Publish Date:Jul 11, 2025
తెలంగాణలో ఈనెల 14న తుంగతుర్తిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా కొత్త రేషన్‌కార్డుల పంపిణీ ఉంటుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2.4లక్షల నూతన రేషన్‌కార్డులను పంపిణీ చేయనున్నారు. దీని ద్వారా 11.30లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. తెలంగాణలో గత ఆరు నెలల్లో 41 లక్షల మందికి ప్రభుత్వం కొత్తగా రేషన్ పంపిణీ చేసింది.
త్వరలో పంపిణీ చేయనున్న వాటితో కలిపి రేషన్‌కార్డుల సంఖ్య 94,72,422కి చేరనుంది. మొత్తంగా 3.14కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. రేషన్ కార్డుల జారీ నిరంతరం జరుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎప్పుడైనా తెల్ల కార్డు రేషన్ కార్డులిస్తామని తెలిపారు. రేషన్‌కార్డుల మంజూరుతో నిరుపేదలకు భారీగా లబ్ధి చేకూరుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సర్కారు సిద్ధమవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm-revanth-reddy-25-201789.html
మంత్రి పదవి విషయంలో మనుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై మంత్రి వెంకట్ రెడ్డి స్పందించారు.
సికింద్రాబాద్ సృష్టి షెర్టిలిటీ కేసు ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత కస్టడీ విచారణ ముగిసింది. గాంధీ ఆస్పత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
దేశంలో పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి ప్రవేశ పెట్టాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం మరోసారి ఎమ్మెల్యే పదవి రాజీనామాకు సిద్ధమని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఏంటీ జగన్ మోహన రెడ్డి ఇప్పటి వరకూ తనపై ఉన్న 31 కేసులలో 3452 సార్లు.. వాయిదాలు తీసుకుని ప్రపంచ రికార్డు సృష్టించారా? ఇందుకోసంగానూ ఆయన 6904 కోట్ల రూపాయల మేర ఖర్చు చేశారా? ఆశ్చర్యం కలిగిస్తున్నా.. ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. బేసిగ్గా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన ఐదేళ్ల పదవీ కాలంలో .. సీఎంగా తన హోదా కారణంగా బిజీబిజీ అంటూ వాయిదాల మీద వాయిదాలు తీసుకున్నసంగతి తెలిసిందే.
బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబర్ 1/12లో రోడ్డు కుంగిపోయింది. అటు వచ్చిన వాటర్ ట్యాంకర్ ఒక్కసారిగా దిగబడిపోయింది. దీంతో వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌తో పాటు క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై దీర్ఘకాలంగా సాగుతున్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తమపై ఉన్న క్రిమినల్ కేసును క్వాష్ చేయాలని కోరుతూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం అనుమతించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై డిపాజిటర్ల నుంచి ఎటువంటి అభ్యంతరం, ఆరోపణా లేకపోవడంతో కేసు కొనసాగించాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది.
ఋతుపవన ద్రోణి, బంగాళాఖాతం లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి.
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ పట్టణంలో క్లౌడ్ బరస్ట్ ధాటికి కొండ చరియాలు విరిగిపడ్డాయి. వరద ప్రవాహంతో వందలాది ఇళ్లను ముంచేంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తయ్యింది. ఈ విషయాన్ని సీబీఐ దేశ సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేయడంతో.. ఇప్పడు చర్చ ఈ కేసులో కీలక నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిపైకి మళ్లింది.
తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు పంపించారు.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరంటారు. ఏదీ మన చేతుల్లో ఉండదు. మరణం ఎప్పుడు, ఎలా రాసిపెట్టి ఉంటుందో చెప్పలేం. పెద్ద పెద్ద ప్రమాదాల బారిన పడి కూడా ప్రాణాలతో బయటపడే వారుంటారు.