చంద్రబాబు నేలవిడిచి సాము : మాజీమంత్రి డిఎల్
Publish Date:Aug 20, 2025
Advertisement
సీఎం చంద్రబాబు పి 4 పిచ్చిలో వున్నట్లు వున్నట్లు అనిపిస్తోందని, నేల విడిచి సాము చేస్తున్నట్లు వుందని మాజీమంత్రి డి.ఎల్ రవీంద్రారెడ్డి విమర్శించారు. కాజీపేటలోని తన నివాసంలో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎవరిని కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలను నోరు విప్పకపోతే తప్పు చేసిన వారము అవుతామన్నా ఉద్దేశ్యంతో చెప్పాల్సి వస్తోందన్నారు. టీడీపీ నాయకులు జగన్ పాలనలో అభివృద్ధి లేదు అన్నారు, మా ప్రభుత్వంలో అభివృద్ధికి రూ.1000 కోట్లు నిధులు ఇచ్చామని చెబుతున్నారన్నారు. అభివృద్ధి ఏం జరిగిందనేది నా ఇంటి ముందు ఉండే రోడ్డును, మైదుకూరు సర్వయపల్లి రోడ్డు చూస్తే అర్థమవుతుందన్నారు. నా ఇంటి వద్దే ఇలా ఉంటే నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంటుందని నేను అనుకుంటానన్నారు. నా దృష్టిలో గత పాలకుల పాలనకు నేటి పాలకుల పాలనకు తేడా ఏమి లేదన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఒక్క రూపాయి లంచం లేకుండా పనిచేయడం అన్నారు. అది అమలుకు నోచుకోనప్పుడు దానివల్ల ప్రయోజనం ఉండదన్నారు. చంద్రబాబుకు పేరు రావాలని పోలవరం నుంచి బనకచర్ల ప్రాజెక్ట్ చేపట్టారున్నారు. చంద్రబాబు రాజోలు నుండి నీరు ఇస్తానని రూ.3000 కోట్ల విలువ చేసే హామీలు ఇచ్చారన్నారు. రాజోలుకి ఇచ్చే రూ.1000 కోట్లు లేనప్పుడు 80 వేల కోట్ల బనకచర్ల ఎలా పూర్తి చేస్తారని డి.ఎల్ ప్రశ్నించారు. ప్రజలకు అవసరమైన పనులు ఏమీ జరగడం లేదన్నారు. అలగనూరు ప్రాజెక్టు గురించి ఒప్పుకుంటాము కానీ ముందు రాజోలి గురించి ఎందుకు ఆలోచించలేదన్నారు. పోలవరం బనకచర్ల మరో కాళేశ్వరం అవుతుందన్నారు. రిజర్వాయర్లలో నీళ్లు పెడితే సరిపోదు ఆయకట్టు అభివృద్ధి చెందాలన్నారు. రిజర్వాయర్లు నిండితే మీ ప్రాంతంలో చెరువులకు నీటిని నింపుతామని జీవో ఇవ్వాలన్నారు. పారాసెటమాల్ కరువే. నాకు తెలిసిన ఒక వ్యక్తి తాసిల్దార్ ఆఫీస్ కు ఓ పని కోసం వెళ్తే లక్ష యాభై వేల రూపాయలు లంచం అడిగితే అడ్వాన్స్ గా కొంత ఇచ్చాన్నారు. రియల్ టైం గవర్నెన్స్ అంటే ఇంటి దగ్గర బల్బు పోతే అది పోయిందని చెప్పడం అని ఒక ఐఏఎస్ అధికారి అంటున్నారన్నారు. గిరిజన ప్రాంతాల్లో పారాసిటమల్ మాత్ర లేక చనిపోయిన పరిస్థితి వుందన్నారు. పారాసిటమాల్ మాత్ర ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఓ వార్తా పత్రిక చెప్పకనే చెపుతోందన్నారు. ఈ విషయం పై ప్రభుత్వానికి లేఖ రాశాను, మెయిల్ చేశా స్పందన లేదని డి.ఎల్ పేర్కొన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి గిరిజన ప్రాంతాల్లో తొంగి చూసిన పరిస్థితి కూడా లేదన్నారు. ఒక్క కొత్త పించన్ అయినా ఇచ్చారా! ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క కొత్త పెన్షన్ కూడ మంజూరు చేయలేదన్నారు. ప్రభుత్వం కనీస పథకాలను అమలు చేయాలని డి.ఎల్ డిమాండ్ చేశారు. 44 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యపై ధర్నా చేద్దామనుకున్నానన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఒక ఊరిలో పెన్షన్ ఇవ్వడానికి వచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారన్నారు. నాడు జగన్ కూడా అదే చేశారన్నారు. గ్రీవెన్స్ సెల్ లో ఒక్క సమస్య కూడా పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. అసలైన వికలాంగుల పెన్షన్లు తీసేసి అనర్హుల పెన్షన్లు కొనసాగిస్తున్నారని విమర్శించారు. పెన్షన్లు కొనసాగించేందుకు బ్రోకర్లు కూడా ఉన్నారున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలది తప్పా. . ప్రభుత్వానిది తప్పా. ఓట్లు వేసిన ప్రజలది తప్పా ఆలోచించుకోవాలని కోరారు. ఓట్లు వేసిన పాపానికి ప్రజలు రోజు ఎందుకు ఏడవాలని ఆయన ప్రశ్నించారు. అధికారపార్టీ లో వైసీపీ నేతలు చెలామణి వైసిపి లో చలామణి అయిన నేతలు నేడు అధికార పార్టీలో చేర్చుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. ఎమ్మెల్యే అందుబాటులో లేనప్పుడు ఫ్యాక్స్ మిషన్ పెట్టి ఫిర్యాదులను పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదుని,మంచి పనులు చేస్తేనే ఆరుసార్లు ఎమ్మెల్యే అయ్యానని డి.ఎల్ పేర్కొన్నారు.
అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది, నిధులు ఎక్కడికి పోతున్నాయి, పేరుకే చెబుతున్నరా అన్నది తెలియాల్సి వుందన్నారు. ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరము నాలుగు నెలలు అవుతున్న ఒక్క ఇంటి నిర్మాణం చేపట్టిన దాఖలాలు లేవని విమర్శించారు. అధికారులను అడిగితే వచ్చే మార్చినాటికీ మంజూరవుతాయని చెబుతున్నారని ప్రజలు అంటున్నారన్నారు.. చేనేత కార్మికులు మగ్గాల ద్వారా వస్త్రాలు నేసి ఆప్కో కు ఇచ్చే పనిచేయడం లేదన్నారు. క్వాంటమ్ వ్యాలీ ,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ,వాట్సప్ గవర్నెన్స్ లను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.
http://www.teluguone.com/news/content/cm-chandrababu-25-204672.html





