జర్నలిజంలో విశ్వసనీయత, విలువలు లేవు : సీఎం రేవంత్ రెడ్డి
Publish Date:Aug 1, 2025
Advertisement
ప్రస్తుతం జర్నలిజం విలువలు విశ్వసనీయత పూర్తిగా దెబ్బతిన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఓ దినపత్రిక వార్షికోత్సవంలో మాట్లాడుతూ ఈ రోజుల్లో రాజకీయ పార్టీల పత్రికలు తమ సంపాదను కాపాడుకోవడానికి తప్పులు కప్పిపుచ్చుకనేందుకు పనిచేస్తున్నాయిని పేర్కొన్నారు. జర్నలిస్టు అనే పదానికి అర్థం లేకుండా పోతుంది. అ.ఆ.లు, ABCD లు రాని వారు కూడా సోషల్ మీడియా జర్నిలిస్టులంటూ తిరుగుతున్నారని ముఖ్యమంత్రి అన్నారు. ఓనమాలు కూడా రానివాళ్లు సోషల్ మీడియా ముసుగుతో జర్నలిస్టుగా చలామణి అవుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిని సీనియర్లు జర్నలిస్టులు పక్కన పెట్టాలని.. కనీసం పక్కన కూడా కూర్చొబెట్టుకోవద్దని అన్నారు. ఆవారాగా రోడ్ల మీద తిరుగుతూ.. అసభ్యకరంగా మాట్లాడేవాడు జర్నలిస్టు అని చెప్పుకోవడం సోచనీమని పేర్కొన్నారు. 2004లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కమ్యూనిస్టుల పాత్ర మరువలేనదిన అన్నారు. ప్రజా సమస్యలపై గలమెత్తాలన్నా.. అధికారంలో ఉన్నోళ్లను గద్దె దింపడానికైనా కమ్యునిస్టులు ఉపయోగపడతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజకీయ నేతల విశ్వసనీయత దెబ్బతిన్నట్లుగానే.. జర్నలిస్టుల విశ్వసనీయత క్రమంగా తగ్గుతూ వస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో వీరభద్రం చేసిన పాదయాత్రలు, పోరాటాలు కారణం కావొచ్చు. ప్రజా పాలనను కొనసాగించడానికి కూడా మీ సహకారం కావాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు నరేందర్‌రెడ్డి, సీపీఎం సీనియర్ నేతలు రాఘవులు, తమ్మినేని వీరభద్రం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
http://www.teluguone.com/news/content/cm-revanth-reddy-39-203262.html





