క్లారిటీ లేని పొత్తులా? ప్రత్యర్థులని ముప్పుతిప్పలు పెట్టడమా?

Publish Date:Jun 20, 2023

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ది క్లారిటీ లేని రాజకీయమా?, క్లారిటీ లేకనే ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతుంటారా?, ఆ క్లారిటీ లేకనే మొన్నటి వరకు సీఎం అయ్యేందుకు రాజకీయాల్లోకి రాలేదని.. ఇప్పుడు తానే సీఎం అభ్యర్థిని అనేలా మాట్లాడుతున్నారా? అంటే ఆయన రాజకీయ ప్రత్యర్ధులు అవుననే అంటారు. మరి నిజంగానే ఆయన క్లారిటీ లేకనే ఇప్పుడు తానే సీఎం అభ్యర్థిని అనేలా మాట్లాడుతున్నారా?  అంటే ముమ్మాటికీ కాదని చెప్పాలి.  ఇంకా చెప్పాలంటే పవన్ ఇప్పుడు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు మొదలు పెట్టారు. అందుకు తగ్గట్లే ఒక్కోసారి ఒక్కోలా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. ఇది అర్ధం చేసుకోవాలంటే కాస్త లోతుగా వెళ్లి విశ్లేషణ చేసుకోవాలి.

పవన్ జనసేన పార్టీ పెట్టిన తొలిసారి ఎన్నికలలో ఆయన పోటీ చేయనే లేదు. టీడీపీ-బీజేపీ కూటమికి సహకరించి వారి విజయానికి అంతో ఇంతో సహకరించారు. అయితే ఆ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో గత 2019 ఎన్నికలలో ఆయన సింగిల్ గా పోటీ చేసి పరాజయం పాలయ్యాడు. ఓటమి మాత్రమే కాదు.. రాజకీయంగా ఆయన లెక్కలు కూడా తప్పేనని ఈ ఎన్నికలలో తెలిసొచ్చింది. దీంతో దీర్ఘకాలిక రాజకీయాల మీద ఫోకస్ పెట్టిన పవన్ జాతీయస్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తుకి సిద్దమై.. 1+1=2 ఫార్ములాతో బలం పెంచుకున్నారు. ఇక ఎన్నికలకు రెండేళ్ల ముందు నుండే ఈ సారి తప్పు చేయబోనని, వైసీపీకి అధికార దక్కనివ్వమని, అందుకోసం తాను ఒక మెట్టు దిగేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. ఇప్పటికీ అదే మాట చెప్తున్నారు.

అయితే, ప్రస్తుతం తన వారాహీ వాహనంతో పర్యటన సాగిస్తున్న పవన్  కాకినాడలో మాట్లాడుతూ.. మీరు ఆశీర్వదిస్తే సీఎం అవుతానని.. మీరు కోరుకుంటే తానే సీఎం అభ్యర్థిని అవుతా అంటూ మాట్లాడారు. దీంతో మెయిన్ స్ట్రీమ్ మీడియా నుండి సోషల్ మీడియా వరకూ ఎవరికి వారు పొత్తుపై పవన్ పునరాలోచన చేస్తున్నారని, పొత్తు వ్యవహారం చెడిందని  విశ్లేషణలు మొదలు పెట్టారు. కానీ, ఇక్కడ అర్ధం చేసుకోవాల్సింది.. పవన్ మాటలకు అర్ధాలే వేరులే అని. ఆ అర్ధం ఏంటో కాదు.. టీడీపీతో  కలిసి నడిచేది గ్యారంటీ అని ఎప్పుడో విడమర్చి చెప్పేశారు. కానీ, లెక్కలు.. సీట్లు.. పదవుల బేరం ఇంకా ఏదీ తేలలేదు. అవి తేల్చాల్సిన సమయం దగ్గర పడుతుంది. అందుకే పవన్ మార్క్ స్ట్రాటజీగా దీన్ని చూడాలి.

ఎవరు ఎన్ని అనుకున్నా.. రాజకీయం రాజకీయమే కదా. ఎంత పొత్తు అయినా.. నాలుగు సీట్లు ఎక్కువగా దక్కించుకోవాలనుకోవడం రాజకీయ పార్టీ ధర్మం. అదే ఇప్పుడు పవన్ చేస్తున్నది. దీనికి తోడు జనసైనికులు పవన్ కళ్యాణ్ ను ఎప్పుడూ రాజకీయ నేతగా చూడరు. వెండితెర మీద ఆయన్ని హీరోగా చూసిన అభిమానులు రాజకీయాలలో కూడా ఆయన్ను హీరోగా (సీఎం) చూడాలని ఆశపడుతుంటారు. ఒక్కో సందర్భంలో అభిమానుల నినాదాలు శృతి మించిన సమయంలో పవన్ కూడా తనకి కూడా సీఎం కావాలనే ఉందంటూ అభిమానులను ఉత్సాహపరుస్తుంటారు. అలా తానే సీఎం అనే టాక్ ఎంత పబ్లిక్ లోకి వెళ్తే రేపు పొత్తులలో జనసేనకి అంత డిమాండ్ పెరుగుతుంది. ఆ కారణంగానే పవన్ ఇప్పుడు సీఎం నినాదాన్ని ఎత్తుకున్నట్లు అర్ధం చేసుకోవచ్చు.

పైగా, ఈ మధ్య కాలంలో అధికార వైసీపీ టీడీపీ, జనసేనలను కలిపే మాట్లాడుతోంది. పవన్ కళ్యాణ్ మీద ఒంటి కాలిపై విమర్శలకు దిగుతున్న వైసీపీ నేతలు, టీడీపీని గెలిపించేందుకు మాత్రమే  పవన్ రాజకీయం పరిమితమైందని విమర్శలు  చేస్తున్నారు. ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది కనుక ఈలోగా ఇలా తానే సీఎం అనే  మాట ద్వారా ప్రత్యర్థుల విమర్శలకు బ్రేక్ వేసినట్లౌతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుకే పవన్ అప్పుడప్పుడూ ఇలా ప్రత్యర్థులకు నోటి నిండా మాట్లాడుకోవడానికి స్టఫ్ ఇస్తుంటారు. దాన్నే నమ్ముకొని ప్రత్యర్ధులు పండగ చేసుకుంటుంటారు. కానీ, నిజానికి పవన్ టార్గెట్ 2029 మాత్రమే. ఇప్పటికే వేలసార్లు ఈ మాట చెప్పినా.. అప్పుడప్పుడు ఇలా చిన్నా చితకా ప్రచారాలకు విపక్షాలు పండగ చేసుకోవడమే ఆసక్తి  కలిగించే అంశం.

By
en-us Political News

  
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.