గత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం కారణంగా తెలంగాణకు పూడ్చలేని నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. బుధవారం కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. "బేసిన్లు, బేషజాలు లేవంటూ కేసీఆర్ గతంలో అన్నారు. గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని, వాటిని కృష్ణా, పెన్నా బేసిన్లకు తరలించి రాయలసీమను రతనాల సీమ చేస్తానని చెప్పారు. ఇందులో భాగంగా జగన్‌కు సలహాలు ఇవ్వడమే కాకుండా, టెండర్లు, జీవోల విషయంలోనూ సహకరించారు" అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
రాష్ట్రానికి వచ్చిన నీటిని వచ్చినట్లే ఒడిసి పట్టుకోవాల్సింది పోయి, ఏపీకి వెళ్లాక చివరిలో తీసుకోవడం వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని ఆయన అన్నారు. ఇందుకు శిక్షించాల్సి వస్తే… ఉమ్మడి రాష్ట్ర పాలకులను ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే కెసీఆర్ చేసిన పనికి వంద కొరడా దెబ్బలు కొట్టాల్సిన పరిస్థితిని పేర్కొన్నారు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. మీ అనుభవం సూచనలు రాష్ట్రానికి ఉపయోగపడితే పరిగణలోకి తీసుకుంటాం అవసరమైతే ఎర్రవెళ్లి ఫామ్‌హౌస్‌లో మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం. మా మంత్రులకు పంపిస్తా కేసీఆర్ పిలిస్తే నేను కూడా వస్తా. దయచేసి నన్ను పబ్బులు, క్లబ్బుల్లో చర్చకు పిలవొద్దు అన్నారు. ఎవరు పెరిగిన నేపథ్యం వారిని అలా మాట్లాడిస్తుంది. అని పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm-revanth-reddy-kcr-39-201645.html
బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్పందించారు.
ఏపీ మెగా డీఎస్సీ కీ విడుదలైంది. 16,347 టీచర్ల నియామకాల కోసం జూన్ 6 నుంచి జూలై 2 వరకు పరీక్షలు నిర్వహించారు.
వరుసగా నాలుగు సెంచురీలు. ఆపై మొన్నటికి మొన్నపద్మ అవార్డు. ఆపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఎన్టీఆర్ అవార్డు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 5న విచారణకు హాజరుకాకుండా ఆయన విదేశాలకు వెళ్లిపోతారనే అనుమానాల నేపథ్యంలో ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని రకాల పాఠశాలల ఆవరణలోకి తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు తప్ప ఏ ఇతర అనధికారిక వ్యక్తులను అనుమతించరాదని నిర్ణయించింది.
కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు సమర్పించారు. నివేదికలోని ముఖ్య అంశాలను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది.
వైఎస్ఆర్ కడప జమ్మలమడుగు మండలం, గూడెంచెరువు గ్రామంలో ఉల్సాల అలివేలమ్మ అనే లబ్ధిదారు ఇంటికెళ్లి వితంతు పెన్షన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు అందించారు
సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మంత్రి ఉత్తమ్, సీఎస్ రామకృష్ణ సమావేశం అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను ముఖ్యమంత్రికి సీఎస్ అందించారు. ప్రస్తుతం నివేదికలోని కీలక అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం అందుతోంది.
వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసేసి.. రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి వ్యవసాయమే వ్యాపకంగా బతుకుతున్నానని ఎంతగా చెప్పుకున్నా.. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో చేసిన అక్రమాలు, అన్యాయాలు, కబ్జాలు ఆయనను ఇప్పటికీ వెన్నాడుతూనే ఉన్నాయి.
తెలంగాణలో సంచలన సృష్టించిన గొర్రెల పంపిణీ స్కామ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంచలన ప్రకటన చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు అధికారిక ప్రకటన చేసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజలలో మమేకం అయ్యే విషయంలో అన్నిహద్దలూ చెరిపేస్తున్నారు. గతానికి భిన్నంగా ఆయన క్షేత్ర స్థాయిలో జనంతో మమేకం అవుతూ, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ వాటి పరిస్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం జర్నలిజం విలువలు విశ్వసనీయత పూర్తిగా దెబ్బతిన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఓ దినపత్రిక వార్షికోత్సవంలో మాట్లాడుతూ ఈ రోజుల్లో రాజకీయ పార్టీల పత్రికలు తమ సంపాదను కాపాడుకోవడానికి తప్పులు కప్పిపుచ్చుకనేందుకు పనిచేస్తున్నాయిని పేర్కొన్నారు.
ఏపీలో పెట్టుబడి దారుల సందేహాలన్నీ దాదాపు నివృత్తి అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సుకత చూపుతున్న పెట్టుబడి దారులకు ఇంత కాలం జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమిటన్న సందేహం ఉండేది.