Publish Date:May 25, 2025
రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ నుంచి తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు ఆర్జేడీ పార్టీ అధ్యక్షుడు, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. అదేవిధంగా ఫ్యామిలీ నుంచి కూడా అతడిని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.
Publish Date:May 25, 2025
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కలిశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ దాని పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం నోటీసులతో పాటు తాజా పరిస్థితులపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
Publish Date:May 25, 2025
రాష్ట్ర నీటి అవసరాలు కాపాడటంలో ఈ ప్రభుత్వం విఫలమైంది.. గోదావరి – బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు
Publish Date:May 25, 2025
కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు పుష్కర పుణ్య స్నానం ఆచరించారు. గవర్నర్ దంపతులకు మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ సతీసమేతంగా ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు
Publish Date:May 25, 2025
మిస్ ఇంగ్లండ్ మ్యాగీ వ్యవహార శైలి కాస్త అనుమానాస్పదంగానే ఉందంటున్నారు. బేసిగ్గా స్విమ్మర్ అయిన మ్యాగీ తన తల్లి నుంచి, స్విమ్మింగ్ నుంచి ఏమి నేర్చుకుందోగానీ కొన్నికొన్ని విషయాల్లో ఆమెను తీవ్రంగా అనుమానించాల్సి వస్తోందని అంటారు కొందరు.
Publish Date:May 25, 2025
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో చాలా విషయాలపై సిట్ ఇంకా పూర్తిగా దృష్టిసారించలేదని ఆయన పేర్కొన్నారు. సిట్ పిలిస్తే తాను వెళ్లి మద్యం కుంభకోణంలో బయటకు రాని విషయాలు వెల్లడిస్తాని ఆయన అన్నారు.
Publish Date:May 25, 2025
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో విజయ్ కుమార్ అనే కానిస్టేబుల్ మృతిచెందారు. మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.
Publish Date:May 25, 2025
ప్రముఖ రంగస్థల కళాకారుడు, బలగం సినిమా నటుడు జీవీ బాబు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మరణించారు.
Publish Date:May 25, 2025
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో సొంత ఇళ్లు నిర్మించుకుని గృహప్రవేశం చేశారు. శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం గ్రామ పరిధిలో రెండు ఎకరాల స్థలంలో చంద్రబాబు కొత్తగా ఇల్లు నిర్మించుకున్న సంగతి విదితమే.
Publish Date:May 24, 2025
వైసీపీ అధినేత జగన్ ఇలాకా కడపలో తొలిసారి నిర్వహిస్తున్న మహానాడుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచీ పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు తరలిరానున్నాయి. అయితే వైసీపీ మాత్రం మహానాడుపై కుట్రల పర్వానికి తెరతీసింది.
Publish Date:May 24, 2025
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవలకు తోడు వారాంతం కూడా కావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమల భక్త జన సంద్రంగా మారింది.
Publish Date:May 24, 2025
ఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర ఇచ్చిన ప్రెజంటేషన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సీఎం ప్రజెంటేషన్‌లో వివిధ అంశాలు వికసిత్ భారత్‌కు ఉపయోగపడేలా ఉన్నాయని ప్రధాని మోడీ సైతం అభినందించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భేటీ అయ్యారు.
Publish Date:May 24, 2025
హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల నుంచి బ్రిటన్‌కు చెందిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ అనూహ్యంగా వైదొలగింది. తొలుత తాను వ్యక్తిగత కారణాలతో వైదొలగుతున్నానని చెప్పిన మాగీ.. ఆ తరువాత మాత్రం సంచలన ఆరోపణలు చేశారు.