సీఐఐ నివేదికను విడుదల చేసిన సీఎం చంద్రబాబు

Publish Date:Sep 17, 2025

Advertisement

 

పారిశ్రామిక వేత్తలకు రాష్ట్రప్రభుత్వం  ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో ఎవరూ పోటీ పడలేరని సీఎం అన్నారు. విశాఖలో సీఐఐ- గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్ కు కేంద్ర మంత్రి నిర్మలా సీతా రామన్ తో కలిసి ముఖ్యమంత్రి హాజరయ్యారు.  రాష్ట్రంలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం ఉన్న మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని సీఎం అన్నారు.


కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ డిజిట్ గ్రోత్ సాధిస్తుందని అన్నారు. సరైన సమయంలో సరైన చోట సరైన నేతగా ప్రధాని మోదీ ఉన్నారని .. దేశానికి ఆయన పెద్ద ఆస్తి అని సీఎం వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ బలమైన ఆర్ధిక వ్యవస్థగా ఉందని అన్నారు. 2028 నాటికే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదుగుతుందని స్పష్టం చేశారు. 

ఏపీ కూడా 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా విజన్ రూపొందించామని సీఎం స్పష్టం చేశారు. వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్ నినాదంతో కుటుంబంలో ఒకరిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దటంతో పాటు ..రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, ఆలోచనలను ప్రోత్సహిస్తామని అన్నారు. విభజన తర్వాత వారసత్వంగా వచ్చిన ఇబ్బందులను అధిగమించామని అన్నారు. 2019-24 మధ్య రాజకీయ పరిస్థితులు, పాలనా కారణాల వల్ల ఏపీ చాలా అవకాశాలను కోల్పోయిందని సీఎం వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఏపీలో ఒక రెస్పాన్సిబుల్ ప్రభుత్వం అధికారంలో ఉందని ముఖ్యమంత్రి అన్నారు. 

* వచ్చే ఆగస్టుకు భోగాపురం ఎయిర్ పోర్టు సిద్ధం* 

ఏపీలో ఉన్న సుదీర్ఘ తీరప్రాంతంతో పాటు పోర్టు ఆధారిత పరిశ్రమల ద్వారా ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి అన్నారు. దీని కోసం ఏపీలో లాజిస్టిక్స్ రంగంపై దృష్టి పెట్టామని పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారులు, రైల్వేలను సమన్వయం చేస్తూ రవాణా వ్యయాన్ని తగ్గిస్తామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. వచ్చే ఏడాది ఆగస్టు నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని తెలిపిన సీఎం.. విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, కడపతో పాటు ఓర్వకల్లు, పుట్టపర్తి లాంటి చోట్ల విమానాశ్రయాలు రాష్ట్రాన్ని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తున్నాయని స్పష్టం చేశారు. 

త్వరలో అమరావతిలోనూ అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం నిర్మించాలని నిర్ణయించినట్టు తెలిపారు. హైదరాబాద్-అమరావతి-చెన్నైలను అనుసంధానిస్తూ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కూడా వస్తుందన్నారు. అమరావతి నగరాన్ని గ్రీన్ ఫీల్డ్ నగరంగా నిర్మిస్తున్నామని.. విజయవాడ-గుంటూరులను అనుసంధానిస్తున్నట్టు తెలిపారు.  వచ్చే నెలలో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అవుతుందని అన్నారు. టెక్నాలజీ పరంగా దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 

సంజీవని ప్రాజెక్టు ద్వారా బిల్ గేట్స్ ఫౌండేషన్ తో కలిసి డిజిటల్ హెల్త్ రికార్డులను తయారు చేస్తున్నట్టు వివరించారు. అలాగే డేటా లేక్ ద్వారా ప్రభుత్వ శాఖల సమాచారాన్ని అనుసంధానం చేస్తున్నామని స్పష్టం చేశారు. వాట్సప్ గవర్నెన్సు ద్వారా పౌర సేవలను అందిస్తున్నామని వివరించారు. సేవల నాణ్యత కోసం  ప్రైవేటు కంపెనీల తరహాలోనే ఈ సేవలకు రేటింగ్ కూడా కోరుతున్నామని అన్నారు. అలాగే జీఎస్టీ స్లాబ్ లను తగ్గిస్తూ కేంద్రం తీసుకువచ్చిన సంస్కరణలు ఓ గేమ్ చేంజర్ గా మారనున్నాయని వివరించారు.

By
en-us Political News

  
Before choosing a group health insurance plan, you should consider the eligibility criteria and check whether the insurer has a smooth claim processing. Let us explore what are the group health insurance benefits in more detail.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన ఆర్థిక వనరులు, లావాదేవీలపై ఐటీ   ప్రత్యేక దృష్టి పెట్టింది. గత కొంతకాలంగా పెద్ద మొత్తంలో జరిగిన నగదు లావాదేవీలకు సరైన లెక్కలు లేకపోవడం, పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉండటమే ఈ దాడులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
అలాంటి అరుదైన, విలక్షణమైన వన్యప్రాణుల జాబితాలో ఇండోనేషియాలోని సులవేసి ద్వీపానికి చెందిన  మ్యాక్రోసెఫాలోన్ మెలియో పక్షి  జాతి ఒకటి. సాధారణ పక్షుల వలె చెట్లపై గూళ్లు కట్టుకుని, గుడ్లను పొదిగే సంప్రదాయ పద్ధతికి ఇది పూర్తి భిన్నం. ఈ పక్షి జీవన శైలి  అడవి కోడిని పోలి ఉంటుంది.
ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వాతావరణ రాడార్లు అందుబాటులోకి రాకముందే..   పూర్వీకులు చెట్లను, జంతువులను, కీటకాలను గమనించి రానున్న విపత్తులను అంచనా వేశారు. ఆ అంచనాలు దాదాపు కచ్చితంగా ఉండేవి. పర్యావరణంలో వచ్చే చిన్న చిన్న మార్పులను,  భూగర్భంలో జరిగే అలజడిని మనుషుల కంటే ముందుగా వృక్షజాలం పశుపక్ష్యాదులు పసిగడతాయని శాస్త్రీయ అధ్యయనాలుచెబుతున్నాయి.
ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావు జీవిత విశేషాలు, ఆయన అవలంబించిన వ్యాపార విధానాలు మరియు ఎదుర్కొన్న రాజకీయ సవాళ్లపై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డి.ఎన్. ప్రసాద్  తెలుగువన్ ది జర్నలిస్ట్ మూడో  ఎపిసోడ్‌లో  తెలుగువన్ ఎండీ  రవిశంకర్ తో పంచుకున్నారు.  
ఉపాధి కోసం వలస వెళ్లిన కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఉతికేందుకు కుంటకు వెళ్లిన ముగ్గురు నీటిలో మునిగి దుర్మరణం చెందారు. ఈ హృదయవిదారక ఘటన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
న్యూయార్క్ సమీపంలోని ఆల్బనీ ప్రాంతంలో  నివాసముంటున్న ఆమె అమెరికా కాల మానం ప్రకారం గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో ఖమ్మంలో ఉన్న తన తండ్రి నల్లమల్ల ఆనంద్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతుండగానే  గుండె నొప్పితో కుప్పకూలిపోయారు.
జామో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలంపూర్ గ్రామంలో ఉన్న ఒక బాణసంచా తయారీ యూనిట్లో  భారీ పేలుడు సంభవించింది.   శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు  
తెలంగాణలో కూడా వచ్చేమూడు రోజులూ పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలు కురిసే సమయాల్లో పిడుగుపాటుకు అవకాశాలున్నందున విద్యుత్ స్తంభాలు, చెట్లకింద నిలబడవద్దని హెచ్చరించింది.
నాగర్‌కర్నూల్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ పేరిట రూ.29.27 కోట్ల విలువైన 12,530 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైన భారీ కుంభకోణం వివరాలు.
కృష్ణా జిల్లాలో దీపావళి టపాసులు కాల్చే సమయంలో కెమికల్ డ్రమ్ పేలి పదేళ్ల బాలుడు మృతి చెందిన విషాదకర సంఘటన పూర్తి వివరాలు. పిల్లల భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
హైదరాబాద్ మల్కాజిగిరి నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ గల్లంతైన రాము, లక్ష్మి దంపతుల అదృశ్యం వెనుక మిస్టరీ ఏంటి? కూతురితో చివరి కాల్, ఫోన్లు స్విచ్ఛాఫ్ అయిన వైనంపై పూర్తి వివరాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.