జగన్‌కు సవాల్ విసిరిన బీటెక్ రవి
Publish Date:Aug 20, 2025
Advertisement
జగన్ మోహన్ రెడ్డి గత ఐదేళ్ల పాలనలో చేసిన అరాచకాలు చూసే పులివెందుల ప్రజలు జగన్‌ను చీ కొట్టారని, అని,అసెంబ్లీకి వెళ్ళని నీవు కూడా రాజీనామా చేయి నా భార్యతో జడ్పీటీసీకి రాజీనామా చేయిస్తా రెండు ఉపఎన్నికలు కేంద్ర బలగాల మధ్య నిర్వహిద్దాం ఎవరికి బలం ఉందో తేల్చుకుందాం. అని, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, పులివెందుల నియోజక వర్గ టీడీపీ ఇన్చార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి జగన్‌కి సవాల్ విసిరారు. బుధవారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీటెక్ రవి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వివేకా హత్య కేసును కోల్డ్ స్టోరేజ్ లో వేశారని అనుకుంటున్నారని, నిందితులు బెయిల్ పై బయట తిరుగుతూ సాక్షులను ప్రభావితం చేస్తూ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని,జగన్ చెల్లెలు సునీతా రెడ్డి న్యాయ పోరాటం చేస్తోందని దీనితో కేసు పురోగతి దిశగా సాగుతోందన్నారు. అధికార బలముతో నాడు వైఎస్ జగన్ చెల్లీ సునీతపై బావ రాజశేఖర్ రెడ్డిపై , సీబీఐ అధికారి రాంసింగ్ పైన కృష్ణారెడ్డి అనే వ్యక్తితో ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసును పెట్టించిన కేసులగా భావించి సుప్రీం కోర్టు క్వాష్ చేయడం జరిగిందని అని బీటెక్ రవి అన్నారు. సాక్షాలు తుడిపేసి కేసును తప్పు దోవ పట్టించడం వలనే విచారణ ఆలస్యం అవుతుందన్నారు. సీబీఐ కి గడువు ఇవ్వడం వలనే పూర్తి అయినట్టు నివేదిక ఇవ్వడం జరిగిందని దీని వెనుక పెద్ద కుట్ర దాగివుందన్నారు. బెయిల్ పై ఉన్న వారిని కస్టోడియన్ విచారణ చేస్తేనే పలితం వస్తుందని సీబీఐ తరుపున లాయర్లు కోర్టుకి తెలిపారన్నారు .ఈ కేసును కూలంకుషంగా పరిశీలిస్తే కథ అంతా మాస్టర్ మైండ్ అవినాష్ రెడ్డి కారణమని కావున మరింత గడువు ఇచ్చి బెయిల్ రద్దుచేసి కస్టోడియన్ విచారణకు అనుమతి ఇవ్వాలని కోరారనీ దీన్ని బట్టి వివేక హత్య ఎవరు చేసారో ఎవరు నిందితులో అర్థమవుతోందన్నారు. త్వరలో నిజా నిజాలు బయటకు వస్తాయన్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంల పైన, పులివెందులలో జడ్పిటిసి ఓడిపోతే రిగ్గింగ్ అంటూ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారని, నాడు కుప్పంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని టిడిపిని ఓడిస్తే ఏ విధంగా చేసినా గెలుపు గెలుపే అని నాడు చెప్పాడని అన్నారు .మరి నేడు ఆ మాటలకు మీరు ఏమి చెప్పగలరని ప్రశ్నించారు. పులివెందుల లో ఎన్నికలు రెడీనా! నా భార్య చేత జెడ్పిటిసి కి రాజీనామా చేయిస్తానని అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజా సమస్యలు తీర్చకుండా ఉన్న నీవు కూడా రాజీనామా చేయాలని రెండు ఉప ఎన్నికలను కేంద్ర బలగాల మధ్యనే నిర్వహిద్దాం ఎవరు బలం ఏమిటో తెలుస్తుందని అన్నారు. పులివెందులలో జగన్ అరాచకాలను చూసి ప్రజలు తాలలేక టిడిపి వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ ల పర్యవేక్షణలో ఒక ప్రణాళిక బద్ధంగా మున్సిపాలిటీని టిడిపి కైవసం చేసుకుంటుంద న్నారు.
http://www.teluguone.com/news/content/cm-chandrababu-25-204670.html





