ముంబై బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి
Publish Date:Feb 17, 2026
Advertisement
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ముంబైకు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరారు. ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు ముంబైలో జరిగే ‘ముంబై క్లైమెట్ వీక్’ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది .ముంబై క్లైమెట్ వీక్ వేదికపై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, హైదరాబాద్ విస్తృత ప్రగతి, పరిపాలనలో రాష్ట్ర సాధించిన విజయాలను సీఎం వివరించనున్నారు. ఫిబ్రవరి 17 నుంచి 19, 2026 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న జియో కన్వెన్షన్ సెంటర్ లో జరుగనుంది. మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై కార్పొరేషన్ భాగస్వామ్యంతో ఈ సదస్సు నిర్వహించబడుతోంది. కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
http://www.teluguone.com/news/content/cm-revanth-reddy-leaves-for-mumbai-36-214260.html





