లోక్‌సభ సీట్ల పెంపుతో దక్షిణాదికి నష్టమే లేదు: సీఎం చంద్రబాబు

Publish Date:Nov 27, 2026

Advertisement

లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచడం వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ లోక్‌సభ స్థానాలు పెరుగుతాయని, ప్రస్తుతం ఆయా రాష్ట్రాలకు ఉన్న ప్రాతినిధ్య నిష్పత్తిలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించేందుకు ఢిల్లీకి వచ్చిన ఆయన.. కేంద్ర మంత్రులు హెచ్‌డీ కుమారస్వామి, రామ్మోహన్ నాయుడుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.

ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో 129 లోక్‌సభ స్థానాలు ఉండగా.. 50 శాతం పెంపుతో ఈ సంఖ్య 195కు చేరుతుందని చంద్రబాబు వివరించారు. దేశంలోని మొత్తం లోక్‌సభ స్థానాల్లో దక్షిణాదికి ప్రస్తుతం ఉన్న 23.76 శాతం వాటా యథాతథంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 25 స్థానాలు 38కి పెరుగుతాయని, మొత్తం లోక్‌సభ స్థానాల్లో రాష్ట్రానికి ఉన్న 4.6 శాతం వాటాలో మార్పు ఉండదని చెప్పారు. కర్ణాటకలో 28 నుంచి 42కు, తెలంగాణలో 17 నుంచి 26కు, తమిళనాడులో 39 నుంచి 59కు, కేరళలో 20 నుంచి 30కి స్థానాలు పెరుగుతాయని వెల్లడించారు.

ప్రస్తుతం దేశ జనాభా, లోక్‌సభ స్థానాల మధ్య ప్రాతినిధ్య నిష్పత్తిలో భారీ వ్యత్యాసం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. 1971 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 58.8 కోట్లు కాగా, అప్పట్లో 542 లోక్‌సభ స్థానాలు ఉన్నాయని గుర్తుచేశారు. 2026 నాటికి దేశ జనాభా దాదాపు 147 కోట్లకు చేరిందని, అయినప్పటికీ లోక్‌సభ స్థానాలు 543 మాత్రమే ఉండటం సరైనది కాదన్నారు. 1971లో ప్రతి 10 లక్షల మందికి ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తే.. ప్రస్తుతం సుమారు 27 లక్షల మందికి ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నారని వివరించారు. 50 శాతం సీట్ల పెంపుతో ఈ సంఖ్య 18 లక్షలకు తగ్గే అవకాశం ఉందన్నారు.

గతంలో దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేశాయని చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ కుటుంబ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ప్రచార కార్యక్రమాల ద్వారా సంతానోత్పత్తి రేటును తగ్గించగలిగామని చెప్పారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా నియంత్రణతో పాటు జనాభా నిర్వహణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రోత్సాహకాలు అందించే విధానాలను కూడా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఇది కూడ చదవండి: డీలిమిటేషన్‌పై కేంద్రం మాస్టర్ ప్లాన్.. 2051 వరకు రాష్ట్రాల ప్రాతినిధ్యం స్థిరం.!

మహిళా రిజర్వేషన్ బిల్లు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉందని, ఇప్పుడు దానిని అమలు చేసే దిశగా కీలక ముందడుగు పడుతోందని చంద్రబాబు అన్నారు. మహిళలకు రాజకీయాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని, జనాభాలో సగం ఉన్న మహిళలకు సముచిత స్థానం దక్కాలని ఆకాంక్షించారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చారిత్రక నిర్ణయాలు తీసుకుంటోందని చంద్రబాబు ప్రశంసించారు. రాజకీయాలకు అతీతంగా దేశ శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు.. అందుకు ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని మాత్రం సూచించడం లేదని విమర్శించారు. మహిళా బిల్లును మరోసారి అడ్డుకున్నా ఎన్డీయే ప్రభుత్వం తన ప్రయత్నాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. మహిళల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో అన్ని పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

మీకు నచ్చవచ్చు: డీలిమిటేషన్ ఎందుకు అవసరం: దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరిగేదెలా.?

మీకు నచ్చవచ్చు:  డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు ఎలా నష్టం...అసలు వివాదం ఏంటి?

 

 

[ CM Chandrababu Naidu, Lok Sabha Seats Increase, Delimitation, Women Reservation Bill, South India, Andhra Pradesh, Narendra Modi, NDA Government ]

By
en-us Political News

  
మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు చేపట్టిన నషా ముక్త్ భారత్ యాత్రకు ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
తమిళనాడులో సంచలనం సృష్టించిన మహిళా ఐఏఎస్ అధికారిణి వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
మదురై సమీపంలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభం వద్ద శనివారం దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో పర్యటించారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో అనూహ్య విమాన ఘటన చోటుచేసుకుంది.
సైబరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కొత్త చర్యలకు సిద్ధమవుతోంది.
ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై హెచ్చరిక చిహ్నాల అమలులో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సర్వం సిద్ధమైంది.
హైదరాబాద్ నగరంలోని రేతిబౌలి ప్రాంతంలో జరిగిన పెళ్లి ఊరేగింపులో కత్తులు చేతబట్టి నృత్యం చేసిన నలుగురు వ్యక్తులను గుడిమల్కాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.