ఏపీలో విద్యార్థులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు పావలా వడ్డీకే రుణాలు అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. సంక్షేమ శాఖపై జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. విదేశాల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలనుకునే ప్రతీ విద్యార్ధుల కోసం సరికొత్త పథకాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఎలాంటి పరిమితులు లేకుండా, ఎంతమంది విద్యార్ధులకైనా చదువుకునే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దేశంలో ఐఐటీ, ఐఐఎం నీట్ వంటి ఉన్నత విద్య చదవాలనుకునే వారికి కూడా ఈ పథకం వర్తింప చేయాలని పేర్కొన్నారు. ఇందులో 4 శాతం వడ్డీకే బ్యాంకు రుణాలు ఇవ్వడంతో పాటు, దానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 14 ఏళ్లలో రుణాన్ని చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు. అటు బీసీ విద్యార్ధులు ఐఐటీ, నీట్‌లో కోచింగ్ కోసం రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm-chandrababu-36-207455.html
నాటోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారతదేశానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
అమెరికా సైనిక కార్యకలాపాలకు సాంకేతిక సహకారం అందిస్తున్నాయంటూ.. ఇరాన్ ఇప్పుడు టెక్ దిగ్గజాలైన అమెజాన్, ఒరాకిల్ వంటి సంస్థల డేటా సెంటర్లపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. బహ్రెయిన్‌లోని అమెజాన్ డేటా సెంటర్‌తో పాటు దుబాయ్‌లోని ఒరాకిల్ కేంద్రాలపై ఇరాన్ దాడులు చేసింది.
బయో గ్లాస్ మోడల్‌లో 12 రకాల విభిన్న మూవ్‌మెంట్స్ ఉంటాయి. ఇది వినియోగదారుడి కండరాల సంకేతాలను లేదా ముందే ప్రోగ్రామ్ చేసిన ఏఐ కమాండ్స్‌ను అర్థం చేసుకుని, వస్తువులను పట్టుకోవడం, రాయడం, చేయిని వివిధ దిశల్లో తిప్పడం వంటి పనులను అతి సులువుగా చేయగలదు. ఇది రీఛార్జబుల్ బ్యాటరీతో నడుస్తుంది కాబట్టి మొబైల్ ఫోన్ లా చాలా సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు.
రాత్రి సమయం కావడం, బావిలో నీరు నిండుగా ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారింది. సమాచారం పోలీస్ లు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. విపత్తు నిర్వహణ బృందాలు రెండు భారీ క్రేన్ల సహాయంతో అర్ధరాత్రి దాటిన తర్వాత కారును బావిలో నుంచి బయటకు తీశారు. అయితే అప్పటికే కారులో ఉన్న వారంతా మరణించారు.
మధ్యప్రాచ్యంలో శుక్రవారం ఒకేరోజు రెండు అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చివేయడం అంతర్జాతీయం కలకలం రేపింది. ఇరాన్ యుద్ధ సామర్ధ్యంపై ప్రపంచ దేశాలు అబ్బురపడుతున్నాయి. అమెరికా అంచనాలు ఘోరంగా దెబ్బతిన్నాయని అంటున్నాయి. ఇక పోతే ఇరాన్ దూకుడుతో అగ్రరాజ్యం డిఫెన్స్ లో పడింది.
ఐఆర్జీసీ సమాచారం మేరకు నైరుతి ఇరాన్ లో అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానం ఇరాన్ గగతనలంలోకి ఇలా ప్రవేశించిందో లేదో.. అలా ఇరాన్ రక్షణ వ్యవస్థలు దానిని కూల్చివేశాయి. విమానం కూలిపోయే ముందే అందులోని ఇద్దరు సిబ్బంది ఎజెక్ట్ అయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలనూ, విమానం శకలాలకు సంబంధించిన దృశ్యాలను కూడా ఇరాన్ మీడియా ప్రసారం చేసింది.
ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో జనం ఉక్కపోతతో, ఎండ వేడితో అల్లాడిపోతున్నారు. అసలే భానుడి ప్రతాపానికి విలవిల్లాడుతున్న ఏపీ జనాలకు వాతావరణ శాఖ మరో వార్నింగ్ ఇచ్చింది. నేటి నుంచి రోజుల పాటు రాష్ట్రంలో ఎండలు మరింత మండిపోతాయనీ, రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్లులు విస్తాయనీ ప్రకటించింది.
ఈ విషయాన్ని మాటలతో కాకుండా చేతలతో చేసి చూపించింది. అమెరికా స్థావరాలు, జెట్లు లక్ష్యంగా దాడులను తీవ్రతరం చేసింది. గురువారం అమెరికా ఇరాన్ కు 48 గంటల కాల్పుల విరమణ శాంతి ప్రతిపాదనను పంపింది. ఆ ప్రతిపాదనకు సమాధానమా అన్నట్లు ఇరాన్ దాడులను తీవ్రతరం చేసింది.
ఢిల్లీతో సహా పంజాబ్‌లోని నోయిడా, ఛండీగఢ్, లూధియానాలో భూమి కంపించింది. అలాగే పూంచ్, శ్రీనగర్, ఉదమ్‌పూర్, జమ్ము కశ్మీర్‌లోనూ భూమి కంపించింది.
210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 5 వికెట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. పంజాబ్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీ నగర్ లో నివాసం ఉంటున్న గచ్చు శ్రీశైలం అనే వ్యక్తి కి భార్య, ఇద్దరు కవల కుమార్తెలు. కుటుంబ కలహాల నేపథ్యం లో తరచూ భార్యాభర్తల మధ్య వివాదాలు సాగుతున్నాయి. ఆ క్రమంలోనే శుక్రవారం కూడా భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. ఆ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన శ్రీశైలం.. ఐదేళ్ల వయసు ఉన్న తన ఇద్దరు కుమార్తెలకు గడ్డి మందు తాగించి బావిలో పడేశాడు.
రాజేంద్రనగర్ కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్‌కు చెందిన మహ్మద్ రహ్మత్ షరీఫ్ అనే వ్యక్తి గత నెల 31న కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో తమ ఇంట్లో బంగారం చోరీ అయ్యిందంటూ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు జనవరి 17న ఆయన భార్య, కుమార్తె బంగారు ఆభరణాలను బీరువాలో భద్రరిచారు. ఆ తరువాత గత నెల 29న ఓ ఫంక్షన్ కు వెళ్లేందుకు బంగారు ఆభరణాలు ధరించేందుకు బీరువాలోని నగల పెట్టె తెరిచి చూశారు.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రశాంత్ బోస్, మావోయిస్టు ఉద్యమంలో అత్యంత ప్రభావమంతమైన నాయకులలో ఒకరు. కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరోలో కీలక సభ్యుడిగా ఉండటంతో పాటు, ఆ సంస్థ యొక్క తూర్పు ప్రాంతీయ బ్యూరో కార్యదర్శిగా కూడా పనిచేశారు.ప్రశాంత్ కిషోర్ కిషన్ దాదా, మనీష్, బుద్ధ పేర్లతో కూడా గుర్తింపు పొందారు.