే కేసులో శుక్రవారం (ఆగస్టు 8) సిట్ ముందు హాజరు కావడానికి ముందు బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.