చర్చ రచ్చ ఏదైనా ..చివరకు మిగిలేది శూన్యం

Publish Date:Jul 10, 2025

Advertisement

 

తెలంగాణలో ఇప్పుడు సవాళ్లు ప్రతి సవాళ్ల రాజకీయం నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శ్రీకారం చుట్టిన సవాళ్ల రాజకీయం మలుపులు తిరుగుతూ ఎక్కడెక్కడికో పోతోంది. సూది కోసం సోది కెళితే. అన్నట్లుగా అసలు చర్చ పక్కకుపోయి,రాజకీయ రచ్చ, పొంగి పొరలుతోంది. సాగుతోంది.   నిజానికి, సవాళ్ల రాజకీయానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేవలం రైతు సమస్యల వరకే పరిమితం అయ్యారు. ‘రైతులకు ఎవరు ఎంత మేలు చేశారు తేల్చుకుందాం రండని అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్’కు,బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్’కు బహిరంగ వేదిక నుంచి ఒకే సారి సవాలు విసిరారు.

ఇక ఆ తర్వాత ఏమి జరిగింది అన్నది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కారణాలు ఏవైనా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాలును ప్రధాని మోడీ,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,మాజీముఖ్యమంత్రి కేసీఆర్, పెద్దగా పట్టించుకోలేదు. కానీ, మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు,కేటీఆర్’ రియాక్ట్ అయ్యారు. సోమాజీగూడ గూడ ప్రెస్ క్లబ్  వేదికగా   చర్చకు సై ..అన్నారు. ఇక అక్కడి నుంచి చర్చ,రచ్చగా మారింది. చర్చ జరగవలసింది, చట్ట సభల్లో కానీ, క్లుబ్బుల్లో, పబ్బుల్లో కాదని, అసలు ముఖ్యమంత్రి సవాలు చేసింది మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్’ కు కానే కేటీఆర్’కు కాదని కాంగ్రెస్ మంత్రులు, నాయకులు  కేటీఆర్’ విమర్శలను తిప్పి కొట్టారు.

నిజమే, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు,కాంగ్రెస్ నాయకులు లేటెస్ట్’గా చెపుతున్నట్లుగా ప్రజాసమస్యలు, ప్రభుత్వ విధానాలు చర్చించేందుకు సరైన వేదిక చట్ట సభలే..నిజానికి  సమస్య లేదా విషయం ఏదైనా, చర్చ జరగవలసింది, చట్టసభల్లోనే,..అందులో మరో అభిప్రాయానికి ఆస్కారమే లేదు. తెలంగాణలోనే కాదు, దేశంలో ఎక్కడైనా, ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వ విధానాలు, చట్టాలు, పథకాలు,ప్రజా సమస్యలపై చర్చలు జరగవలసింది చట్టసభల్లోనే..మరో వేదిక అది ఎంత పవిత్రమైనది అయినా, ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలు చర్చించేందుకు అది తగిన వేదిక కాదు. నిజమే కావచ్చును,చట్టసభలు ఎంత చక్కగా జరుగుతున్నాయో,గౌరవ ప్రజా ప్రతినిధుల ప్రవర్తన ఎంత గౌరవ ప్రదంగా ఉంటుందో చూస్తూనే ఉన్నాం..అయినా సరే చట్ట సభల తీరు ఎంత సుందర ముదనష్టంగా ఉన్నా సరే,పభుత్వ విధానాలు, ప్రజాసమస్యలపై చర్చ జరగవలసింది చట్ట సభల్లోనే.. క్లబ్బుల్లోనో, మరో బహిరంగ ప్రదేశంలోనో కాదు. ఈ విషయంలో  

అధికార, విపక్షాలకు ఎవరికీ రెండవ అభిప్రాయం ఉండదు,ఉండరాదు.ఉన్నా అది పరిగణలోకి తీసుకోవలసిన అవసరం లేదని, న్యాయస్థానాలు,రాజ్యాంగ నిపుణులు అనేక సందర్భాలో స్పష్టం చేశారు.   
కానీ, ఇప్పడు రాష్ట్రంలో, రైతులకు ఏ ప్రభుత్వం ఎంత మేలు చేసింది’ అనే విషయంపై చర్చ పేరిట జరుగతున్నరచ్చ, విషయానికి వస్తే.. చాలా విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది.సవాళ్లు ప్రతి సవాళ్లుగా సాగుతున్నరాజకీయం,రాజకీయమ పార్టీలు, నాయకులు   గమనిస్తున్నాయో లేదో  సామాన్యులకు చీదర పుట్టిస్తోంది. ప్రజలు అసహ్యించుకుంటున్నారని మీడియా చర్చల్లో పాల్గొంటున్న పెద్దలు హెచ్చరిస్తున్నారు.నిజానికి, రాజకీయ పార్టీల తీరు, అధికార విపక్ష సభ్యుల ప్రవర్తన అంతా శ్రీ వైష్ణవులే ..అన్నట్లు, ఉందని, సామాన్య ప్రజలు సైతం ఆశ్చర్యంతో కూడిన అవేద వ్యక్తపరుస్తున్నారు. 

అధికార, ప్రతిపక్ష పార్టీలు సాగిస్తున రాజకీయ రచ్చలో అసలు విషయం పక్కకు పోయి, కేవలం రాజకీయ రచ్చ మాత్రమే మిగిలిందని ఆవేదన వ్యక్త పరుస్తున్నారు. ఇదలా ఉంటే ఇప్పడు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొత్త ఎజెండాతో కొత్త ప్రపోజల్’తో ముందుకొచ్చారు. కృష్ణా,గోదావరి జలాల విషయంలో చర్చించేందుకు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను అసెంబ్లీకి రమ్మంటే రావడంలేదని, ఆయన ఆరోగ్యం బాగా లేనందున తమనే ఎర్రవల్లి ఫాంహౌజ్‌‌కు రమ్మంటే వస్తామని ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి అన్నారు. తేదీ చెబితే అక్కడికే వచ్చి మాక్‌ అసెంబ్లీ నిర్వహిస్తామని చెప్పారు. 

అలాగే, ‘‘మీ సుదీర్ఘ అనుభవాన్ని, ఆలోచనల్నీ తెలంగాణ ప్రజలకు సూచన కింద ఇస్తే స్వాగతిస్తాం. మీరు ఏ తారీకు చెప్పినా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. కృష్ణా, గోదావరి జలాలపె ఉమ్మడి రాష్ట్రంలో, తొమ్మిదిన్నరేళ్ల మీ పాలనలో, గడచిన ఏడాదిన్నరలో తీసుకున్న నిర్ణయాలపై కూలంకశంగా చర్చిద్దాం. స్పీకర్‌ అనుమతితో నిపుణులను కూడా పిలిచి అభిప్రాయం తీసుకుందాం’’ అని పేర్కొన్నారు. ఇక ఇప్పుడు, ఈ ప్రతిపాదనపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్’ ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడవలసి వుంది.అయితే, చర్చ అయినా, రచ్చ అయినా, ఏమి జరిగిన ఏమి జరగక పోయినా, చివరకు మిగిలేది శూన్యం.
 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.