జగన్ బ్యాచ్ ఐఏఎస్, ఐపీఎస్ ల ప్రక్షాళన షురూ!

Publish Date:Jun 22, 2024

Advertisement

జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనా కాలంలో వైసీపీ కార్యకర్తల స్థాయికి దిగజారి పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్ ల ప్రక్షాళనకు  చంద్రబాబు సర్కార్  శ్రీకారం చుట్టింది.  జగన్ బ్యాచ్ ఐపీఎస్ అధికారులు ముగ్గురి వై బదిలీ వేటు వేసిన చంద్రబాబు సర్కార్ రానున్న రోజులలో  మరింత మందిపై చర్యలకు సమాయత్తమౌతోంది.  

మాజీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్‌రెడ్డిని ప్రింటింగ్ స్టేషనరీ కమిషనర్‌గా బదిలీ  చేయడంతో పాటు ఫైర్ సర్వీసు డీజీగా ఉన్న సునీల్‌కు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా  జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. సునీల్ స్థానంలో  శంకబ్రత బగ్చీ నియమితులయ్యారు. ఎస్పీ రిషాంత్‌రెడ్డిని ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ నుంచి రిలీవ్ చేస్తూ, డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాల ఆదేశాలు జారీ అయ్యాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జగన్ బ్యాచ్ అధికారులపై చర్యలకు శ్రీకారం చుట్టారు. జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనా కాలంలో  ఆయన దన్ను చూసుకుని ఇష్టారీతిగా వ్యవహరించిన ఐపిఎస్, ఐఏఎస్‌లకు ఇక శంకరిగిరి మాన్యాలు తప్పవన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా జగన్ బ్యాచ్ అధకారుల కారణంగా నానా వేధింపులకు గురైన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ప్రజలలో హర్షం వ్యక్తం అవుతోంది. జగన్ హయాంలో ఇష్టారీతిగా వ్యవహరించిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని అత్యంత అప్రాధాన్యతా పోస్టు అయిన ప్రింటింగ్ అండ్ స్టేషనరీకి పంపించారు. కసిరెడ్డి డీజీపీగా ఉన్న సమయంలో జగన్ విషయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శించారన్న విమర్శలు ఉన్నాయి. వివిధ సమస్యలపై ఫిర్యాదులు, వినతి పత్రాలు ఇచ్చేందుకు తన వద్దకు వచ్చిన తెలుగుదేశం నేతలకు ఆయన కనీసం అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వని సందర్భాలున్నాయి.  అదే సమయంలో  వైసీపీ నేతలకు మాత్రం రాచమర్యాదలతో స్వాగతాలు లభించేవి. స్వయంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఫోన్ చేసినా కూడా కసిరెడ్డి స్పందించని సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి రాజేంద్రనాధ్‌రెడ్డిని అత్యంత అప్రాధాన్య శాఖకు బదిలీ చేయడం పట్ల పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరైతే అసలు ఆయనకు ఆ మాత్రం పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ఉండాల్సిందని అంటున్నారు.  

ఇక జగన్ అండ చూసుకుని చెలరేగిపోయిన సునీల్   సీఐడీని దుర్వినియోగం చేసి, టీడీపీ కార్యకర్తలను అమానుషంగా-అమానవీయంగా వేధించి, కేసులు పెట్టించిన సునీల్‌కు పోస్టింగ్ ఇవ్వక పోవడం ద్వారా తాను కఠినంగా వ్యవహరిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.    సోషల్‌మీడియా పోస్టింగుల పేరుతో కొన్ని డజన్ల మంది టీడీపీ కార్యకర్తలను వేధించిన సునీల్ బృందం అరాచకాలపై, తెలుగుదేశం గతంలోనే పలు మార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే అప్పట్లో ఎంపి రఘురామకృష్ణంరాజును కస్టోడియల్  టార్చర్‌కు గురిచేసిన వైనం.. లోక్‌సభ స్పీకర్, సభాహక్కుల సంఘం వరకూ వెళ్లింది. ప్రస్తుత బదిలీల్లో సునీల్ కూడా ఉండటం, ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడంతో జగన్ బ్యాచ్ అధికారుల విషయంలో చంద్రబాబు సర్కార్ సీరియస్ గా వ్యవహరిస్తోందని స్పష్టమైంది. 

అలాగే మరో జగన్ బ్యాచ్ ఐపీఎస్ అధికారి రిషాంత్ రెడ్డి తీరు అప్పట్లోనే తీవ్ర విమర్శలకు గురైంది. చంద్రబాబు అంగళ్లులో ప్రచారానికి వెళ్లిన సందర్భంలో జరిగిన ఘటనలు, ఆ సమయంలో రిషాంత్ నేరుగా మీడియా ముందుకు వచ్చి తెలుగుదేశంపై విమర్శలు గుప్పించిన తీరు సంచలనం సృష్టించిన సంగడతి తెలిసిందే. రిషాంత్ రెడ్డి పోలీసు అధికారిగా కాకుండా జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలు పాటించారని అప్పట్లోనే పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఆయనకు కూడా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. రానున్న రోజులలో మరింత మంది అధికారులపై కూడా వేటు తప్పదని తెలుస్తోంది. 

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.