Publish Date:Apr 20, 2025
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదినం సందర్బంగా ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షల తెలియజేశారు. భవిష్యత్ రంగాలపై దృష్టి సారించి, ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు కృషి.. చేస్తున్న తీరును ప్రశంసనీయమని ప్రధాని అన్నారు. ఏపీ అభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేస్తున్న చంద్రబాబు పనితీరు ప్రశంసనీయం. ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా’’ అని మోదీ తెలిపారు. ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సామాజిక మాధ్యమాల వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు. దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని, మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని, ప్రజాసేవలో సుదీర్ఘ కాలం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి ట్వట్టీర్ వేదికగా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేశారు. అనితర సాధ్యుడు చంద్రబాబు నాయుడు అంటూ వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థికంగా కుంగిపోయి, అభివృద్ధి అగమ్యగోచరంగా తయారై, శాంతిభద్రతలు క్షీణించిపోయిన రాష్ట్ర ప్రగతిని పునర్జీవింపచేయడం నారా చంద్రబాబు నాయుడు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యమని అన్నారు. అటువంటి పాలనాదక్షునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలని మరోసారి తెలిపారు. దార్శనికత, కృషి, పట్టుదల, అంకితభావం ఉన్న అరుదైన నాయకుడు మీరు అంటూ చంద్రబాబును మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. ఆ భగవంతుడు చంద్రబాబుకు ఆయురారోగ్యాలతో పాటు ప్రజల కోసం కనే కలలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. "హ్యాపీ బర్త్ డే నారా చంద్రబాబు నాయుడు గారూ! మీరు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నాను!" అని జగన్ ట్వీట్ చేశారు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సీబీఎన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అటు కేంద్రమంత్రులు, మంత్రులు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm-chandrababu-25-196585.html
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.