పాలమూరు ప్రజలు అన్నం పెడితే..కేసీఆర్ సున్నం పెట్టారు : సీఎం రేవంత్‌రెడ్డి

Publish Date:Jul 18, 2025

Advertisement

 

పాలమూరు జిల్లా అంటే మాజీ సీఎం కేసీఆర్‌ కుటుంబానికి చిన్నచూపని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం జటప్రోలు లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కరీంనగర్ ప్రజలు ఓడించడానికి సిద్దమైతే కేసీఆర్ మహబూబ్​నగర్‌కు వలస వచ్చారని సైటైర్లు వేశారు. కేసీఆర్‌ను కడుపులో పెట్టుకొని చూస్తే జిల్లాకు ఆయన చేసిందంటని ప్రశ్నించారు. పదేళ్లు సీఎంగా ఉన్నా పైసా పనికూడా చేయలేదన్నారు.

2023లో కాంగ్రెస్ పాలమూరు జిల్లాలో 12 సీట్లు ఇచ్చారని, మరో రెండు గెలిచి ఉంటే ఇంకొక మంత్రి పదవి అదనంగా వచ్చేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తున్న.. మా పాలమూరు ప్రాజెక్టులకు అడ్డం పడొద్దు. మీరు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సమానంగా అభివృద్ధి చేందాలనే ఆలోచనతో ఉన్నది నిజమే అయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేసి మా ప్రాజెక్టులు పూర్తయ్యేలా ఉదారంగా ముందుకు వచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్న. మీరు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కల్వకుర్తి ప్రాజెక్టు మొదలుపెట్టారు. మీరు సీఎంగా ఉన్నప్పుడే బీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టులు వచ్చాయిని రేవంత్‌రెడ్డి తెలిపారు.

మా పాలమూరు బిడ్డలు కృతజ్ఞత ఉన్నవారు. మీ మేలు ఎప్పటికి మర్చిపోమన్నారు. మా విజ్ఞప్తులు మీరు వినకపోతే పోరాటాలు ఎలా చేయాలో పాలమూరుకు తెలుసు. మాకు పౌరుషం ఉంది. పోరాడి సాధించుకునే శక్తి ఉంది. ఈ పోరాటానికి నాయకత్వం నేను వహిస్తాను’ అన్నారు. అక్కడి సూర్యుడి ఇక్కడ ఉదయించినా, ఇక్కడి సూర్యుడు అక్కడ ఉదయించినా పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు
 

By
en-us Political News

  
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే ప్రముఖులు ఏడాదికి ఒకసారి మాత్రమే తిరుమల పర్యటన చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ఇవాళ శ్రీవారిని కుటుంబసభ్యులతో కలిసి ఆయన దర్శించుకున్నారు.
మద్రాసు హైకోర్టు నుండి బదిలీపై రాష్ట్ర హైకోర్టుకు వచ్చిన ఆయనచేత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణం చేయించారు.
జమ్మూ కాశ్మీర్‌ పహల్గామ్ దాడిలో పాల్గొన్నా ముగ్గురు ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల లక్ష్యంగా భారత సైన్యం ఆపరేషన్ మహదేవ్ చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సింగపూర్ పర్యటన ఆయన విజన్ కు అద్దం పడుతోంది. తన సింగపూర్ పర్యటనలో భాగంగా రెండో రోజ సోమవారం (జులై 28) ఆయన తన టీమ్ తో సింగపూర్ లో పది వేల కుటుంబాలు నివశించే బిడదారి ఎస్టేట్ ను సందర్శించారు.
మొన్నీ మ‌ధ్యే ట్రంప్ కు నోబుల్ శాంతి పురస్కారం కోసం అధికారిక నామినేష‌న్ దాఖ‌లు చేసింది అమెరికా. ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న‌కు నోబుల్ పురస్కారం రావడానికి ఎక్కువ అవ‌కాశాలు ఏర్ప‌డుతున్నాయి.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ బీజేపీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారన్న వార్తలు జోరుగా వినవస్తున్నాయి.
తెలంగాణలో చడీచప్పుడూ లేకుండా రవాణా శాఖ తన సేవల ధరలను అమాంతం పెంచేసింది. ప్రభుత్వం పలు సేవల ధరలను పెంచుతూ, కొత్త రేట్లను ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్ర మావోయిస్ట్ పార్టీ వారోత్సవాలు ఏటా జులై 28 నుంచి ఆగస్టు 3 వరకూ జరుగుతాయి. అందులో భాగంగానే సోమవారం (జులై 28) నుంచి ఆగస్టు మూడు వరకూ మావోయిస్టు పార్టీ వారోత్సవాలు జరగనున్నాయి.
అధికారంలో ఉన్న కాలంలో వైసీసీ సర్కారు అవగాహనలేమి, నిర్లక్ష్యంతో వ్యవహరించి ఏపీలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించంది. ఆ క్రమంలో జగన్‌ ప్రభుత్వం చేసిన పాపాలు రాష్ట్రాన్ని ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన మంత్రివర్గ విస్తరణకు సమాయత్తమౌతున్నారన్న చర్చ గత కొన్ని రోజులుగా జోరుగా సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన రెండో రోజు సోమవారం (జులై 28) పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల ప్రతినిథులతో వరుస భేటీలతో బీజీబిజీగా సాగనుంది.
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్. రామచంద్ర రావు బాధ్యతలు చేపట్టి అట్టే కాలం కాలేదు. ఈ నెల మొదటి తేదీన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన, 5వ తేదీన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు కావేరి నదికి వరద పోటెత్తింది. రాష్ట్రంలో వాగులు, వంకలు, నదులూ అన్ని పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.