మనవడి కోసం స్వయంగా పూరీలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.!

Publish Date:Jul 10, 2026

Advertisement

తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి ఇంట్లో మనవడికి  తాతే. సేవకుడే. మనవడు అడిగితే.. వంటింట్లో పూరీలు వేసి తీరాల్సిందే. ఔను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ఇంట్లో  వంటింట్లో మనవడి కోసం పూరీలు వేస్తున్న చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

 మాజీ ప్రధానమంత్రి దివంగత సీవీ నరసింహరావు గతంలో ఒక సారి ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే అన్నారు. అలా ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయినా.. మనవడికి ఆటబొమ్మలాంటి తాతే అని రుజువు చేసుకున్నారు.  ముఖ్యమంత్రిగా  రేవంత్ రెడ్డి రాజకీయాల్లో,  పాలనా వ్యవహారాల్లో  ఎంత బిజీ అయినా.. గారాల మనవడు అడిగితే.. వంటింట్లో గరిట పట్టాల్సిందే.  తాజాగా ముఖ్యమంత్రి తన నివాసంలో  తన మనవడి కోసం వంటగదిలో  పూరీలు చేసిన ఆసక్తికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పరిపాలన బాధ్యతలను, వ్యక్తిగత జీవితాన్ని రేవంత్ రెడ్డి ఎంత చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటారో  చెప్పడానికి ఇదే నిలువెత్తు సాక్ష్యమంటున్నారు నెటిజనులు.

తన మనవడి కోసం స్వయంగా పూరీలు చేస్తున్న వీడియోను రేవంత్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.  తన ముద్దుల మనవడి డిమాండ్ వల్లే తాను కిచెన్‌లోకి అడుగుపెట్టానని వెల్లడించారు.  తాను పూరీలు వేస్తేనే తింటానంటూ..  మనవడు మారాం చేయడంతోనే..   తాతగా ఆ కోరిక నెరవేర్చక తప్పలేదని రేవంత్ చమత్కారంగా పేర్కొన్నారు.  

రేవంత్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది.  వీడియోలో సీఎం రేవంత్ రెడ్డి  పిండి కలుపుతూ,  పూరీలు వేస్తుంటే..పక్కనే నిలబడి తాతకు ఇన్ స్ట్రక్షన్స్ ఇస్తున్న మనవడు కనిపించాడు. తాత చేత పని చేయిస్తున్నానన్న గర్వం, ఆనందం ఆ మనవడి ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.    ఈ వీడియోపై నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తోంది.  ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం, కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత ఇస్తున్న రేవంత్ రెడ్డిని నెటిజనులు పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నారు.  

Revanth Reddy cooking poori, Revanth Reddy grandson Reyansh, Revanth Reddy viral kitchen video

By
en-us Political News

  
ఈ దారుణ నరమేధంలో నిందితుడు కేవలం ఫిర్యాదుదారులనే కాకుండా, తన స్వంత భార్యను, పిల్లలను కూడా వదలకుండా ప్రాణాలు తీయడం కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలతో పాటు నిందితుడి కుటుంబ సభ్యులను కూడా నిందితుడు దారుణంగా హత్య చేశాడు.
బహామాస్ రాజధాని నసావులోని లిండెన్ పిండ్లింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సెస్నా 402 రకానికి చెందిన చిన్న విమానం శాన్ ఆండ్రోస్ ద్వీపానికి పది మంది ప్రయాణీకులతో బయలు దేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేయనున్నట్లు చామకూర మల్లారెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ భారీ విద్యా ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి అవసరమైన అన్ని రకాల అధికారిక అనుమతులు లభించాయని వెల్లడించారు.
చర్చల కోసం ఇరాన్ తమను అభ్యర్థించిందన్న డొనాల్డ్ ట్రంప్ వాదనలను ఇరాన్ తోసిపుచ్చింది. తాము అమెరికాతో నేరుగా ఎలాంటి చర్చలు జరపలేదని, కేవలం మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఖతార్ ప్రతినిధుల పర్యటనను మాత్రమే అంగీకరించామని కుండబద్దలు కొట్టింది.
తెహతా - జెహానాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య ఉంతా-మదర్‌పూర్ ప్రాంతంలో దొంగలు.. డౌన్ లైన్‌లో ఉన్న ప్రమాదకరమైన ఓవర్ హెడ్ హైవోల్టేజ్ వైర్లను కట్ చేసి కరెంట్ సప్లై నిలిపేశారు. ఆ తరువాత వైర్లను కట్ చేసి ఎత్తుకెళ్లిపోయారు.
ఇజ్రాయెల్ నుంచి తమకు నేరుగా ఎలాంటి సమాచారం రాలేదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమరావతి రాజధాని అంశం మళ్లీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎవరూ ఊహించని ఒక అనూహ్యమైన ఘోర ఘటన చోటుచేసుకుంది.
డీఎస్పీ భీమ్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఆయన నివాసంతో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో పలుచోట్ల సోదాలు నిర్వహించారు.
మహిళా హక్కుల పరిరక్షణ, సమాజంలో లింగ సమానత్వాన్ని పెంపొందించే దిశగా అస్సాం
ఖమ్మం జిల్లా చింతకానిలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని కోరుతూ టీడీపీ నేతలు విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు
తెలంగాణలో ఓటరు జాబితాలో ఉన్న డబుల్, డూప్లికేట్ ఓట్లను తొలగించి ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.