మేకపాటి మొరను పట్టించుకోని జగన్!

Publish Date:Mar 5, 2022

Advertisement

‘మేకపాటి మెరిట్స్ కళాశాల స్థలం అగ్రికల్చర్ యూనివర్శిటీకి ఇస్తా.. నా కుమారుడు గౌతమ్ రెడ్డి పేరు పెట్టండి’ అంటూ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తండ్రి, మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి ఇటీవల ప్రభుత్వానికి సందేశం పంపారు. అయితే.. ఆయన మొరను సీఎం జగన్ రెడ్డి ఇంతవరకూ పట్టించుకున్న పాపాన పోలేదు. 245 కోట్ల రూపాయల విలువైన సుమారు 110 ఎకరాల భూమిని, అందులోని భారీ కట్టడాలతో సహా ప్రభుత్వానికి ఇస్తానని, తన కుమారుడి పేరు పెట్టాలని మీడియా ముందుకొచ్చి మరీ రాజమోహన్ రెడ్డి చెప్పారు. ఆయన అలా చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటో అంతు చిక్కడం లేదంటున్నారు. దీని వెనుక ఏదో రహస్యం లేకపోలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దానమిస్తా మొర్రో అన్నా.. జగన్ దానిని పెడచెవిన పెట్టడంలోని ఆంతర్యం ఏమిటో అని ఏపీ ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.

మేకపాటి రాజమోహన్ రెడ్డి చాలా కాలంగా సైలంట్ గా ఉన్నారు. కొడుకు గౌతమ్ ఆకస్మిక మృతితో ఆయన కాస్త యాక్టివ్ అయ్యారు. తాను స్వయంగా కష్టపడి సంపాదించిన సొమ్ముతో మెట్టప్రాంతం ఉదయగిరిలో వంద ఎకరాల విస్తీర్ణంలో మేకపాటి మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేశారు. రాజకీయ కార్యకలాపాల కూడా ఏళ్ల తరబడి అక్కడి నుంచి ఆయన కొనసాగించారు. అయితే.. తన పేరు మీద ఉన్న కళాశాలకు తన కుమారుడు గౌతమ్ రెడ్డి పేరు పెట్టడం చాలా ఈజీ.. అలా చేయకుండా అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఇస్తాను గౌతమ్ రెడ్డి పేరు పెడితే అనడం వెనక ఏదో పెద్ద రహస్యమే దాగుందనే  ప్రచారం స్థానికంగా జరుగుతోంది.

ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఈ యూనివర్శిటీ పేరు తెర మీదకు రావడానికి కారణం లేకపోలేదంటున్నారు. గౌతమ్ రెడ్డి జీవించి ఉన్నప్పుడు ఉదయగిరిలో ప్రభుత్వం అగ్రికల్చర్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తే 120 కోట్లకు ఈ భూమిని ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నారట. దానికి సంబంధించి సెక్రటేరియట్ లో ఫైల్ కూడా మూవ్ అయిందట. గౌతమ్ బ్రతికి ఉంటే అది పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చేదనే ప్రచారం జరుగుతోంది. గౌతమ్ రెడ్డి ఉన్నప్పుడే ఫైల్ పై సంతకాలు కూడా చేశారని, అందుకు సంబంధించిన నిధులు మాత్రం ఇంకా రాలేదని రాజమోహన్ రెడ్డి దృష్టికి వచ్చిందట. దాంతో ముందుగానే ఒక మాట వేసి పెడితే అసలు సంగతి బయటకు వస్తుందని రాజమోహన్ రెడ్డి ఇలా భూమి, భవనాలు ఇస్తానన్నారని అనుకుంటున్నారు.

కానీ.. ఇంత జరుగుతున్నా జగన్ నుండి ఆ ఊసే లేకపోవడంతో మరిన్ని అనుమానాలకు తావిస్తోందంటున్నారు. దాంతోపాటు రాజమోహన్ రెడ్డికి జగన్ ఎలాంటి ప్రాధాన్యమూ ఇవ్వడం లేదని అంటున్నారు. దీంతో గౌతమ్ రెడ్డి ఉన్నప్పుడు ఫైల్ పై సంతకం చేసింది నిజమైతే.. డబ్బులు రాకపోయినా కనీసం కొడుకు పేరైనా నిలబడుతుందనేది రాజమోహన్ రెడ్డిలో చిన్న ఆశ అట. చూడాలి మరి ఏం జరుగుతుందో!

By
en-us Political News

  
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.