జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది! ఇంకెన్నాళ్లు సాగ‌దీస్తారు

Publish Date:May 1, 2024

Advertisement

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసు విచారణ మే 15వ తేదీకి వాయిదా పడింది. అయితే సీబీఐ, ఈడీ కేసుల్లో వైయస్ జగన్ సహా 130 పిటిషన్లపై  గత 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది. ఆయా చార్జిషీట్ల నుంచి తమను తప్పించాలని కోరుతూ జగన్‌, విజయసాయిరెడ్డి సహా ఇతర నిందితులు దాఖలు చేసిన 130 డిశ్చార్జి పిటిషన్‌లపై తీర్పు వెలువడాల్సి ఉంది. వీటి పరిష్కారానికి హైకోర్టు ఇప్పటికే ఒకసారి గడువు పొడిగించింది. ఈ గడువు సైతం ఏప్రిల్‌ 30తో ముగిసింది. 

ఈ పిటిషన్‌లలో తీర్పు వెలువడుతుందని అంతా భావించారు. అయితే, అనారోగ్యం కారణంగా తీర్పులు సిద్ధం కాలేదని సీబీఐ కోర్టు జడ్జి రమేశ్‌బాబు పేర్కొన్నారు. ఇటీవల బదిలీల్లో రమేశ్‌బాబు సైతం వేరే కోర్టుకు బదిలీ అయ్యారు. ఈ కారణంగా మళ్లీ మొదటి నుంచి కేసులు వినేందుకు మే 15కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో 12 ఏళ్లుగా కొనసాగుతున్న విచారణ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. 

2013 నుంచి సీబీఐ కోర్టులో ఏడుగురు జడ్జిలు బదిలీ అయ్యారు. 2022, మే 4 నుంచి ఆయన జగన్‌ అక్రమాస్తులకు సంబంధించిన డిశ్చార్జి పిటిషన్‌లపై రమేష్ బాబు సుదీర్ఘంగా వాదనలు విన్నారు. తీర్పు వెలువరించాల్సిన సమయంలో బదిలీ కావడంతో ఆయన కేసులను తిరిగి ప్రారంభిస్తున్నట్టు(రీ ఓపెన్‌) ప్రకటించారు. దీంతో కొత్తగా వచ్చే జడ్జి మళ్లీ ఈ కేసులను మొదటి నుంచి వినాల్సిన అవసరం ఏర్పడింది. 

జగన్మోహన్ రెడ్డి పై గల 11 చార్జిషీట్ల వివరాలుః
మొదటి చార్జి షీట్: 75 ఎకరాల స్థలాన్ని M/s Hetero Group of companies కి మరియు M/s Aurobindo group కు కేటాఇంచినందుకుగాను రెడ్డికి ముట్టిన డబ్బు రూ.29కోట్లు.

రెండవ చార్జి షీట్: వ్యక్తిగత పెట్టుబడిదారుల నుంచి రూ.35.64కోట్లు సేకరించి మోసగించినందుకు.

మూడవ చార్జి షీట్: రూ.133.74కోట్ల M/s Ramky Pharmacity Project కు సంబంధించిన గ్రీన్ బెల్ట్ విషయంలో మితిమీరిన ప్రయోజనాలను ఆశించి పరస్పర ఒప్పందంతో రూ.10కోట్లను జగన్ లంచంగా తీసుకున్నందుకుగాను.

నాలుగవ చార్జి షీట్: నియమనిబంధనలను కాలరాస్తూ 22000 ఎకరాల స్థలాన్ని VANPIC Project కు సంబంధించి Nimmagadda Prasadకి ఇచ్చినందుకు పరస్పర ఒప్పందంగా జగన్ పరిశ్రమకు రూ.854 కోట్లను అందించినందుకుగాను.

ఐదవ చార్జి షీటు: కడప జిల్లా తళ్ళమంచిపట్నం గ్రామంలో 407 హెక్టార్ల గనుల తవ్వకాల లీజును Puneet Dalmia కంపెనీకి మంజూరు చేసినందుకు పరస్పర ఒప్పందంగా జగన్ కంపెనీలో రూ.95కోట్లు జమ చేసినందుకు.

ఆరవ చార్జి షీట్: India Cements కు కృష్ణ, కగ్న నదుల జలాలను, స్థలాన్ని మితి మీరిన ప్రయోజనాలకు మంజూరు చేసినందుకుగాను India Cements అధినేత N Srinivasan పరస్పర ఒప్పందంతో జగన్  కంపెనీలో రూ.140కోట్లను జమ చేసినందుకు.

ఏడవ చార్జి షీట్: M/s Penna Group కంపెనీస్ P Pratap Reddy తమ కంపెనీలకు అనంతపురం జిల్లాలో 231.09 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని మంజూరు చేసినందుకు, కర్నూలు జిల్లాలో 307 హెక్టార్ల భూమిలో   లైసెన్స్ పొందినందుకుగాను,రంగారెడ్డి జిల్లాలో 821 ఎకరాల గనుల తవ్వకాల లైసెన్స్ పునరుద్దరించినందుకుగాను మరియు బంజారా హిల్స్ లో తలపెట్టిన హోటల్ ప్రోజేక్టుకు ప్రయోజనాలను చేకూర్చినందుకు ప్రతిఫలంగా పరస్పర ఒప్పందంతో జగన్ కంపెనీలో రూ.68 కోట్లను పెట్టుబడిగా పొందినందుకు.

ఎనిమిదవ చార్జి షీట్: కడప జిల్లాలో 2037.54 ఎకరాల పాలరాతి గనుల తవ్వకాలను నిబంధనలను అతిక్రమించి నియమాలను ఉల్లంఘించి M/s Raghuram Cements Ltd కు కట్టబెట్టినందుకు.

తొమ్మిదవ చార్జి షీట్: అనంతపురం జిల్లాలో 8844 ఎకరాల M/s Lepakshi Knowledge Hub (LKH) ఏర్పాటుకు మరియు పెట్టుబడులకు నిబంధనలను అతిక్రమించి స్థలం కేటాయించినందుకు గాను పరస్పర ఒప్పందంతో జగన్ జగతి పబ్లికేషన్స్ కంపెనీలో రూ.50 కోట్లను పెట్టుబడిగా పొందినందుకు.

పదవ చార్జి షీట్: శంషాబాద్ పెట్టుబడుల పేరుతో M/s Indu Techzone Pvt Ltd కు 250 ఎకరాల స్థలాన్ని మంజూరు చేసినందుకు ప్రతిఫలంగా M/s Caramel Asia Holdings Pvt Ltd లో రూ.15 కోట్ల పెట్టుబడులను పొందినందుకు.

ఇది మాత్రమే కాక హవాలా నేరానికి సంబందించి రూ.840. కోట్లను సరిక్రొత్తగా ED జత చేసింది.

సీబీఐ కోర్టు జడ్జి రమేశ్‌బాబు.. ఎమ్మార్‌ కేసులో నిందితులు దాఖలు చేసిన 9 డిశ్చార్జి పిటిషన్‌లపై తీర్పు వెలువరించారు. జగన్‌ సన్నిహితుడు ఎన్‌. సునీల్‌రెడ్డి , కోనేరు ప్రదీప్‌, విజయరాఘవ, శ్రీకాంత్‌ జోషి, ఎమ్మార్‌ ఎంజీఎఫ్‌, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌, ఎమ్మార్‌ హిల్స్‌, బౌల్డర్‌ హిల్స్‌ డిశ్చార్జి పిటిషన్‌లను కోర్టు కొట్టేసింది. మరో నిందితుడు, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి బీపీ ఆచార్యపై 120బీ, 409 సెక్షన్లను తొలగించిన సీబీఐ కోర్టు.. అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు ఎదుర్కోవాల్సిందేనని పేర్కొంది. ఇతర నిందితులను కేసు నుంచి తప్పించడానికి నిరాకరించింది.  

జ‌గ‌న్ కేసుల క‌ద‌లిక లేదు. సిబిఐ, ఈడిల కేసుల లిస్ట్ చూస్తే...  అస్సాం హేమంత్ బిస్వాస్ శ‌ర్మ బిజేసి సి.ఎం, అజిత్ ప‌వార్ కేసుల్లో క‌ద‌లిక లేదు బిజెపి నేత‌, శివ‌సేన ఏక్‌నాథ్ షిండ్ ఎమ్మెల్య‌లే కేసుల్లో క‌ద‌లిక లేదు. అశోక్ చౌహాన్ ఆద‌ర్శ‌సొసైటీ కుంభ‌కోణం. ఇప్పుడేమో బీజేపీకీ స్టార్ క్యాంపెయిన‌ర్‌. అందుకే అత‌ని కేసుల్లోనూ క‌ద‌లిక లేదు. బెంగాల్‌కు చెందిన  సువేందో అధికారి బిజెపి ప్ర‌తిప‌క్ష నేత ఆయ‌న కేసుల్లోనూ క‌ద‌లిక లేదు. త‌మ వాళ్ళ‌ను బీజేపీ ముట్టుకోదు. అందుకే వాళ్ళు జైలు బ‌య‌ట వుంటారు.  త‌న వాడు కాద‌ని డిసైడ్ అయితే జైలుకు పంపుతుంది. కేసుల్లో క‌ద‌లిక ఏంటి తూఫాన్ వుంటుంది. జ‌గ‌న్‌కు బిజెపితో ఉన్న సాన్నిహితం తోనే ఆయ‌న కేసుల్లో క‌ద‌లిక లేదు. జ‌గ‌న్‌, ఎన్‌డిఏలో లేక‌పోయిన, త‌న‌ ప్ర‌త్యర్థి టీడీపీతో బీజేపీ క‌లిసిన, జ‌గ‌న్ స‌పోర్ట్ బిజెపికే. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు కూడా బిజెపికి మిత్రులే. ఢిల్లీలో స‌పోర్ట్ చేస్తారు. ఇక్క‌డ ఓ పాయింట్ గుర్తు పెట్టుకోవాలి. బిజెపికి జ‌గ‌న్ అవ‌స‌రంవుంది. ఎందుకంటే రాజ్య‌స‌భ‌లో 11 మంది ఎంపీలున్నారు. మ‌రో ప‌క్క బిజెపికి రాజ్య‌స‌భ‌లో బ‌లంత‌క్కువే.  కాబ‌ట్టి భ‌విష్య‌త‌లో బిజెపి జ‌గ‌న్ అవ‌స‌రం వుంది. అందుకే జ‌గ‌న్‌కు బిజెపి అనుకూలంగానే వుంటుంది. 

ఏపీ ప్ర‌జ‌ల‌కు అర్థం కాని విష‌యం ఏమిటంటే.... జ‌గ‌న్ ప‌ట్ల బీజేపీ సానుకూలంగా వున్నా, జ‌గ‌న్‌కు అన్ని రకాలుగా స‌హ‌కారం ఇస్తున్నా, అలాంటి బిజెపితో టీడీపీ ఎందుకు పొత్తు పెట్టుకుంది?  జ‌గ‌న్ ప‌రోక్ష స్నేహ‌సంబంధాలే గ‌త 12 ఏళ్ళ గా కేసుల్ని ప‌ట్టించుకోవ‌పోవ‌డానికి కారణం. అంత‌గా జ‌గ‌న్‌కు స‌పోర్ట్‌గా వున్న బిజేపీతో క‌లిసి వుండాలా? లేదా నిర్ణ‌యించుకోవాల్సిందే టీడీపీనే.

- ఎం.కె.ఫ‌జ‌ల్‌

By
en-us Political News

  
ఒక భూమి కు సంబంధించిన వివాదంలో  జూనియర్ ఎన్టీఆర్ హై కోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ప్లాట్ విషయంలో వివాదం నెలకొంది. 2003లో గీత లక్ష్మీ అనే మహిళ నుంచి ప్లాట్ కొనుగోలు చేశారు తారక్.
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని తేలిపోవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఫ్రస్టేషన్ లో ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో వైసీపీ వరుస దాడులకు బరి తెగించింది. ఈసీ జోక్యం చేసుకుని ఆయా జిల్లాలకు చెందిన అధికారులను సస్పెండ్ చేయడం, బదిలీ చేయడం , వేటు వేయడం వంటి చర్యలు తీసుకొంటున్నప్పటికీ దున్నపోతు మీద  వర్షం పడ్డట్టు తయారయ్యింది. 
ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో రెండు ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలను చూపుతూ నెటిజనులు ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ ను చెడుగుడు ఆడేస్తున్నారు. ఇంతకీ ఆ ఫొటోలు ఏమిటంటే.. ఒక ఫొటో జగన్ మనమంతా సిద్ధం యాత్రలో గులకరాయి దాడిలో గాయపడి నుదుటిపై బ్యాండేజ్ తో ఉన్న ఫొటో.
హైదరాబాద్ న‌గ‌రంలో మరోసారి డ్రగ్స్ ప‌ట్టుబ‌డ‌టం క‌ల‌క‌లం రేపింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు నగరంలోని కూకట్‌పల్లి ప‌రిధిలోని శేషాద్రినగర్‌లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్‌వోటీ అధికారులు దాడులు నిర్వహించారు.
తమ చిప్‌ని తింటూ వీడియో చేయాలి. తమ చిప్ తిన్న తర్వాత నీళ్ళు తాగకుండా, పంచదార లాంటి ఏ పదార్థాలూ తినకుండా ఐదు క్షణాలు వుండగలగాలి. ఇదీ ఛాలెంజ్.
నిన్నటి వరకు ఉక్కపోతగా  వాతావరణం ఒక్క సారిగా చల్లబడింది. శుక్రవారం హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షంతో ప్రారంభమైన వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి. 
ఏపీలో ఎన్నికలు పూర్తి అయి నాలుగు రోజులైనా రాష్ట్రంలో ఉద్రిక్తతలు చల్లారలేదు. హింసాకాండ అదుపులోనికి రాలేదు. పోలింగ్ సందర్భంగా, పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై సీఈసీ సీరియస్ అయింది. సీఎస్,డిజిపీలను ఢిల్లీకి పిలిపించుకుని మరీ వివరణ కోరింది. సరే దాదాపు మూడు గంటల పాటు సీఎస్, డీజీపీలో రాష్ట్రంలో పరిస్థితులపై వారి వివరణ ఇచ్చారు.
గెలుస్తున్నాం.. ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పకుండా, గెలుస్తారని ఆశిస్తున్నానని, ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశిస్తున్నాను అన్నప్పుడే బొత్సకి కూడా మళ్ళీ అధికారంలోకి వస్తారని నమ్మకం పోయిందని అనుకుంటున్నారు.
పొలిటికల్ కామెడీడలో ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ను మించిపోయారు. ఇంత కాలం రోహిణీకార్తె ఎండలను మించి వేడెక్కిన రాజకీయ మంటల నుంచి పాల్ మాత్రమే తన ప్రసంగాలతో ఒకింత ఉపశమనం కలిగిస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల రోజు, ఆ తరువాత యథేచ్ఛగా సాగిన హింసాకాండకు సంబంధించి కొందరు పోలీసు అధికారులు, కలెక్టర్లపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. పల్నాడు కలెక్టర్ ను బదిలీ చేసింది. పలువురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. వారందరిపై కూడా శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఏపీ సీఎస్, డీజీపీలను ఢిల్లీకి పిలిపించుకుని మరీ వివరణ కోరింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానం కావడానికి బాధ్యులెవరని నిలదీసింది. హింస ప్రజ్వరిల్లిన పల్నాడు ఎస్పీపై బదిలీ వేటు వేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం (మే 17) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ వెలుపలి వరకూ సాగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.