పాలమూరు ప్రజలు అన్నం పెడితే..కేసీఆర్ సున్నం పెట్టారు : సీఎం రేవంత్‌రెడ్డి

Publish Date:Jul 18, 2025

Advertisement

 

పాలమూరు జిల్లా అంటే మాజీ సీఎం కేసీఆర్‌ కుటుంబానికి చిన్నచూపని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం జటప్రోలు లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కరీంనగర్ ప్రజలు ఓడించడానికి సిద్దమైతే కేసీఆర్ మహబూబ్​నగర్‌కు వలస వచ్చారని సైటైర్లు వేశారు. కేసీఆర్‌ను కడుపులో పెట్టుకొని చూస్తే జిల్లాకు ఆయన చేసిందంటని ప్రశ్నించారు. పదేళ్లు సీఎంగా ఉన్నా పైసా పనికూడా చేయలేదన్నారు.

2023లో కాంగ్రెస్ పాలమూరు జిల్లాలో 12 సీట్లు ఇచ్చారని, మరో రెండు గెలిచి ఉంటే ఇంకొక మంత్రి పదవి అదనంగా వచ్చేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తున్న.. మా పాలమూరు ప్రాజెక్టులకు అడ్డం పడొద్దు. మీరు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సమానంగా అభివృద్ధి చేందాలనే ఆలోచనతో ఉన్నది నిజమే అయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేసి మా ప్రాజెక్టులు పూర్తయ్యేలా ఉదారంగా ముందుకు వచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్న. మీరు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కల్వకుర్తి ప్రాజెక్టు మొదలుపెట్టారు. మీరు సీఎంగా ఉన్నప్పుడే బీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టులు వచ్చాయిని రేవంత్‌రెడ్డి తెలిపారు.

మా పాలమూరు బిడ్డలు కృతజ్ఞత ఉన్నవారు. మీ మేలు ఎప్పటికి మర్చిపోమన్నారు. మా విజ్ఞప్తులు మీరు వినకపోతే పోరాటాలు ఎలా చేయాలో పాలమూరుకు తెలుసు. మాకు పౌరుషం ఉంది. పోరాడి సాధించుకునే శక్తి ఉంది. ఈ పోరాటానికి నాయకత్వం నేను వహిస్తాను’ అన్నారు. అక్కడి సూర్యుడి ఇక్కడ ఉదయించినా, ఇక్కడి సూర్యుడు అక్కడ ఉదయించినా పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు
 

By
en-us Political News

  
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కోసం డివిజన్ల వారీగా మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతలు అప్పగించారు.
రాష్ట్రాన్ని పెను తుపాను అతలాకుతలం చేస్తుంటే.. దగ్గరుండి పార్టీ శ్రేణులకు సహాయ పునరావాస కార్యక్రమాలలో పాల్గొనేలా దిశా నిర్దేశం చేయాల్సిన ఆయన రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడకుండా.. బెంగళూరు ప్యాలెస్ లో విశ్రాంతిగా కూర్చుని పార్టీ నేతలూ, శ్రేణులను సహాయ పునరావాస కార్యక్రమాలలో పాల్గొనాలంటూ పిలుపునచ్చి చేతులు దులిపేసుకోవడమేంటని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా సుదీర్ఘకాలం ఉన్నారు. అటువంటి చంద్రబాబునాయుడిని రాజకీయ వైరంతో విమర్శలు చేసే వారు ఉంటే ఉండొచ్చు కానీ, దార్శనికత, పాలనా దక్షతకు సంబంధించి ఆయనను వేలెత్తి చూపేవారెవరూ దాదాపు ఉండరనే చెప్పాలి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
కొడాలి నాని ఇటీవలే అనారోగ్యం నుంచి కోలకుున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ఆయన బయట కనిపించడం అన్నది చాలా చాలా అరుదుగా జరుగుతోంది.
కవిత తన ప్రసంగంలో రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించినప్పటికీ ప్రధానంగా ఆమె ప్రసంగం మొత్తం బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావులే లక్ష్యంగా సాగింది. వారిరువురూ అవినీతికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.
నకిలీ మద్యం కుంభకోణం కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని, ఎవరూ అడగకుండానే.. బెజవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్లి మరీ ప్రమాణం చేశారు. ఈ విషయంలో తాను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లకు సవాల్ చేసినప్పటికీ వాళ్లు స్పందించపోవడంతో తాను వచ్చి ప్రమాణం చేశానని చెబుతున్నారు.
అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు తమను గెలుపు బాటలో నడిపిస్తాయని కాంగ్రెస్ విశ్వసిస్తుంటే.. బీఆర్ఎస్ పూర్తిగా సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకతపై ఆధారపడి ముందుకు సాగుతోంది. ఇక బీజేపీ అయితే మోడీ కరిష్మాపై ఆధారపడి బరిలోకి దిగింది.
కడప ,చిత్తూరు జిల్లాల జీవనాడి అయిన గాలేరు నగరి సుజల స్రవంతి నిధుల కొరత, అటవీ అనుమతుల మంజూరులో జాప్యం వల్ల నాలుగు దశాబ్దాలుగా నత్తనడక నడుస్తోందని విమర్శించారు. హంద్రీనీవా రెండో దశ అనుసంధానం పేరుతో కండలేరు -కరకంపాడి ఎత్తిపోతల పథకం పేరుతో నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
క‌విత‌క్క కారు క‌హానీలు.. ఇప్ప‌ట్లో ఆగేలా లేవు. మొత్తం త‌న లుక్కు మార్చిన క‌విత‌క్క‌
బీహార్ రాష్ట్రంలో ఎన్డీయే తరఫున తాను ప్రచారం చేయనున్నట్లు వెల్లడించిన ఆయన బీహార్ లో ఎన్డీఏ కూటమి మరోసారి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు.
తెలంగాణలో మంత్రుల మధ్య జరుగుతున్న అంతర్గత పోరుపై కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఆ అసంతృప్తిని పార్టీ అధిష్ఠానం ఏమీ గోప్యంగా ఉంచలేదు కూడా. పద్ధతి మార్చుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షీ నటరాజన్ పలు మార్లు మంత్రులను హెచ్చరించారు కూడా.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.