సీఎం రమేష్ దందాగిరి.. జనసేన ఎమ్మెల్యేల దాదాగిరి!

Publish Date:Jul 25, 2024

Advertisement

(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్) చింతకుంట మునుస్వామి రమేష్, ఆయనే సీఎం రమేష్‌గా ప్రసిద్ధి. జూన్ 2019కి ముందు వరకు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. అక్టోబర్ 2018లో సీఎం రమేష్‌కి చెందిన కంపెనీ, ‘రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ఆఫీసులపై నాటి కేంద్ర ప్రభుత్వం ఇన్‌కమ్ టాక్స్, ఎన్‌ఫోర్స్‌.మెంట్ డైరక్టరేట్ (ఈడీ)లతో దాడి చేయించింది. వందకోట్ల రూపాయల అంతుచిక్కని ట్రాన్సాక్షన్స్ కనుగొన్నట్టు అప్పట్లో కేంద్ర ఏజెన్సీలు ప్రకటించాయి. సరిగ్గా దాడులు జరిగిన ఆరు నెలలు తిరక్కముందే సీఎం రమేష్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2023లో కీలకమైన కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు, ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలకి ముందు 45 కోట్ల విలువైన ఎలక్ట్రోరల్ బాండ్లు భారతీయ జనతా పార్టీకి చందాగా సమర్పించారు సీఎం రమేష్. 

‘ది క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్స్ ఎఫైర్స్’ (సీసీఈఏ) హిమాచల్‌ప్రదేశ్‌లో 2,614 కోట్ల విలువ చేసే సున్నీ డ్యామ్ హైడ్రో ప్రాజెక్టుని అప్రూవ్ చేసింది. అప్రూవ్ అయిన తర్వాత కేవలం పది రోజుల్లో సీఎం రమేష్ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ ఆ కాంట్రాక్ట్ దక్కించుకుంది. అంతేకాదు, ఇదే ప్రాజెక్టులో కోట్ల ఇంజనీరింగ్ అండ్ ప్రొక్యూర్‌మెంట్ కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో 11 వందల కోట్ల కాంట్రాక్ట్ సీఎం రమేష్‌కి దక్కింది. రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆపరేషన్స్ ప్రెసిడెంట్‌గా సీఎం రమేష్ కుమారుడు రిత్విక్ రమేష్ కొనసాగుతున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తపోవన్ విష్ణుగఢ్ హైడ్రో ఎలక్ట్రో ప్రాజెక్టు కూడా సీఎం రమేష్ కంపెనీయే దక్కించుకోవడం విశేషం. ఇదంతా గతం.

మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా పొత్తుల్లో బీజేపీ తరఫున అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి పోటీచేసి విజయం సాధించారు. అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి దగ్గర భారత నౌకాదళం నావెల్ ఆల్ట్రనేటివ్ ఆపరేషన్స్ బేస్ (ఎన్ఏఓబీ) ప్రాజెక్టును ప్రారంభించింది. ఏపీ ప్రభుత్వం రాంబిల్లి వద్ద భారత నౌకాదళానికి భారీగా భూమిని కేటాయించింది. న్యూక్లియర్ సబ్‌మెరైన్ బేస్ ప్రాజెక్టు పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. వైజాగ్ నగరానికి దక్షిణంగా 60 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ రాంబిల్లి నావెల్ బేస్ 1600 హెక్టార్లలో విస్తరించి వుంది. ఈ స్థావరం బంగాళాఖాతంలోకి సులభంగా చేరుకోవడానికి సముద్ర గర్భంలో లోతైన టన్నెల్, అందుకు వీలుగా పెద్దపెద్ద భారీ రాళ్ళతో కొంతమేరకు సముద్రాన్ని పూడ్చటం, లోతు చేయడం ద్వారా ప్రత్యేకమైన సముద్ర, భూగర్భ స్టోరేజ్ సౌకర్యాలు మొదలగు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎల్ అండ్ టీ, మరో సంస్థ ఈ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. ఇక్కడకి సీఎం రమేష్ ఎంటరై ఆ సంస్థలను తప్పుకోండి అంటూ బెదిరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మిగతా పనులు తన కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ చేపడుతుంది అని హుకుం జారీ చేశారని సమాచారం. ‘తెలుగువన్’ సీఎం రమేష్‌తో మాట్లాడే ప్రయత్నం చేసింది. ఆయన ‘తెలుగువన్’కి అందుబాటులోకి రాలేదు. 

బాధ్యతాయుతమైన ప్రజాసేవలో ఉన్నత పదవులు ప్రజలు కట్టబెడితే, రాజకీయ నాయకుల తీరు పూర్తి వ్యాపార ధోరణిలో తప్ప మరోలా కనిపించడం లేదు. పూర్వం ధనికులు రాజకీయాల్లోకి వస్తే తమ సర్వస్వం ప్రజాసేవకే ధారపోసేవారు. నేడు రాజకీయమంటే వ్యాపారం. కేవలం ధనార్జనగా మార్చేశారు. 

టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పు చేస్తే, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటారు. జనసేన ఎమ్మెల్యేలు తప్పుచేస్తే ‘జనసేనాని’ పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటారు. మరి, రాష్ట్రంలో బీజేపీ నాయకులు తప్పు చేస్తే ఎవరు చర్యలు తీసుకుంటారు? సీఎం రమేష్ తప్పు చేస్తే ఎవరు మందలిస్తారు? బీజేపీ పార్టీ చీఫ్ పురందేశ్వరి మందలిస్తారా? లేదా ఒక సాధారణ ఆర్ఎస్ఎస్ కార్యకర్త, కేంద్ర మంత్రి అయిన శ్రీనివాస వర్మ మందలిస్తారా? ఏనుగంత బలమున్న సీఎం రమేష్‌ని ఆ పార్టీలో ఎవరు ప్రశ్నించగలరు? 

అనకాపల్లి జిల్లా యలమంచిలికి ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ తీరుపట్ల కూడా పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి పేరిట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దందాలు జరుగుతున్నాయని, పారిశ్రామికవేత్తలందర్నీ వాటాలకోసం బెదిరింపులకు దిగుతున్నారని, ఇది ఏమాత్రం సహించరానిదని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి ఫిర్యాదులు వెళ్ళాయి. దాంతో యలమంచిలి నియోజకవర్గ కేంద్రం పరిధిలోని అచ్యుతాపురం కేంద్రంగా పనిచేస్తున్న పారిశ్రామికవేత్తలు పలువురు, విజయకుమార్ వైఖరి ఇలాగే కొనసాగితే తాము పారిశ్రామిక యూనిట్లను మూసివేయడం మినహా మరో మార్గం లేదని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇంతకుముందు ప్రస్తావించిన రాంబిల్లి నావికాదళం ప్రాజెక్టు కాంట్రాక్టర్లను కూడా ఈయనగారు బెదిరించినట్టు ఫిర్యాదులు అందాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ తీవ్రంగానే మందలించారని తెలిసింది. పెందుర్తి నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నాయని పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తెలిసింది. 

పెందుర్తి నియోజకవర్గంలోని ఫార్మా పార్కులో వందలాదిమంది పారిశ్రామికవేత్తలు వున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పేరిట తమకు బెదిరింపులు, వేధింపులు వస్తున్నాయంటూ కొందరు ఇప్పటికే అటు తెలుగుదేశం అధిష్ఠానానికి, ఇటు జనసేన అధిష్ఠానానికి ఫిర్యాదులు చేశారు. వీటిని దృష్టిలో వుంచుకుని పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి వైఖరిని సహించేది లేదని గట్టిగా చెప్పినట్టు తెలిసింది. ఈ ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకని, శాసనసభ్యులు అందరితో ఆయన మాట్లాడినప్పుడు, రౌడీయిజం చేస్తే సహించేది లేదని, అటువంటి ఎమ్మెల్యేలను వదులుకోవడానికి కూడా నేను సిద్ధమని ఆయన స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారని తెలిసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లాంటి గూండా పార్టీని ఎదిరించి వచ్చినవాడినని... బెదిరింపులు, దౌర్జన్యాల్లాంటి పనులు చేస్తే వేటు తప్పదని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. ప్రజాస్వామ్య విధానాలను అపహాస్యం చేసినా, రౌడీయిజం చేసినా మీరు ఎంతటి వారయినా, మీరు పార్టీకి ఎంత విధేయులైనా వదులుకోవడానికి సిద్ధం అంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించారని తెలిసింది. అప్పుడే కొంతమంది శాసనసభ్యులు పాదాభివందనాలు చేయించుకుంటూ వుండటం, కార్యకర్తలు, ప్రజల పట్ల తలబిరుసుగా వ్యవహరిస్తూ వుండటం పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. శాసనసభ్యులుగా గెలిచిన వారికి సభ్యత, సంస్కారాలు నేర్పాల్సిన అవసరం లేదని, మర్యాదగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నానని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. 

By
en-us Political News

  
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు నేతృత్వంలో జరిగిన వైసీపీ కాపు సామాజిక వర్గాల నాయకుల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత పవన్ టోన్ పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తాను కేవలం 21 సీట్లు గెలిచిన ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మాత్రమే కాకుండా.. కేంద్రంలోని పెద్దల అండదండలు ఉన్న సుపీరియర్ పొజిషన్‌లో ఉన్నాననే సంకేతాన్ని పవన్ పంపించారన్నారు.
కూటమి ప్రభుత్వంలో పరిపాలనా లోపాలు, రాజకీయ సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా లభించిన 80 శాతం ప్రజా సంతృప్తి కేవలం కాగితాలకే పరిమితమైందనీ.. డిజిటల్ కనెక్టివిటీ పెరిగి భౌతిక సంబంధాలు దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తమ సర్వేలో తేలిందని చెప్పారు.
ఎన్నికల బరిలో కేసీఆర్, బీఆర్ఎస్ కూటమిని ఢీకొట్టడం ఎవరికైనా పెద్ద సవాలే. గతంలో కేసీఆర్ వాడే ఘాటైన రాజకీయ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలపై ఆయనకు మాత్రమే పేటెంట్ హక్కు ఉందనే భావన ఉండేది. కానీ రేవంత్ రెడ్డి రాకతో.. ఆ ముద్రను పూర్తిగా చెరిపివేశారు. కేసీఆర్, కేటీఆర్ ల కంటే మరింత దూకుడుగా, ఘాటుగా రేవంత్ ప్రజల్లోకి వెళ్లారు.
కేంద్ర ప్రభుత్వం పాలసీలు లేదా ప్రాజెక్టులను ఏ ఒక్కరి కోసమో కాకుండా దేశ ప్రజలందరి కోసమే ప్రవేశపెడుతుందని బదులిచ్చారు. అయితే.. ఆ ప్రాజెక్టులను అందుకోవడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా, సానుకూలంగా స్పందిస్తుందనే దానిపైనే వాటి రాక ఆధారపడి ఉంటుందని చెప్పారు.
చంద్రబాబు నాయుడు కుమారుడిగా, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేతగా మాత్రమే గుర్తింపు ఉన్న యువకుడు నారా లోకేష్. అదే నారా లోకేష్ ఇప్పుడు ప్రజా క్షేత్రంలో తిరుగులేని నాయకుడిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు.
ఈ చర్చోపచర్చలు, ఊహాగాన సభలపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ప్రెస్ అడ్డా వేదికగా క్లారిటీ ఇచ్చారు. దేశానికి నరేంద్ర మోదీ రూపంలో ఒక బలమైన ప్రధానమంత్రి ఉన్నారన్న లోకేష్.. చంద్రబాబు ప్రధాని అన్న చర్చకు, వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.
ఆయనకు పార్టీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదన్న చర్చ గత కొంత కాలంగా జనసేనలో అంతర్గతంగా సాగుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా, మీడియా ముఖంగా చేస్తున్న విమర్శలను, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంలో జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వం వెనుకబడిందన్న భావన సర్వత్రా వ్యక్తమౌతోంది.
నగర ప్రజల చిరకాల స్వప్నమైన హైదరాబాద్ మెట్రో విస్తరణ, నిధుల విడుదలే లక్ష్యంగా వీరిద్దరూ కలిసి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీ చాలా సానుకూల వాతావరణంలో జరిగిందనీ, మెట్రో ప్రాజెక్టుకు ఎదురవుతున్న ఆర్థిక అవరోధాలను అధిగమించడానికి ఇదొక కీలక ముందడుగని సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం పేర్కొన్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని సమర్ధంగా, ఎఫెక్టివ్ గా అమలు చేయగలుగుతున్నామని చెప్పారు. ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు దీనిని మరొక మెట్టు పైకి తీసుకువెళ్లి ముందుకు తీసుకెళ్లి ఈజ్ ఆఫ్ లివింగ్ అనే భావనను తీసుకొచ్చారనీ, ప్రజలు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలలో ఎప్పటినుంచో అనేక అంతరాలు, ఘర్షణలు ఉన్నాయనీ, సాంకేతికత ద్వారా ఆ అవరోధాలను తొలగించాలనేదే మా ఆలోచన అన్నారు.
ఎక్స్‌ప్రెస్ అడ్డా వేదికపైకి విప్లవాత్మక మార్పులకు, పాలనా విధానాలకు కేంద్ర బిందువులుగా నిలిచే అత్యున్నత ప్రముఖులను మాత్రమే ఆహ్వానిస్తారు. గతంలో ఈ వేదికపై కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, నితిన్ గడ్కరీ, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ వంటి దిగ్గజాలు పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు ఆ లీగ్‌లో నారా లోకేష్ నిలవడం ఆయన స్థాయిని రుజువు చేస్తోంది.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు.
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 1.25 లక్షల సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 19 లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 60 మార్కులు, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. అయితే.. అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా అభ్యర్థుల పేర్లు, వయసు, సాధించిన మార్కులతో కూడిన పూర్తి స్థాయి మెరిట్ జాబితాను బహిర్గతం చేయకుండా కేవలం మొబైల్ ఫోన్లకు సమాచారం పంపి నాటకీయంగా ప్రక్రియ ముగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.