మీ కారు కాన్వాయ్ ఇంత చీకాకు పెడితే ఎలా సారూ!

Publish Date:Aug 30, 2022

Advertisement

ప్రభుత్వాధినేత ఎవరైనా సరే ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన జీవనం అందించేందుకు పాటుపడాలి. గత పాలకులకంటే తన పాలన మెరుగ్గా ఉందని నిరూపించుకోవడానికి పని చేయాలి. అలా కాకుండా స్వయంగా ఆయన వల్లనే జనం తీవ్రమైన ఇబ్బందులు పడేలా వ్యవహరిస్తే ఎలా? తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి ప్రజలు ముఖ్యంగా హైదరాబాదీయులు సరిగ్గా ఇదే అనుకుంటున్నారు. 

ఆయన ప్రగతి భవన్ నుంచి తన  ఫాం హౌస్ కు తరచూ చేసే ప్రయాణాలు హైదరాబాదీయులకు నరకాన్ని చూపిస్తున్నాయి. ప్రగతి భవన్ నుంచి రాజీవ్ రహదారి మీదుగా ఆయన చాలా తరచుగా చేస్తున్నపర్యటనల పట్ల జనం చీకాకుపడుతున్నారు. ఆయన తిరగడానికి మేం ట్రాఫిక్ లో చిక్కుకుని యాతన పడాలా అని ప్రశ్నిస్తున్నారు. పైగా ఆయన ఈ ప్రయాణం హైదరాబాద్ లో అత్యంత రద్దీగా ఉండే సమయాలలోనే సాగుతుంది. ఉదయం విద్యార్థులు పాఠశాలలకూ, ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లే సమయంలోనూ.. అలాగే సాయంత్రం తిరిగి వారు ఇళ్లకు చేరే సమయంలోనూ కేసీఆర్ కాన్వాయ్ కోసం పోలీసులు ట్రాఫిక్ ను ఆపేస్తుంటారు. ప్రగతి భవన్ నుంచి బేగంపేట, ప్యాట్నీ సెంటర్, జూబ్లీ బస్టాండ్, తిరుమలగిరి చౌరస్తా, అల్వాల్ మీదుగా సాగే ఆయన పయనం.. ఆ దారిలో వెళ్లే వారికి నరకం చూపిస్తోంది.

ఈ పరిస్థితి వారంలో కనీసంలో కనీసం రెండు సార్లు ఉంటుంది. అంటే వారంలో రెండు సార్లు ఉదయం, సాయంత్రం జనం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తా ట్రాఫిక్ లో ఇరుక్కుని చిక్కులు పడాల్సిందే. అంబులెన్సులు సైతం నిలిచిపోయినా పోలీసులు పట్టించుకోవడం లేదు. ట్రాఫిక్ ను ఆపడానికి పెద్ద సంఖ్యలో రోడ్డుకు ఇరు వైపులా కనిపించే పోలీసులు సీఎం కాన్వాయ్ వెళ్లిపోగానే మాత్రం కనిపించరు. దీంతో కాన్వాయ్ వెళ్ళిన తరువాత అప్పటి వరకూ నిలిచిపోయిన వాహనాలు ఒకే సారి అన్ని వైపుల నుంచీ కదలడంతో ఆ ట్రాఫిక్ క్లియర్ కావడానికి మరో గంట, వెరసీ కనీసం రెండు గంటల పాటు సీఎం కాన్వాయ్ వల్ల ట్రాఫిక్ చిక్కులు ఎదురౌతున్నాయి.

గతంలో ఏ సీఎం వల్లా ఇలా ట్రిఫిక్ ఇబ్బందులు ఎదురైన దాఖలాలు లేవు. ఎప్పుడో ఒక సారి ఏదో అత్యవసర పని మీద భారీ కాన్వాయ్ తో సీఎం కదిలారంటే అర్థం చేసుకోవచ్చు కానీ ఇలా తరచూ క్యాంపుకార్యాలయానికీ, ఫాంహౌస్ కు తిరగడానికి గంటల తరబడి ట్రాఫిక్ నిలిపివేయడం ఎంత వరకూ సమంజసమని జనం విసుక్కుంటున్న పరిస్థితి ఆయన కాన్వాయ్ వెళుతున్న ప్రతి సందర్భంలోనూ కనిపిస్తోంది.   దేశానికే ఆదర్శవంతమైన అభివృద్ధి సాధించామని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్  జనానికి ట్రాఫిక్ చుక్కలు చూపించే విషయంలో మాత్రం ఎవరికీ ఆమోదయోగ్యం కాని విధానాన్ని అవలంబిస్తున్నారు

By
en-us Political News

  
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో యూనిట్ ఇంఛార్జ్‌లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న  స్థానిక  ఎన్నికల్లో  బీజేపీకి  ఏ పార్టీతోనూ  పొత్తులు పెట్టుకునే ఆలోచన  లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.