ఏడాదిలో ఒక్క నెల ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేయండి..డాక్టర్లకు సీఎం విజ్ఞప్తి
Publish Date:Jul 2, 2025
Advertisement
రాష్ట్రంలో ప్రైవేట్ డాక్టర్లు ఏడాదిలో ఒక నెల అయిన ప్రభుత్వాస్పుపత్రిలో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. తర్వాత 11 నెలలు మీకు నచ్చిన ప్లేస్‌లో జీతం చేసుకుని మంచి జీవితం లీడ్ చేయండి అన్నారు. సామాజిక బాధ్యత కింద ఏడాదిలో ఒక్క నెల పేదలకు వైద్యం చేస్తే ఆనందంగా ఉంటుందని ఏనెలలో పనిచేస్తారో మాకు చెప్తే ఏర్పాట్లు చేస్తాం అని ముఖ్యమంత్రి అన్నారు. బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన ఏఐజీ నూతన ఆసుపత్రిని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం హెల్త్ టూరిజం హబ్‌గా మారింది. దేశంలో తయారయ్యే బల్క్‌డ్రగ్‌లో 35శాతం హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతోందని అన్నారు. జినోమ్ వ్యాలీ హైదరాబాద్‌కు చాలా కీలకం. దాదాపు 66 దేశాల నుంచి వచ్చే పేషంట్‌లకు వైద్య సేవలందించే స్థాయికి ఏఐజీ చేరుకోవడం మనందరికీ గర్వకారణం. ఏఐజీ ఆసుపత్రి సేవలు ఇంకా విస్తరించాలని సీఎం ఆక్షాంక్షించారు. తెలంగాణ హెల్త్ టూరిజంలో ప్రభుత్వానికి సహకరించాలని నాగేశ్వర్‌రెడ్డిని కోరామన్నారు. . జనని మిత్ర యాప్ పేదరోగులకు ఎంతో ఉపయోగపడుతుంది. నిమ్స్‌లో అదనపు బ్లాక్, ఎల్‌బీ నగర్, సనత్‌నగర్‌లో ఆసుపత్రులు నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత రోజుల్లో వైద్య ఖర్చులు భారంగా మారాయని అందుకే మేము అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్య ఖర్చులను రూ. 10 లక్షలకు పెంచామన్నారు. ఈ 18 నెలల కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి రిలీఫ్ ఫండ్ కింద రూ.1400 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం చెప్పారు. రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులందరికీ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశంతో ఉన్నదని ముఖ్యమంత్రి తెలిపారు. వీరికి వ్యక్తిగతంగా యూనిక్ ఐడీతో గుర్తింపు కార్డు ఇచ్చి వారి హెల్త్ ప్రొఫైల్ కార్డు రూపొందిస్తామని ఈ కార్డులో వారి కుటుంబ సభ్యులందరి హెల్త్ ప్రొఫైల్ నిక్షిప్తం చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు.
http://www.teluguone.com/news/content/cm-revanth-reddy-39-201090.html





