Publish Date:Aug 18, 2025
మనం చేసింది ఒకరు కాపీ కొడుతున్నారంటే అది సూపర్ హిట్ అయినట్టు లెక్క. ఇది తరచూగా కొందరు స్ట్రాటజిస్టులు చెప్పే మాట. లోకేష్ రెడ్ బుక్ విషయం కూడా సరిగ్గా ఇలాంటిదేనని చెప్పాలంటారు వీరు.
మొన్న కవిత తాము పింక్ బుక్ రాస్తున్నామని కామెంట్ చేయడంతోనే ఈ రెడ్ బుక్ బొమ్మ హిట్ అయినట్టు చెప్పాలంటారు కొందరు టీడీపీ లీడర్లు. తాజాగా కేటీఆర్ సైతం ఈ తరహా కామెంట్లు చేశారు. మనకు వ్యతిరేకంగా పని చేసే వారందరి.. పేర్లు ఊర్లు రాసిపెట్టాలని.. అధికారంలోకి వచ్చినంక.. అందరి పని చెబుతామని అంటున్నారాయన.
దీనంతటిని బట్టీ చూస్తే ఆనాడు నెగిటివ్ గా కనిపించిన రెడ్ బుక్ ప్రస్తుతం పవర్ఫుల్ గా మారినట్టు తెలుస్తోందని అంటున్నారు. ఎక్కడో పక్క రాష్ట్రంలో కూడా దీని ప్రభావం పాకినట్టు, ఆయా నేతలకు సోకినట్టు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల జగన్ కూడా ఒక యాప్ తెచ్చి అందులో అన్ని వివరాలను పొందు పరచమన్నారు. అయితే ఇది రెడ్ బుక్ కి- యాప్ వర్షన్ అన్న కామెంట్ వినిపించింది. రెబ్ బుక్ కి గుడ్ బుక్ తెస్తామని తొలినాళ్లలో బీరాలు పలికిన జగన్ ఆ తర్వాత అదే తరహాలో యాప్ తెస్తామని అన్నపుడే.. ఈ రెడ్ బుక్ ఎంత పెద్ద హిట్టో తెలుసుకోవచ్చంటున్నారు.
బేసిగ్గా జగన్.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్నీ తమ పథకాలే కాపీ కొడుతున్నట్టు ప్రచారం చేస్తుంటారు. ఆ మాటకొస్తే ఇక్కడ లోకేష్ అధికారంలోకి రావడానికే ఒక ఫార్ములా కనిపెడితే.. దాన్నిప్పుడు మీరంతా కలసి కాపీ కొట్టడాన్ని ఏమనాలి బులుగూస్! అన్న కౌంటర్ కామెంట్ వినిపిస్తోంది.
స్టాన్ ఫర్డ్ లో చదివిన లోకేష్ కి ఈ కార్యకర్తలకు జీతాలు, డైరెక్ట్ క్యాష్ బెనిఫెట్ స్కీములు ఏమంత కొత్త కాదు. ఆయనకు ఇవన్నీ కొట్టిన పిండి. అయితే అవి బాబు దగ్గరకు వెళ్లేసరికల్లా.. రూపం మార్చుకుని కనిపిస్తాయి. ఒక్క రెడ్ బుక్ మాత్రమే ఒరిజినల్ గా అలా బయటకొచ్చేసి సూపర్ డూపర్ బంపర్ హిట్ కొడుతోంది. ఇటు ప్రత్యర్ధి పార్టీ వైసీపీయే కాకుండా.. ఎక్కడో ఉన్న బీఆర్ఎస్ సైతం అచ్చు దింపేస్తుందంటే అర్ధం చేసుకోవచ్చని కాలర్ ఎగరేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm-chandrababu-25-204461.html
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!