పేదరిక నిర్మూలన ఎన్టీఆర్ సిద్దాంతం : సీఎం చంద్రబాబు
Publish Date:Aug 19, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలన కోసం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పీ4 అమలు కార్యక్రమాన్ని మంగళగిరిలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు పేదరిక నిర్మూలన అనేది సీనియర్ ఎన్టీఆర్ సిద్దాంతమని ఆయన పాలన సమయంలో వెలుగు కార్యక్రమం తీసుకొచ్చినట్టు తెలిపారు. దీని ముఖ్య ఉద్దేశం పేదరిక నిర్మూలన అని ఆర్థిక సంస్కరణ వల్ల సంపద సృష్టించడం చాలా సులభమైనట్టు తెలిపారు. ఉగాది రోజు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ప్రభుత్వం బంగారు కుటుంబాలు, మార్గదర్శుల ఎంపిక ప్రక్రియ చేపట్టింది. పీ-4లో దాదాపు 13 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించింది. మార్గదర్శలుగా 1.40 లక్షల మంది పారిశ్రామిక వేత్తలు, ప్రవాసాంధ్రులు ముందుకొచ్చారు. పీ4 ద్వారా హెచ్‌సీఎల్ కంపెనీలో ఉద్యోగం కల్పించడంతో భావోద్వేగానికి గురైన కృష్ణా జిల్లా వాసి పావని కంటతడిపెట్టుకున్నారు. డొక్కా సీతమ్మ అంటే పేదల పెన్నిధి. అన్నదాతగా ఇప్పటికీ ప్రజల్లో గుర్తుండిపోయారు. మంచి కార్యక్రమం చేస్తే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక కార్యక్రమాలు చేశాను. జన్మభూమి, ప్రజల వద్దకు పాలన, శ్రమదానం వంటి కార్యక్రమాలు చేశామన్నారు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు సౌదీ అరేబియాకు చెందిన పలువురు తెలుగువాళ్లు ముందుకొచ్చారు. కుప్పం నియోజకవర్గానికి చెందిన 250 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దత్తతకు సంకేతంగా అడాప్ట్ ట్రీని బంగారు కుటుంబాలకు ఆయన అందజేశారు.మంచి కార్యక్రమాలు చేస్తే చరిత్ర గుర్తు పెట్టుకుంటుందని సీఎం తెలిపారు.
http://www.teluguone.com/news/content/cm-chandrababu-25-204550.html





