Publish Date:Jul 15, 2025
తిరుమల దేవుడి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ కేసులో సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూ కల్తి వ్యవహారంలో వాస్తవాలను వెలికి తీయడం లక్ష్యంగా సుప్రీం కోర్టు గత ఏడాది అక్టోబర్ లో స్వతంత్ర సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి విదితమే.
Publish Date:Jul 15, 2025
తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సొంత ఇంట్లో అడుగుపెట్టే భాగ్యం ఇప్పట్లో లేనట్లు కనిపిస్తోంది. ఆయన ఎప్పుడు తాడిపత్రి బయలుదేరినా ఏదో ఒక అవాంతరం ఎదురవుతోంది.
Publish Date:Jul 15, 2025
బనకచర్ల ప్రాజెక్టు పై చర్చించడానికి తెలంగాణ ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. ఏపీ ప్రతిపాదన మేరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం బుధవారం జరగ నుంది. ఈ సమావేశంలో బనకచర్లపై విస్తృతంగా చర్చించాలన్నది ఏపీ ప్రతిపాదన.
Publish Date:Jul 15, 2025
హైదరాబాద్ డ్రగ్స్ దందాలో ఎస్ఐబీ అధికారి కుమారుడి పాత్రను ఈగిల్ అధికారులు గుర్తించారు. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య అమ్మినేని అరెస్టు తర్వాత పోలీసులు ఆ నెట్ వర్క్ పై దర్యాప్తు చేస్తున్న సందర్భంగా ఎస్ఐబీ అధికారి కుమారుడి పాత్ర తెరపైకి వచ్చింది.
Publish Date:Jul 15, 2025
మావోయిస్టు ముక్త భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టినఆపరేషన్ కగార్ సత్ఫలితాలనే ఇస్తోందని అంటున్నాయి భద్రతా బలగాలు. ఆపరేషన్ కగార్ కారణంగా పలువురు మావోయిస్టులు పలు ఎన్ కౌంటర్లలో హతమయ్యారు.
Publish Date:Jul 15, 2025
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం (జులై 15) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.
Publish Date:Jul 15, 2025
అమెరికాలోని ఓ వృద్ధాశ్రమంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో తొమ్మది మంది మరణించారు. ఈ దుర్ఘటన అమెరికాలోని మసాచుసెట్ లోని ఫాల్ రివర్ గాబ్రియేల్ హౌస్ వృద్ధాశ్రమంలో జరిగింది.
Publish Date:Jul 15, 2025
హైదరాబాద్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. మలక్ పేట శాలివాహన్ నగర్ పార్క్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించారు. మృతుడిని చందూ రాథోడ్ గా గుర్తించారు.
Publish Date:Jul 14, 2025
తెలంగాణ వ్యాప్తంగా ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ, వర్షాలు మాత్రం ఆశించిన విధంగా కురవలేదు.
Publish Date:Jul 14, 2025
తెలుగుదేశం సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Publish Date:Jul 14, 2025
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన మద్రాసు హైకోర్టు జడ్జిగా ఉన్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు.
Publish Date:Jul 14, 2025
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే, రాజకీయ నియామకాలపై దృష్టిని కేంద్రీకరించారు. అందులో భాగంగా, నిన్న (ఆదివారం) వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన నలుగురు ప్రముఖులను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు.
Publish Date:Jul 14, 2025
లోకేష్ కి పథకాలు తయారు చేయడం రాదా? మరి స్టాన్ ఫర్డ్ లో ఏం నేర్చుకున్నట్టు? అమ్మకు వందనం విషయంలో వైసీపీ చేస్తున్న ప్రచారంలో అర్ధమేంటని చూస్తే.. ఫస్ట్ మనమంతా తెలుసుకోవల్సిన విషయమేంటంటే.. వాలంటీర్ వ్యవస్థ, డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ స్కీముల ఆలోచనలు లోకేష్ వే అని ఎందరికి తెలుసు?