Publish Date:Jul 13, 2025
లష్కర్ బోనాల సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు సీఎంకు తీర్థప్రసాదాలు వేదాశీర్వచనాలిచ్చారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి జరగాలని అమ్మవారిని రేవంత్‌రెడ్డి ప్రార్థించారు. మహాకాళి బోనాల జాతర ఘనంగా సాగుతోంది. ఆలయం వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా 6 క్యూలైన్లు ఏర్పాటు చేశారు.అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
నేడు బోనాలు, ఫలహారబండ్ల ఊరేగింపు, 14న రంగం, పోతరాజుల గావు, అంబారీపై అమ్మవారి ఊరేగింపు జరగనుంది. భక్తుల కోసం ప్రత్యేకంగా రెండు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. శివసత్తులకు ప్రత్యేకంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఆర్పీరోడ్, బాట షో రూం నుంచి ప్రవేశం కల్పించారు. దేవాలయానికి భక్తులు వెళ్లేందుకు వివిధ మార్గాల్లో పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. లష్కర్ బోనాల జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఉజ్జయిని మహంకాళి బోనాలకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm-revanth-reddy-25-201917.html
హైదరాబాదులో మరొకసారి భారీ వర్షం కుమ్మేసింది.. మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్డు మీద వరద నీరు ఏరులై పారాయి.
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ సెక్యూరిటీపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. జగన్ భద్రత కోసం మరో నలభై మంది ప్రైవేట్ సెక్యూరిటీ నియమించింది.
తెలంగాణ అంతర్జాతీయ స్పోర్ట్స్ చైర్మన్లు గా సంజీవ్ గోయంకా గ్రూప్ చైర్మన్ సంజీవ్ గోయంకా, యువర్ లైఫ్ సిఇఓ ఉపాసన కొణిదెల నియమితులయ్యారు.
ఏపీలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయవచ్చాని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
కాళేశ్వరం కమీషన్ నివేదికపై మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కమీషన్ రిపోర్ట్ ఊహించిందే. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని గులాబీ బాస్ అన్నారు.
సిరాజ్ మ్యాజిక్.. విజయానికి ఏడు పరగుల దూరంలో ఇంగ్లాండ్ ఆలౌట్
ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఒవల్ లో జరిగిన ఐదో టెస్టులో భారత్ 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో సిరీస్ ను 2-2తో సమం చేసుకుంది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఐదో టెస్టులో హైదరాబాద్ కుర్రోడు సిరాజ్ అద్భుతంగా రాణించి భారత్ కు అసాధ్యమనుకున్న విజయాన్ని అందించాడు.
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన ఇంటి అద్దె భత్యం ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఒవల్ లో జరిగిన ఐదో టెస్టులో భారత్ 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో సిరీస్ ను 2-2తో సమం చేసుకుంది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఐదో టెస్టులో హైదరాబాద్ కుర్రోడు సిరాజ్ అద్భుతంగా రాణించి భారత్ కు అసాధ్యమనుకున్న విజయాన్ని అందించాడు.
అనకాపల్లి జిల్లాలో పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం చోటుచేసుకుంది. లూపిన్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీకవ్వడంతో ఆరుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.
భారతీయ రాష్ట్ర సమితి నుంచి ఆ పార్టీ అధినేత కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఉద్వాసన తప్పదా? పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారా? అంటే బీఆర్ఎస్ వర్గాల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది. కవితను పార్టీ నుంచి బహిష్కరించే దిశగా కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని గట్టిగా చెబుతున్నారు.
తొమ్మిదో తేదీ రాఖీ పండగ వస్తోంది. అన్నా చెల్లెళ్ల బంధం మరంత పెరుగుతుందేమో అని చూస్తే.. కేటీఆర్ టార్గెట్ గా కవిత మరిన్ని అస్త్రాలు సంధించడంతో గులాబీ దళాలు మరింత నీరసపడ్డట్టు తెలుస్తోంది. జగదీశ్వర్ రెడ్డిలాంటి వారి చేత తనను తిట్టించడం వెనక పెద్ద నాయకుడు ఉన్నాడంటూ ఆమె చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయ్.
హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిస్తోంది. ఒక్కసారిగా వాతావరణం మారింది. దీంతో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది
సాధారణంగా, ఏ పార్టీ అయినా పార్టీకి కష్టపడి పనిచేసే ఎమ్మెల్యే లేదా ఎంపీని ప్రోత్సహిస్తుంది. పదవులిచ్చి గౌరవిస్తుంది. అసెంబ్లీలో, లోక్ సభలో స్వేచ్ఛగా మాట్లాడి పార్టీ గొంతు, రాష్ట్ర సమస్యలు వినిపించడానికి అవకాశాలు ఇస్తుంది.