అందుకే..(నా) గజ్వేల్‌కు కేసీఆర్ గుడ్ బై?

Publish Date:Jan 29, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సిట్టింగ్ స్థానం గజ్వేల్ నుంచి పోటీ చేయరట. నియోజకవర్గ సమీక్షలో పార్టీ నాయకుడు, ప్రజా ప్రతినిధులకు ఈ విషయంలో ఆయనే స్వయంగా సంకేతాలు ఇచ్చారట. అంతే కాకుండా.. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓ రోల్ మోడల్ గా తాను తీర్చిదిద్దిన గజ్వేల్ నియోజకవర్గంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డిని బరిలో దింపుతున్నట్లు కూడా హింట్ ఇచ్చారట. అయితే.. మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా? లేక మరేదైనా కొత్త వ్యూహం పన్నారా? అనేది మాత్రం ఎవరికీ అంతుచిక్కని ఫజిల్ గా మారింది. ఇదే విషయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అయితే.. రాజకీయ ఎత్తులు వేయడంలో దిట్ట అనిపించుకున్న కేసీఆర్ మరేదో కొత్త వ్యూహం రచించి ఉంటారని, అందులో భాగంగానే తన సిట్టింగ్ గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయకూడదని నిర్ణయించుకుని ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ బీజేపీపైన, మోదీపైన సందర్భం వచ్చినప్పుడల్లా నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీపై ఒక విధంగా ఆయన వార్ ప్రకటించారనే చెప్పాలి. కేసీఆర్ మొన్నా మధ్యన తమిళనాడు వెళ్లి, ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ తో చర్చలు జరిపారు. ఆ చర్చల సారాంశం ఏమిటో బయటపెట్టకుండా గుంభనంగా ఉంచారు. ఆ తర్వాత బీహార్ ప్రతిపక్షనేత తేజస్వి యాదవ్, ఆ పార్టీలోని మరి కొందరు సీనియర్ నేతలను ప్రగతి భవన్ కు రప్పించుకుని చర్చలు జరిపారు. వారి కోసం కేసీఆర్ ప్రత్యేకంగా బీహార్ కు చార్టర్డ్ ఫ్లైట్ పంపించారని మీడియా అంతా కోడై కూసింది. అంతకు ముందు కేరళ సీఎం, ఇతర సీపీఎం జాతీయ స్థాయి నేతలతో కూడా ప్రగతిభవన్ లో సమాలోచనలు చేశారు.

అదలా ఉంచితే.. కేసీఆర్ కన్ను ఇప్పుడు కేంద్రంపై పడిందని, బీజేపీ ముక్త భారత్ దిశగా ఆయన పావులు కదుపుతున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ వంకతో కేంద్రం చక్రం తిప్పడమో లేక, ప్రధాన పదవి పైదవి పైనో కేసీఆర్ కన్నేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో పాటు తన కుమారుడు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ అధికార సింహాసనంపై కూర్చోబెట్టాలనే లక్ష్యం ఎన్నాళ్లుగానో కేసీఆర్ లో ఉంది. తాను ఢిల్లీపై గురిపెడితే.. కొడుకు తెలంగాణను ఏలుకోవాలనేది కేసీఆర్ వ్యూహం కావచ్చనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.

ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ లో నిర్వహించి సమీక్షలో వంటేరు ప్రతాపరెడ్డిని గెలిపించాలని ఇటీవలే ఎన్నికైన ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డికి సూచించారు. అయితే.. తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది మాత్రం ఏమాత్రం లీకవకుండా చతురుడైన చంద్రశేఖరరావు జాగ్రత్త పడ్డారు. ఇదే ఇప్పుడు కేసీఆర్ వ్యూహం ఏమిటనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చకు తావిస్తోంది. నిజానికి వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి తాను పోటీ చేయడం లేదని కేసీఆర్ చెప్పినప్పుడే స్థానిక నేతలు ఒక్కసారిగా అవాక్కయ్యారని తెలుస్తోంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ.. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు వంటేరు ప్రతాపరెడ్డి కేసీఆర్ పైన, గులాబీ పార్టీపైన ఒంటికాలిపై లేచి మరీ విమర్శలు చేసిన వైనాన్ని స్థానిక నేతలు లోపల్లోపలే గుర్తుచేసుకుని మదనపడుతున్నారట. అయితే.. గులాబీ బాస్ కు ఇప్పుడు అత్యంత సన్నిహితుడిగా వంటేరు ప్రతాపరెడ్డి ఉండడంతో కేసీఆర్ ముందు నోరు విప్పితే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అనే భయంతో వారు అన్నీ మూసుకుని గుంభనంగా ఉంటున్నారట. గజ్వేల్ నియోజకవర్గం నుంచి వంటేరును బరిలో దింపుతున్నట్లు కేసీఆర్ అభిప్రాయం చెప్పడంతోనే స్థానిక టీఆర్ఎస్ లో అప్పుడే లొల్లి మొదలైందంటున్నారు. ఇటీవలే టీఆర్ఎస్ లో చేరిన వంటేరుకు ఛాన్స్ ఎలా ఇస్తారనేది ఉద్యమకారులం అని చెప్పుకునే పార్టీ సీనియర్ల నుంచి తన్నుకు వస్తున్న ప్రశ్న. కేసీఆర్ ఓ ప్రతిపాదన తెచ్చినంత మాత్రాన అన్నీ అయిపోతాయా? వంటేరుకు ఛాన్స్ రాకుండా అడ్డుకునేందుకు ఆయన వ్యతిరేక వర్గం ఇప్పటికే రంగంలోకి దిగిందని అంటున్నారు.

By
en-us Political News

  
రాజకీయ నాయకులంటే జనం చెవుల్లో పూలు పెట్టకపోతే కుదరదు. తెలంగాణ ప్రజల చెవుల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు
40 ఏళ్లుగా హైద్రాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందుతూ వస్తున్న మజ్లిస్ పార్టీకి ఈ లోకసభ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందా? తండ్రి సుల్తాన్ సల్లావుద్దీన్ ఓవైసీ ( సాలార్) తర్వాత హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి అసదుద్దీన్ ఓవైసీ  వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా గెలుపు ధీమా కనిపించడం లేదు. కొద్ది నెలల క్రితం వరకూ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గడపగడపకూ అంటూ తన ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలలోకి పంపిన సమయంలోనే ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించినా జగన్ మాత్రం వైనాట్ 175 అన్న మాటను వదలలేదు.
ఏపీలో జగన్ ఖేల్ ఖతమ్ అయిపోయింది. ఇక తట్టా బుట్టా సర్దుకుని జైలుకు వెళ్ళే ఏర్పాట్లు చేసుకోవడమే
ఏపీలో ఎన్నిక‌ల వేళ న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్య‌ర్థి రోజాకు సొంత పార్టీ నేతల నుంచే ఎదురౌతున్న వ్యతిరేకత, నిరసనలు హాట్ టాపిక్ గా మారాయి. రెండు సార్లు వ‌రుస‌గా విజ‌యం సాధించిన ఆమె.. మూడోసారి విజ‌యంతో హ్యాట్రిక్ విజ‌యాన్ని న‌మోదు చేయాల‌ని ఆశపడుతున్నారు.
హెల్త్ ఇన్స్యూరెన్స్ పేరుతో ప్రీమియం లు వసూళ్ళకే పరిమితం అవుతూ క్లెయిమ్ ల విషయాలకు వచ్చేసరికి ఇలా వేధింపులకు గురి చేసి ఎగొట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్న TATA AIG GENERAL INSURANCE కంపెనీ వంటి సంస్థలపై, వాటి ఆగడాలకు చెక్ పెట్టేదెవ‌రు
కాపు సామాజిక వర్గంపై బలమైన ‘ముద్ర’ గడ సొంతం. అయితే అది ఇప్పుడు కాదు. ఒకప్పుడు. సొంత సామాజికవర్గంపై తన ఆధిపత్యం పోతుందా అన్న సందేహం ఇసుమంతైనా ఆయనలో కనిపించని రోజుల్లో కాపుజాతి కోసం అంటూ ఆయన ఉద్యమాలు చేశారు. కాపు రిజర్వేషన్ అంశాన్ని రాజకీయ పార్టీలు పట్టించుకోక తప్పని పరిస్థితి కల్పించారు. అయితే ఇదంతా గతం.
ఎపిలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే గడువు ఉంది. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. కూటమి అభ్యర్థుల తరపున ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం చేయాలని  నిర్ణయించారు.  ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది.. పోలింగ్‌‌కు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి.
నగరిలో రోజా ఓటమే ధ్యేయంగా వైసీపీ స్థానిక నేతలు పని చేస్తున్నారా? వారికి మంత్రి పెద్దిరెడ్డి మద్దతు ఫుల్ గా ఉందా? అన్న అనుమానాలు చాలా కాలంగా ఉన్నాయి. ఆమెపై సొంత పార్టీ నేతలు గతంలో చేసిన అవినీతి ఆరోపణలు ఇందుకు నిదర్శనం.
యథారాజా తథా ప్రజా అన్నది నానుడి. కానీ వైసీపీ విషయంలో మాత్రం యథా అధినేత, తథా ఆ పార్టీ నాయకులు అని మార్చుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల వేళ వైసీపీ అరాచకాలు రోజు రోజుకూ పెచ్చరిల్లుతున్నాయి.
హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్య చేసుకున్నవిద్యార్థి  రోహిత్ వేముల దళితుడు కాదని,
మరో పది రోజుల్లో  తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో సంపన్న అభ్యర్థి ఎవరు అన్నది చర్చనీయాంశమైంది. 
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.