కుప్పానికి కృష్ణ‌మ్మ‌...అప‌ర‌భ‌గీర‌థుడు చంద్ర‌బాబు

Publish Date:Aug 30, 2025

Advertisement

 

అస‌లేంటి హంద్రీనీవా ప్రాజెక్టు దీని పూర్వాప‌రాలు ఎలాంటివి అని చూస్తే.. రాయలసీమలోని నాలుగు కరువు ప్రభావిత మాజీ జిల్లాలకు సాగు, త్రాగునీటి సౌకర్యాలు అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.

హంద్రి–నీవా మెయిన్ కెనాల్, కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల గ్రామం సమీపంలోని శ్రీశైలం ఆనకట్ట జలాశయం నుంచి ప్రారంభమవుతుంది. 120 వరద రోజులలో 40 టీఎంసీల కృష్ణా వరదనీటిని వినియోగించుకునేలా ప్రతిపాదన. మెయిన్ కెనాల్ వెంట 12 చోట్ల లిఫ్టులు ఏర్పాటు చేశారు.

సుమారు 6,02,500 ఎకరాలకు అంటే 2.438 లక్షల హెక్టార్లు  ఖరీఫ్‌ సాగునీరు, అలాగే 33 లక్షల మందికి 4 టీఎంసీలు  త్రాగునీటి సదుపాయం కల్పన. ముచ్చుమర్రి లిఫ్ట్ వద్ద రిజర్వాయరు లెవెల్ +244.700 మీటర్లు అంటే 802.821 అడుగుల ద‌గ్గ‌ర‌ ఉన్నప్పుడు నీటిని తీసుకుంటారు.

మెయిన్ కెనాల్ మొత్తం పొడవు 554.175 కి.మీ. ఉంది. కర్నూలు జిల్లా మల్యాల నుంచి అన్నమయ్య జిల్లాలోని అదవిపల్లె రిజర్వాయరు వరకు సాగుతుంది. గరిష్ట డిమాండ్ తీర్చడానికి 9.05 టీఎంసీల సామర్థ్యం గల 8 రిజర్వాయర్లు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుకు కావలసిన విద్యుత్‌ సుమారు 672 మెగావాట్లుగా ఉంది.


ప్రాజెక్టు దశల విష‌యానికి వ‌స్తే.. ఫేజ్–I: జీడిపల్లె రిజర్వాయరు వరకు వెళ్తుంది. ఇది 1,98,000 ఎకరాలకు సాగునీరు, 14 టీఎంసీల నీరందిస్తుంది. ఇక ఫేజ్–II: జీడిపల్లె నుంచి అదవిపల్లె రిజర్వాయరు వరకు సాగుతుండ‌గా..  4,04,500 ఎకరాలకు సాగునీరు, 26 టీఎంసీల మేర అందిస్తుంది. మెయిన్ కెనాల్‌పై రిజర్వాయర్ల విష‌యానికి వ‌స్తే..  కృష్ణగిరి – 0.161 TMC కాగా,  పాతికొండ – 1.126 TMC,  జీడిపల్లె – 1.631 TMC, కాగా మరాల – 0.465 TMC,  శ్రీ ఎం.ఆర్. శ్రీనివాసపురం – 1.020 TMCగా ఉంది. అదవిపల్లె – 1.814 TMCలుగా ఉంది. 

బ్రాంచ్ కెనాల్‌పై రిజర్వాయర్ల విష‌యానికి వ‌స్తే.. గోల్లపల్లె – 1.913 TMC మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌పై, చెర్లపల్లె – 1.608 TMC పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌పై బ్రాంచ్‌ కెనాళ్లు, ఇక‌  డిస్ట్రిబ్యూటరీలు, మడకశిర బ్రాంచ్ కెనాల్  235.435 Km – 61,557 ఎకరాలు, పేరూరు బ్రాంచ్ కెనాల్: 6.07 Km – 80,600 ఎకరాలు, పుంగనూరు బ్రాంచ్ కెనాల్: 220 Km – 37,300 ఎకరాలు, తంబళ్లపల్లె బ్రాంచ్ కెనాల్: 29.43 Km – 15,000 ఎకరాలు, నీవా బ్రాంచ్ కెనాల్: 132.35 Km – 57,500 ఎకరాలు, వాయలపాడు బ్రాంచ్ కెనాల్: 23.5 Km – 17,200 ఎకరాలు, చింతపర్తి డిస్ట్రిబ్యూటరీ..  42.30 Km – 22,400 ఎకరాలు, ఎల్లుట్ల డిస్ట్రిబ్యూటరీ: 25.17 Km – 15,400 ఎకరాలు, సదుము డిస్ట్రిబ్యూటరీ: 39.28 Km – 5,400 ఎకరాలు, పుంగనూరు బ్రాంచ్ కెనాల్, మెయిన్ కెనాల్‌ @ కిమీ 400.500, పట్టణం గ్రామం, కదిరి మండలం, శ్రీ సత్యసాయి జిల్లా నుండి ప్రారంభం కానుంది. దీని పొడవు: 220.350 Km. జ్యూరిస్డిక్షన్: గుద్దంపల్లె (అన్నమయ్య జిల్లా) నుండి కలగటూరు  అంటూ చిత్తూరు జిల్లా  వరకు ఉంటుంది. 

ఇక కుప్పం బ్రాంచ్ కెనాల్  పుంగనూరు బ్రాంచ్ కెనాల్ @ Km 207.800, అప్పినపల్లె, పెద్దపంజాణి మండలం, చిత్తూరు జిల్లా వద్ద ప్రారంభం కానుంది. 110 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు నీరందించడం, 6,300 ఎకరాల సాగునీరు స్థిరీకరించడం, అలాగే పాలమనేరు & కుప్పం నియోజకవర్గాల 8 మండలాల్లో 4.02 లక్షల మందికి త్రాగునీరు అందించడం. పొడవు వివరాలు : 131.200/143.900 Km, 3 లిఫ్టులు ఏర్పాటు చేశారు. కుప్పం చివ‌ర్లోని కెనాల్ చివర పరమసముద్రం చెరువుకు ఈ నీరు చేరుతుంది.

దీన్నిబ‌ట్టీ చూస్తే.. చిత్తూరు జిల్లా చివ‌రి ఆయ‌క‌ట్ట వ‌ర‌కూ కృష్ణాజ‌లాలు ప్ర‌వ‌హించడం ఒక చ‌రిత్ర‌, 2014 నుంచి 2019 మ‌ధ్య వ‌ర‌కూ నాలుగు వేల కోట్ల వ‌ర‌కూ వెచ్చించిన చంద్ర‌బాబు 2024 లో తిరిగి పీఠ‌మెక్కాక‌.. నెల‌లో మెయిన్ కెనాల్ పూర్తి చేసి.. కృష్ణా జ‌లాల‌ను ఎట్ట‌కేల‌కు కుప్పం చేర్చారు. ఈ విష‌యంలో ఆయ‌న్ను అప‌ర భ‌గీర‌థుడ‌ని అన‌డంలో ఎలాంటి సందేహం లేదంటారు ఈ ప్రాంత వాసులు.
 

By
en-us Political News

  
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.