ముగిసిన ఏపీ మంత్రి వర్గ సమావేశం..పలు కీలక నిర్ణయాలివే

Publish Date:Jun 24, 2025

Advertisement

 

పోలవరం -బసకచర్ల అనుసంధాన ప్రాజెక్టుతో  తెలంగాణకు ఎటువంటి నష్టం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాజకీయాల కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెబుతున్నారన్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించాల్సిన అవసరం మంత్రులపై ఉందని చంద్రబాబు తెలిపారు. సచివాలయంలో రాష్ట్రమంత్రివర్గ సమావేశం ముగిసింది. మొత్తం 42 అజెండా అంశాలకు కేబినేట్ ఆమోదం తెలిపింది. అనంతరం రాజకీయ అంశాలపై చర్చించారు. అమరావతిలో మలివిడత భూసేకరణపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. తొలివిడత నిబంధనలే మలివిడతకూ వర్తింపజేయాలని నిర్ణయించారు. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాలను ఇన్‌ఛార్జి మంత్రి నేతృత్వంలో జిల్లాస్థాయిలో నిర్వహించాలని మంత్రి వర్గం నిర్ణయించింది.

రాజధానిలో మరో 44వేల ఎకరాల సేకరణకు మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. స్వర్ణాంధ్ర P4పై త్వరలో కమిటీలు ఏర్పాటు చేయడానికి కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అన్న క్యాంటీన్ ప్రతి నియోజకవర్గం కేంద్రంలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్న క్యాంటీన్లు మానిటర్ చేయడానికి, ఎవరైనా విరాళాలు ఇస్తే తీసుకవడానికి ఒక కమిటీని వేయాలని సీఎం సూచించారు. టెన్నిస్ ప్లేయర్ సాకేత్‌కు గ్రూప్- 1 ఉద్యోగం ఇవ్వాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. అనకాపల్లిలో ఆర్సెల్ మిట్టల్ స్టీల్‌కు సెప్టెంబర్‌లో శంకుస్థాపన చేసే విధంగా చూడాలని సీఎంచంద్రబాబు తెలిపారు.

పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. జాతీయ స్థాయిలో కొన్ని పంటలకు డిమాండ్ లేకపోవడంతో మనం మార్కెట్‌లోనే ప్రవేశించి కొంటున్నామని స్పష్ట చేశారు. పొగాకుకు మార్కెట్‌లో ధర తక్కువగా ఉండటంతో రూ. 250 కోట్లు మనం మార్కెట్‌లో ప్రవేశించి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్‌లో వాణిజ్య పంటలకు డిమాండ్ ఎక్కువ ఉన్న పంటలు వేసే విధంగా రైతులను మోటివేట్ చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. అందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ రైతుల్లో అవగాహన తీసుకురావాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు

By
en-us Political News

  
వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా మరోసారి రెచ్చిపోయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాలిలో గెలిచిన..గాలిన కొడుకులు ఎక్కువయ్యారంటూ కూటమి నేతలపై మండిపడ్డారు.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న అయిదు టెస్టుల సిరీస్‌లో ఇండియాని అదృష్టం వెక్కిరిస్తోంది. భారత్ యువ జట్టు ఇంగ్లాండ్ టూర్ లో మంచి ఆటతీరు ప్రదర్శిస్తున్నప్పటికీ లక్ మాత్రం కలిసి రావడం లేదు.
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాపై ప్రధాని మోదీ స్పందించారు. వివిధ హోదాల్లో దేశానికి సేవ చేసేందుకు ధన్‌ఖడ్‌కు అనేక అవకాశాలు లభించాయని తెలిపారు. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ ఖడ్ చేసిన రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో ఇక ఇప్పుడు నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యం. ఇక్కడే ధన్ ఖడ్ రాజీనామాకు కారణాలేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు, ధన్ ఖడ్ రాజీనామాకూ ముడి పెడుతూ రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది.
ఒక టీవీ, బెడ్, వెస్ట్రన్ కమోడ్, మూడు పూటలా బయట నుంచి భోజనం, మంచం, దోమ తెర, యోగ మ్యాట్, వాకింగ్ షూస్, వార్త పత్రికలు, ఒక పర్యవేక్షకుడు, వారానికి ఐదు రోజులు ఇద్దరు లాయర్లతో ప్రైవసీతో కూడిన సమావేశాలు, రెగ్యులర్ మెడిసిన్, నోట్ బుక్స్, పెన్స్. ఇదీ ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలిక నిందితుడు మిథున్ రెడ్డి జైల్లో కావాలని అడిగిన సౌకర్యాలు
దేశంలోని అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఒకటైన 2006 ముంబై రైలు పేలుళ్లు కేసు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముంబై లోకల్ రైళ్లలో జూలై 11, 2006న జరిగిన వరుస బాంబు పేలుళ్లు దేశాన్ని విషాదంలో ముంచాయి. ఈ కేసులో కింద కోర్టు నిందితులకు విధించిన శిక్షను బాంబే హైకోర్టు రద్దు చేసి నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ తీర్పు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఎలాంటి సంకేతం, సమాచారం లేకుండా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజునే ధన్‌ఖడ్‌ తమ రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు సమర్పించారు. అనారోగ్య కారణాల రీత్యా వైద్య సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఛామకూర మల్లారెడ్డి కమలం గూటికి చేరనున్నారా? కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నారా? అంటే తెలంగాణ రాజకీయవర్గాలలో ఔననే ప్రచారమే జరుగుతోంది.
గత నాలుగు రోజులుగా తెలంగాణలో దంచి కొట్టిన వర్షాలు మంగళవారం నాడు ఒకింత తెరిపి ఇచ్చాయి. ఇక ఇప్పుడు ఏపీ వంతు అంటున్నాయి. రానున్నమూడు రోజులూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
నల్లమల అడవి ప్రాంతంలోని అభయారణ్యంలో పెద్దపులి దాడిలో ఓ గిరిజనుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆత్మకూరు రేంజ్ లో కొత్తపల్లి మండలం సదరం పెంట చెంచు గుడానికి చెందిన పులిచెర్ల అంకన్న అనే యువకుడిపై సోమవారం పులి దాడి చేసింది.
వైసీపీ నేతలు, శ్రేణులను అరెస్టు భయం వణికించేస్తున్నది. అధికారంలో ఉండగా చేసిన తప్పుడు, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితి ఏర్పడటంతో వారు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అరెస్టయ్యారు. మాజీ మంత్రి పేర్ని నాని వంటి వారు అజ్ణాతంలోకి వెళ్లి కోర్టు బెయిలు మంజూరు చేస్తుందన్న ఆశతో ఉన్నారు.
వైఎస్ వివేకా హత్య కేసు నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ పై సోమవారం (జులై 21) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నిందితులుగా ఉన్న అవినాష్ రెడ్డి సహా పలువురి బెయిల్ రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
తిరుమలలో భక్తుల రద్దీ కొరసాగుతున్నది. ఆది, సోమవారాలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. మంగళవారం (జులై 22) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఏటీజీహెచ్ వరకూ సాగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.