పెళ్లి వేడుకలోనూ పార్టీ రంగు పట్ల నిబద్ధత చూపించిన మంత్రి నిమ్మల

Publish Date:Sep 24, 2025

Advertisement

 

మాములుగా పెళ్లిళ్లలో వధూవరుల బంధువులు, అతిథులు పట్టువస్త్రాలు, ఖరీదైన దుస్తులతో మెరిసిపోతారు. కానీ ఆ రీతిని మించి ప్రత్యేకత చూపించారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. తన కుమార్తె వివాహ వేడుకలోనూ ఆయన తన ట్రేడ్‌మార్క్ పసుపు రంగు చొక్కాతోనే హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. పార్టీపై తనకున్న అచంచల విశ్వాసం, విధేయతను మరోసారి చాటుకున్న ఆయన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే... పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో బుధవారం మంత్రి రామానాయుడు కుమార్తె శ్రీజ పెళ్లి సాయి పవన్ కుమార్‌తో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, నారా లోకేశ్‌తో పాటు పలువురు మంత్రులు, ప్రముఖ నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అందరూ పట్టువస్త్రాల్లో మెరిసిపోతుండగా, రామానాయుడు మాత్రం పసుపు చొక్కాతోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ప్రభుత్వ కార్యక్రమమా, కుటుంబ వేడుకనా అన్న తేడా లేకుండా ఆయన ఎప్పుడూ పసుపు చొక్కానే ధరిస్తారని అందరికీ తెలిసిందే. కొద్ది రోజుల క్రితం జరిగిన నిశ్చితార్థ వేడుకలోనూ ఇలాగే కనిపించడంతో నారా లోకేశ్ సరదాగా "పెళ్లికొడుకులా తయారవుతారని అనుకుంటే, మళ్లీ పసుపు చొక్కాతోనే వచ్చేశావేంటి" అని ఆటపట్టించగా, "పసుపు శుభసూచకం సార్" అని ఆయన ఇచ్చిన సమాధానం నవ్వులు పూయించింది.

పాలకొల్లు నుంచి వరుసగా మూడుసార్లు శాసన సభ్యుడుగా గెలిచి, 2019 వైసీపీ జోరు మధ్యలోనూ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసిన రామానాయుడు, పార్టీకి వీర విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన విశ్వసనీయతను గుర్తించిన చంద్రబాబు, ప్రభుత్వంలో కీలకమైన జలవనరుల శాఖను అప్పగించారు. ఇక ఇప్పుడు కుమార్తె పెళ్లిలో కూడా పార్టీ రంగును వీడకపోవడం, ఆయన విధేయతకు నిదర్శనంగా తెలుగు తమ్ముళ్లను ఆకట్టుకుంటోంది.

By
en-us Political News

  
ఈ నిధుల వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రామ్ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా పరస్పరం విరుద్ధమైన ప్రకటనలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పొలిటికల్ హీట్ ను పీక్స్ కు తీసుకెళ్లింది. ఒకవైపు సీఎం యోగి ఈ నిధుల గోల్ మాల్ ను అయోధ్య ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్రగా అభివర్ణిస్తుంటే.. మరోవైపు రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఇది ముమ్మాటికీ బహిరంగ దోపిడీ అని కుండబద్దలు కొట్టారు.
మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా ఈ దీక్షా వస్త్రాన్ని ధరించి దీక్ష చేపట్టారు. కే తన గురువు నుంచి మంత్రోపదేశం పొందిన నాటి నుండి పవన్ కల్యాణ్ వారాహి దీక్షను ఏటా చేపట్టడం ఒక సంప్రదాయంగా పాటిస్తూ న్నారు. ఏటా జ్యేష్ఠ మాసంలో దీక్ష ప్రారంభించి, కార్తీక మాసంలో విరమిస్తారు.
ఆస్ట్రేలియా వెళ్లాలనుకునే భారతీయ యువతకు అలర్ట్. వర్క్ అండ్ హాలిడే సబ్‌క్లాస్ 462 వీసా బ్యాలెట్ రిజిస్ట్రేషన్‌కు ఈరోజే ఆఖరి గడువు. వయోపరిమితి, ఫీజు మరియు అర్హతల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
226 మంది ప్రజాప్రతినిధుల మొత్తం ఆస్తుల విలువ అక్షరాలా 26 వేల 47 కోట్ల రూపాయలుగా తేలింది. దీని ప్రకారం లెక్కగడితే, సభలోని ఒక్కో రాజ్యసభ ఎంపీ సగటు ఆస్తి విలువ 15 కోట్లకు పైమాటే. మొత్తం సభ్యులలో 31 మంది ఎంపీలు అంటే దాదాపు 14 శాతం మంది ప్రజాప్రతినిధులు 100 కోట్లకు పైగా వ్యక్తిగత ఆస్తుల ఉన్నవారే.
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో సరికొత్త ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో 3, ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్ 2 మరియు ఎయిర్‌పాడ్స్ 4 లపై ఎన్నడూ లేని విధంగా భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. అద్భుతమైన ఫీచర్లు, ధరల వివరాలు ఇక్కడ తెలుసుకోండి!
భారతదేశంలో యూపీఐ (UPI) చెల్లింపులు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. నెలకు రూ. 20 లక్షల కోట్ల లావాదేవీలతో ఫోన్‌పే, గూగుల్ పే సృష్టించిన సంచలనాలు మరియు గ్లోబల్ మార్కెట్లో యూపీఐ క్రేజ్ గురించిన పూర్తి వివరాలు మీకోసం.
వివాహం తర్వాత మీ ఆధార్ కార్డులో భార్య లేదా భర్త పేరును అప్‌డేట్ చేయాలనుకుంటున్నారా? కేవలం ₹50 ఫీజుతో మై ఆధార్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో పేరు మార్చుకునే పూర్తి విధానం, అవసరమైన డాక్యుమెంట్ల వివరాలు మీకోసం
నిఫ్టీ 50 ఇండెక్స్ తొలిసారిగా 24,000 మార్కును తాకి రికార్డు సృష్టించింది. ఈ ఆల్-టైమ్ హై మార్కెట్‌లో మీ మ్యూచువల్ ఫండ్ ఎస్‌ఐపీ (SIP)లను ఆపాలా వద్దా? నిపుణులు సూచిస్తున్న పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్సింగ్ టిప్స్ మరియు పన్నుల పూర్తి వివరాలు మీకోసం
అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలోపేతం కావడం, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలతో భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు. ఎంసీఎక్స్ లేటెస్ట్ రేట్ల పూర్తి వివరాలు మీకోసం.
ఆన్‌లైన్ మరియు డిజిటల్ మోసాల బాధితులకు ఊరటనిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త రూల్స్ తెచ్చింది. మోసం జరిగిన 5 రోజుల్లోగా బ్యాంక్ మరియు 1930 హెల్ప్‌లైన్ కు ఫిర్యాదు చేస్తే గరిష్టంగా ₹25,000 వరకు పరిహారం పొందవచ్చు. 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఆర్‌బీఐ న్యూ డిజిటల్ ఫ్రాడ్ కాంపెన్సేషన్ రూల్స్, షాడో రివర్సల్ పాలసీ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై 113 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఎలిసె పేరి హాఫ్ సెంచరీతో రాణించగా, పాక్ జట్టు 86 పరుగులకే ఆలౌట్ అయింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హెర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఈ సంక్షోభానికి తెరపడటంతో.. భారతదేశానికి పెద్ద ఊరట . లభించిందనే చెప్పాలి.
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత్, బంగ్లాదేశ్ మధ్య నేడు కీలక మ్యాచ్ జరగనుంది. సెమీస్ రేసులో నిలవాలంటే హర్మన్‌ప్రీత్ సేన ఈ మ్యాచ్‌లో భారీ రన్‌రేట్‌తో గెలవడం తప్పనిసరి. మ్యాచ్ వివరాలు, బలాబలాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.